Stocks to watch today, 16 November 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 77.5 పాయింట్లు లేదా 0.42 శాతం రెడ్‌ కలర్‌లో 18,417 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్: స్నాక్ మేకర్ ఇవాళ దలాల్ స్ట్రీట్‌ అరంగేట్రం చేయనుంది. నవంబర్ 03-07 తేదీల మధ్య జరిగిన IPOలో రూ.881 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. ఒక్కొక్కటి రూ. 285-300 మధ్య మార్కెట్‌ చేసింది. ఈ IPO 26.67 రెట్లు సార్లు సబ్‌స్క్రైబ్ అయింది.


గ్లోబల్ హెల్త్: మేదాంత బ్రాండ్‌తో హెల్త్‌ బిజినెస్‌ చేస్తున్న ఈ కంపెనీ కూడా ఇవాళ స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ కానుంది. నవంబర్ 03-07 తేదీల మధ్య రూ. 319-336 ప్రైస్ బ్యాండ్‌లో IPO జరిగింది. ఈ ఇష్యూ 9.6 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): పోర్చుగల్‌లోని ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ TAP ఎయిర్ పోర్చుగల్, తన డిజిటల్ ట్రన్స్‌ఫర్మేషన్‌ కోసం, కొత్త ఆవిష్కరణల కోసం TCSను వ్యూహాత్మక భాగస్వామిగా ఎంపిక చేసింది. పోర్చుగల్‌లో ఎయిర్‌లైన్ డిజిటల్ సెంటర్‌ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుంది.


గోద్రెజ్ ప్రాపర్టీస్: పుణెలోని కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్‌లో రూ. 500 కోట్ల విలువైన అమ్మకాలు సాధించినట్లు ఈ రియల్టీ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్‌లో, పుణెలోని హింజేవాడిలో కొత్త ప్రాజెక్ట్ 'గోద్రెజ్ వుడ్స్‌విల్లే'ని ప్రారంభించింది.


భారత్ ఎలక్ట్రానిక్స్: రక్షణ రంగంలో వివిధ ప్రాజెక్టుల కోసం యంత్ర ఇండియా (YIL), ప్రొఫెన్స్ LLC, SVC టెక్ వెంచర్స్ LLP, హిందుస్థాన్ షిప్‌యార్డ్‌తో ఈ నవరత్న డిఫెన్స్ PSU వేర్వేరుగా అవగాహన ఒప్పందాలను (MoUs) కుదుర్చుకుంది.


FSN E-కామర్స్ వెంచర్స్(Nykaa): 33,73,243 నైకా షేర్లను రూ. 199.24 సగటు ధరతో సెగంటి ఇండియా మారిషస్ ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఆఫ్‌లోడ్ చేసింది. ఈ లావాదేవీ విలువ రూ. 67.2 కోట్లు. హెర్మేస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 25,82,921 షేర్లను కొనుగోలు చేసింది.


IIFL వెల్త్ మేనేజ్‌మెంట్: MAVM ఏంజెల్స్ నెట్‌వర్క్‌లో (MANPL) 91 శాతం ఈక్విటీ వాటా కొనుగోలును ఈ ఆర్థిక సేవల సంస్థ పూర్తి చేసింది. ఇప్పుడు, IIFL వెల్త్ మేనేజ్‌మెంట్ అనుబంధ సంస్థగా MANPL కొనసాగుతుంది.


ఫుడ్స్ & ఇన్: 2.21 కోట్ల కన్వర్టబుల్ వారెంట్ల జారీ ద్వారా రూ. 210 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదించింది. ఈ వారెంట్లను షేర్లుగా మార్చుకోవచ్చు. 


అషియానా హౌసింగ్: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ రియల్టీ సంస్థ రూ. 1.81 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. దాని నికర నష్టం గత ఏడాది కాలంలో రూ. 5.74 కోట్లుగా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.