రామ దంపతులతో భవానీ గుడిలో పూజలు చేయిస్తుంది. ఇద్దరికీ కొత్త బట్టలు పెట్టి వాటిని వేసుకు రమ్మని చెప్తుంది. మిమ్మల్ని చూస్తుంటే ఆ సీతారాముల లాగా ఎంత ముచ్చటగా ఉన్నారోనని భవానీ మెచ్చుకుంటుంది. ఇద్దరితో దేవుడికి నైవేద్యం చేయిస్తుంది. జానకి గుడిలో ప్రదక్షిణలు చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తుంది. పూజారి బాలకృష్ణుడి ఉయ్యాల ఇచ్చి రావి చెట్టుకి కట్టమని చెప్తారు. జానకి ఆ ఉయ్యాల చెట్టుకి కడుతుంది. వెంటనే అది ఊదీ కిందపడిపోతుంటే రామ పట్టుకుంటాడు. ఇదేంటి శుభమా అని అమ్మవారికి ముడుపు కడితే ఇలా జరిగిందని జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కిందపడిపోలేదు కదా పట్టుకున్నాను కదా అని భార్యకి ధైర్యం చెప్పి మరోసారి ఉయ్యాల వేరేచోట కట్టిస్తాడు.


Also Read: శ్రీనివాసరావుకి చీవాట్లు పెట్టిన మురారీ- భర్త ఊహల్లో తేలిపోతున్న కృష్ణ


గోవిందరాజులు బూజు పట్టిన రేడియో బయటకి తీసి దాని దుమ్ము దులుపుతాడు. అది చూసి మలయాళం పెద్దయ్యగారు ఏంటి మీరు చేసే పనని అరుస్తాడు. ఇలాంటి పనులు మీరు చేయడం ఏంటని గోల చేస్తాడు. జ్ఞానంబ భర్తని పిలుస్తుంది. ఆ రేడియో నువ్వే తుడువు అని చెప్పేసి మలయాళంకి ఇచ్చి లోపలికి వెళతాడు. రేడియోకి ఏమైనా అయితే నీ అంతు చూస్తానని అంటాడు. ఆ రేడియో అక్కడ పెట్టి మలయాళం లోపలికి వెళతాడు. అప్పుడే మల్లిక వచ్చి దాని మీద బట్టలు వేసి చూసుకోకుండా లాగేస్తుంది. దీంతో రేడియో కింద పడి ముక్కలవుతుంది. ఈ రేడియోని భార్య కంటే ఎక్కువగా చూసుకుంటారు ఇప్పుడు ఇది ముక్కలైందని తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుని అక్కడి నుంచి జారుకుంటుంది. మలయాళం వచ్చి దాన్ని చూసేసరికి పగిలిపోయి ఉంది ఏంటని టెన్షన్ పడుతాడు. రేడియో కోసం గోవిందరాజులు దాన్ని చూసి ఏడుస్తాడు.


Also Read: మినిస్టర్ ముందు రిషిని దోషిని చేసిన సారధి- తప్పు వసు మీదకి తోసేసిన శైలేంద్ర


శనివారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 


జ్ఞానంబ నిద్రలేచి ఇద్దరు పిల్లలున్న ఫోటో పట్టుకుని ఏడుస్తుంది. ఏమైందని గోవిందరాజులు కంగారుగా అడుగుతాడు. బాధపెట్టే గతాన్ని మర్చిపోవాలి గుర్తు చేసుకుని లాభమేముందని గోవిందరాజులు భార్యకి సర్ది చెప్తాడు. ఆ జ్ఞాపకం అంత త్వరగా మర్చిపోయేది కాదని అంటుంది. అన్నీ సవ్యంగా జరుగుతున్నప్పుడు ఈ కష్టాలు గుర్తు తెచ్చుకోవడం అవసరమా దాచేయమని చెప్తాడు. ఆ ఫోటో వెనుక గతం ఏంటో మిస్టరీగా మారింది. కష్టాన్ని దాచేస్తాను కానీ మీరు ఇచ్చిన మాట కోసం మాత్రం ఎదురుచూస్తున్నానని చెప్తుంది.


భవానీ గోవిందరాజులకి ఫోన్ చేస్తుంది. కాసేపు గోవిందరాజులని ఆడుకుంటుంది. రామ, జానకి ఎలా ఉన్నారని జ్ఞానంబ అడుగుతుంది. రెండో కోడలు నెల తప్పింది వదిలి రావడానికి లేదు అది కోతి అనడం జ్ఞానంబ వింటుంది. అసలు కుదురుగా ఉండదు వెనుకాలే ఉంటూ చూసుకుంటూ ఉండాలని అంటుంది. పెద్ద కోడలు గురించి చెప్పాలంటే లక్ష్మీ, సరస్వతి పేర్లు వస్తాయి కానీ తన గురించి చెప్పాలంటే కోతి, కుక్క గుర్తుకు వస్తాయని మల్లిక తిట్టుకుని వెళ్ళిపోతుంది.