జానకి దిగులుగా కూర్చుని ఉంటే అఖిల్, మల్లిక తనని మాటలతో దెప్పిపొడుస్తారు. అక్క గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని జెస్సి తిరగబడుతుంది. జానకి తన ఐపీఎస్ పుస్తకాలన్నీ మూటకట్టేస్తుంది. అప్పుడే రామ వచ్చి రోడ్డు మీద కనిపించి కానిస్టేబుల్ చెప్పిన విషయం చెప్పి కానిస్టేబుల్ పరీక్ష రాయమని సలహా ఇస్తాడు. ఏదైనా ఖాకీ డ్రెస్ కదా వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకుని అప్లై చేద్దామని ధైర్యం చెప్తాడు. దీంతో జానకి సరేనని ఒప్పుకుంటుంది. రామ కానిస్టేబుల్ కి ఫోన్ చేసి అప్లికేషన్ పెట్టడానికి ఒప్పించి తీసుకుని వెళ్తున్నట్టు చెప్తాడు. ఐపీఎస్ పరీక్షలు ఫెయిల్ అయినా వేరే పరీక్షలు రాయొచ్చని రామ తల్లితో చెప్తాడు. జానకి కల ఏంటి నువ్వు చెప్పేది ఏంటని జ్ఞానంబ అంటుంది.


Also Read: తులసిని నందుకి భార్యగా ఉండమని అడిగిన లాస్య- గృహలక్ష్మిలోకి మరో కొత్త ఎంట్రీ


కానిస్టేబుల్ నుంచి కూడా మెట్టు మెట్టు ఎదుగుతూ కల నేర్చుకోవచ్చని తల్లికి నచ్చజెప్తాడు. ఆ మాటలన్నీ విని మల్లిక లోలోపల నవ్వుకుంటుంది. కానిస్టేబుల్ పోస్ట్ కి అప్లై చేయడానికి వెళ్తున్నట్టు జానకి చెప్తుంది. విష్ణు షాపు లెక్కలు రాస్తుంటే మల్లిక వచ్చి జానకి కానిస్టేబుల్ పరీక్షలకు అప్లై చేస్తుందని చెప్తుంది. అంత చదువు చదివి కానిస్టేబుల్ చేయడం ఏంటని విష్ణు అంటాడు. ఐపీఎస్ పరీక్షలు ఫెయిల్ అయిన జానకి కానిస్టేబుల్ పరీక్షల్లో పాస్ అవుతుందా ఏంటని మల్లిక అనడం గోవిందరాజులు వింటాడు. నీ నోటికి మంచి మాటలు రావా, కానిస్టేబుల్ పరీక్షలు రాస్తే తప్పు ఏంటని కాస్త గడ్డి పెడతాడు. జానకిని ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావని జ్ఞానంబ అడుగుతుంది. ఆడపిల్లవి పెళ్ళైన దానివి ఎలా చేస్తావ్ ఆ పనులు చేయడం కష్టం కదా, రోడ్డు మీద ఎండలో నిలబడి కష్టపడుతున్న వాళ్ళని చూసి అయ్యో అని బాధపడ్డాను. ఇప్పుడు నా ఇంటి నుంచి వెళ్తుందని అనుకోలేదని జ్ఞానంబ అంటుంది.


Also Read: జానకికి అండగా నిలిచిన జ్ఞానంబ- సూటిపోటి మాటలతో హేళన చేసిన మల్లిక


నువ్వు కల కన్నది ఆఫీసర్ అవాలని కానీ కానిస్టేబుల్ అయితే నలుగురు హేళన చేస్తారు. సమయం సందర్భం లేకుండా బయటకి వెళ్లాల్సి వస్తుంది. అది నీ జీవితాన్నే కాదు కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది ఆలోచించుకోమని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ రామ మాత్రం తల్లి మాటలు గురించి ఆలోచించొద్దని కానిస్టేబుల్ నుంచి పై స్థాయికి కూడా ఎదగొచ్చు కదా అని అంటాడు. జానకి కష్టపడి చదువుతూ పరీక్షలకి ప్రిపేర్ అవుతుంది. కానిస్టేబుల్ పరీక్షలు రాసి పాస్ అవుతుంది. అది విని మల్లిక కుళ్ళుకుంటుంది. జానకి నెల రోజులు కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం వెళ్లాలని రామ చెప్తాడు. నెలరోజులంటే కష్టం కదా అని జ్ఞానంబ అంటే రామ నచ్చజెపుతాడు.  అత్తమామ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళి కానిస్టేబుల్ గా తిరిగొస్తుంది. కానిస్టేబుల్ డ్రెస్ వేసుకున్నందుకు బాధపడుతుంది. కానీ రామ మాత్రం ధైర్యం చెప్తాడు.