జ్ఞానంబ బాధగా కూర్చుని ఉండటం రామ చూసి భోజనం చేసిందా అని మలయాళంని అడుగుతాడు. లేదు అసలు వంట చేయమని చెప్పిన వాళ్ళు కూడా లేరని బాధగా చెప్తాడు. జానకి మల్లిక చేసిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉండగా రామ వస్తాడు. ఉదయం జరిగిన దాని గురించి బాధపడుతున్నారా అని అడుగుతాడు. మల్లిక నన్ను అన్న మాటలకంటే అత్తయ్యగారిని అన్న మాటలకి మరింత బాధగా ఉందని చెప్తుంది. విడిపోవాలని వేరుగా బతకాలని అనుకుంటుంది అందుకే అలా మాట్లాడింది, మొదటిసారి అత్తయ్య చిన్నబోవడం చూసి బాధగా ఉందని అంటుంది. మల్లికని ఆదర్శంగా తీసుకుని అఖిల్ కూడా అదే దారి పట్టాడు. ఆఫీసుకి ఇల్లు దూరంగా ఉందని చెప్పి ఇల్లు వదిలి వెళ్లిపోవాలని అనుకుంటున్నాడని చెప్తుంది.


Also Read: స్వప్నకి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చిన రాహుల్- రాజ్ జీవితం నాశనం చేసేందుకు రుద్రాణి కుట్ర


అందరూ కలిసి ఉండాలని అమ్మ కోరిక అని రామ అంటాడు. ముందు విష్ణుతో మాట్లాడతానని వెళతాడు. చాలా పెద్ద గొడవజరిగిందని ఇంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసిందని విష్ణు ఫోన్లో మాట్లాడుతూ ఉండగా జ్ఞానంబ వచ్చి సర్ది చెప్పలేవా అని అడుగుతుంది. గొడవ జరగ్గానే మల్లిక ఇల్లు చూసి అడ్వాన్స్ కూడా ఇచ్చిందని అంటాడు. తన మీద కోప్పడితే నన్ను అయినా వదిలేస్తుంది కానీ పంతం మాత్రం వదలడం లేదని విష్ణు చెప్తాడు. అందరినీ వదిలిపెట్టి వెళ్లిపోతావా అని రామ కూడా అడుగుతాడు. లేదంటే మల్లిక తనని వదిలేసి వెళ్లిపోతానంటుంది ఏం చెయ్యమంటారని అంటాడు. ఒక్కసారి తనకి అర్థం అయ్యేలా చెప్పి చూడమని జానకి విష్ణుని అడుగుతుంది. కానీ విష్ణు మాత్రం మల్లిక వినదని చెప్తాడు. రోజు గొడవపడటం కంటే వెళ్లిపోవడమే మంచిది అందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు విష్ణు తెగేసి చెప్పేస్తాడు.


మల్లిక కంటే ముందు వీడే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు మనం ఏం చేయలేమని గోవిందరాజులు బాధపడతాడు. అసలు రామ అప్పు చేసి ఉండకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఆస్తులు పోయి అప్పులు వాళ్ళ మీద ఎక్కడ పడతాయో అని అందరూ దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నారని జ్ఞానంబ అంటుంది. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతామన్నపుడు మన బతుకు మనం బతకడం నేర్చుకోవాలని గోవిందరాజులు సర్ది చెప్తాడు. తల్లి మాటలకి రామ బాధపడతాడు. తమ్ముళ్ళు ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి కారణం తనే అనుకుంటుందని, ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపాలని రామా అంటాడు. ఆపడానికి ఎలాంటి అవకాశాలు కనిపించడం లేదని జానకి అంటుంది.


Also Read: పొగరుని ఊసరవెల్లి అనేసిన రిషి- జగతి మీద కస్సుబుస్సులాడిన వసు!


జెస్సీ జ్ఞానంబకి కాఫీ తీసుకుని వస్తుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అఖిల్ ని నువ్వు ఎందుకు అడిగావని జ్ఞానంబ జెస్సిని ప్రశ్నిస్తుంది. ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా అని బాధగా అడుగుతుంది. జెస్సి ఏమి మాట్లాడలేక బాధపడుతుంది. జెస్సి అడగటం వల్ల ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అఖిల్ నిర్ణయం తీసుకున్నాడని జ్ఞానంబ అపార్థం చేసుకుంటుంది. జానకి వల్ల మాటలన్నీ వింటూ ఉంటుంది. జెస్సి ఏడుస్తూ వెళ్తే వెనుకాలే జానకి వెళ్ళి తనని ఓదారుస్తుంది. అత్తయ్య అపార్థం చేసుకున్నాడని జెస్సి బాధపడుతుంది. అందరినీ వదిలి వెళ్ళడం ఇష్టం లేదని జెస్సి చెప్తుంది. భర్త చెప్పిన మాట వినడం పెద్దలు మనకి నేర్పించారని జానకి అంటుంది.