రిషికి మీ ఆయన్ని పరిచయం చేశావా అని మినిస్టర్ వసుని అడుగుతాడు. లేదని ఆరోజు త్వరలోనే వస్తుందని చెప్తుంది. తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాలేజ్ లో పెట్టించు ఇద్దరూ కలిసి రిషి కళ్ళ ముందు ఉంటారని మినిస్టర్ సలహా ఇస్తాడు. వసు వాళ్ళ ఆయన గురించి చెప్పడం విని పొగరు ఏం జరగనట్టు ఎలా మాట్లాడుతుందని రిషి మనసులో అనుకుంటాడు. మహేంద్ర, జగతి అటు ఇటూ తిరుగుతూ రిషి, వసు ఫోన్లు చేయలేదేంటని ఆలోచిస్తూ ఉంటారు. కారులో వెళ్తూ వసు కావాలని చీర తీసి తన మీద పెట్టుకుని ఫోటోస్ దిగుతుంది. చీర బాగుంది కదా అని చెప్పి రిషికి థాంక్స్ చెప్తుంది. రిషితో కలిసి సెల్ఫీ తీసుకుంటూ నవ్వమని అడుగుతుంది. దీంతో రిషి కోపంగా కారు ఆపి తన మీద అరుస్తాడు.


రిషి: ఏమనుకుంటున్నావ్ నువ్వు.. ఆ తాళి నీ మెడలో నీ ఇష్టప్రకారమే పడిందని అన్నావ్ కదా. ఎవరతను ఎవరిని పెళ్లి చేసుకున్నావ్. ఏడి అతను. మన బంధం ఏమైంది, రిషి సర్ లేకపోతే బతకను అన్నావ్ ఆ మాటలన్నీ ఏమైపోయాయి. ఊరు వెళ్లే వరకు  బాగానే ఉన్నావ్ తర్వాత ఇలా మారిపోయావ్.. నా జీవితంతో ఆటలాడుతున్నావా, నీ ఇంటికి వస్తే వెళ్లమన్నావ్.. పోలీస్ స్టేషన్ కి వస్తే తాళిబొట్టు ఉంది అదేంటని అడిగితే ఏదేదో చెప్పి నోరు మూయించావ్. ఆ రాజీవ్ గాడు వచ్చి నా పెళ్ళాం అంటాడు. తీరా చూస్తే ఎస్సై అనేవరకు నిజం తెలియలేదు. అది నిజం కాకపోతే నిజం ఏంటి వసుధార


Also Read: మాజీ భార్య తులసికి చీర బహుమతిగా ఇచ్చిన నందు- రగిలిపోతున్న తాజా పెళ్ళాం


వసు: నిజమే నిజంగా నిజం సర్


రిషి: నీ మెడలో ఆ తాళి ఎవరు కట్టారు ఎన్నాళ్ళు దాస్తావ్ నువ్వు నీ ప్రేమ, మాటలు అన్నీ అబద్ధమా


వసు: గట్టిగా అరిచి మాట్లాడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా 


రిషి: ఎవడు వాడు.. నీ మెడలో తాళి కట్టింది ఎవడు వాడు


వసు: తాళికి సంబంధించిన వ్యక్తి గురించి అగౌరవంగా మాట్లాడొద్దు


రిషి: నేను ప్రేమిస్తున్నప్పుడు నో చెప్తే అయిపోయేది కదా ఎందుకు నన్ను బాధపెడుతున్నావ్ ఇదంతా నీ ప్లానా. ఎందుకు ఇలా రంగులు మారుస్తున్నావ్ ఎందుకు ఇలా జీవితాలు తల్లకిందులు చేస్తున్నావ్


వసు: నేను రంగులు మారుస్తానా, ఏంటి సర్ మీరు ఇలా కూడా మాట్లాడతారా


రిషి: నువ్వే మాట్లాడిస్తున్నావ్ ఆ తాళి ఎవరు కట్టారో చెప్పి తీరాలి


Also Read: మాళవిక ముందు అడ్డంగా బుక్కైన అభిమన్యు- వేద, యష్ జీవితం ఇబ్బందుల్లో పడబోతుందా?


వసు: ప్రేమగా అడిగితే చెప్పేదాన్ని కానీ మీరు చాలా ఘోరంగా మాట్లాడారు. నేను చెప్పను సర్ నన్ను ఎన్ని మాటలు అన్నారు, రంగులు మారుస్తున్నాన? నా గురించి ఇన్ని తెలుసుకున్న వాళ్ళు ఇది కూడా మీరే తెలుసుకోండి. నేను అసలు చెప్పను. ఒక్కమాట గుర్తుపెట్టుకోండి నా మెడలో తాళి కట్టిన వ్యక్తి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా.. ఈ విషయం నా మెడలో తాళి పడటానికి కారణమైన వ్యక్తికి తెలిస్తే ఊరుకోడు అనేసి వెళ్ళిపోతుంది.


మినిస్టర్ జగతికి ఫోన్ చేసి ప్రాజెక్ట్ కాన్సెప్ట్ చాలా బాగుందని మెచ్చుకుంటాడు. జగతి వసుకి ఫోన్ చేసి ఏమైందని అడుగుతుంది. వసు రిషి గురించి చాలా వెటకారంగా మాట్లాడుతుంది. ఆ అబ్బాయి చాలా మంచివాడు, మీ ఎండీనే సీరియస్ సింహం అని జగతి అంటుంది. వసు మాటలకి మహేంద్ర నవ్వుకుంటారు. ఆయన్ని ఆయనే తిట్టుకుంటున్నారని వసు జగతి మీద కస్సుబుస్సులాడి ఫోన్ పెట్టేస్తుంది.