తులసి నిద్రపోకుండా కేఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంకిత వచ్చి నిద్ర కూడా పోకుండా ఏం చేస్తున్నారని అడుగుతుంది. కేఫ్ ఆలోచన నాదే దాన్ని సక్సెస్ చేసే బాధ్యత కూడా నాదేనని తులసి అంటుంది. కేఫ్ పబ్లిసిటీ కోసం ఒక ఐడియా వచ్చిందని అదే రాస్తున్నా అని చెప్తుంది. బోలెడు పేపర్ల మీద రాయడం చింపేయడం చేస్తూ ఉంటుంది. చివరకు ఒకటి ఫైనల్ చేస్తుంది. అసలు ఏం రాస్తున్నావని పరంధామయ్య అడుగుతాడు. కేఫ్ ఇక్కడ ఉందని తెలిస్తేనే కదా రావడానికి అని కొంతమంది అంటున్నారు, అందుకే కేఫ్ కి పబ్లిసిటీ అవసరమని చెప్తుంది. లాస్య చాలా వెటకారం చేస్తుంది. కిచెన్ గురించి సలహాలు ఇవ్వమను ఒప్పుకుంటాను పబ్లిసిటీ గురించి తనకేం తెలుసని అవమానిస్తుంది. కోడళ్ళు తులసిని వెనకేసుకోస్తారు.


పాంప్లేట్స్ ప్రింట్ చేసి ఇద్దామని అంటుంది. తులసి ఐడియా తనకి నచ్చిందని నందు అనేసరికి లాస్య బిత్తరపోతుంది. వాటిని ఎవరు పంచుతారని లాస్య అంటే మనమేనని తులసి చెప్పేసరికి అభి ఫైర్ అవుతాడు. కేఫ్ పెట్టించి పరువు బజారున పెట్టావ్ ఇప్పుడు అందరినీ రోడ్డుమీదకి లాగాలని అనుకుంటున్నావా, ఏంటి మామ్ ఇది ఇలా తయారయ్యావ్ అని అభి సీరియస్ అవుతాడు. మన పని మనం చేసుకోవడానికి రెడీగా ఉన్నామని ప్రేమ్ అంటాడు. అభి అంకితని హాస్పిటల్ కి రెడీ అవడం లేదు ఎందుకని అడుగుతాడు. రావడం లేదని చెప్తుంది. అర్థం అయ్యింది ఆ మూకతో కలిసి పాంప్లేట్స్ పంచడానికి రోడ్డు మీద పడుతున్నవా అని కోపంగా అంటాడు. మర్యాదగా మాట్లాడమని అంకిత వార్నింగ్ ఇస్తుంది. కానీ అభి మాత్రం పాంప్లేట్స్ పంచడానికి వీల్లేదని గొడవపడతాడు.


Also Read: మాళవిక ముందు అడ్డంగా బుక్కైన అభిమన్యు- వేద, యష్ జీవితం ఇబ్బందుల్లో పడబోతుందా?


మనం భార్యాభర్తలమే కానీ అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలం కాదు. ఆంటీకి సపోర్ట్ గా నిలబడాలని అంకిత చెప్తుంది. కేఫ్ కి దూరంగా ఉండమని అభి అడుగుతాడు. కానీ అంకిత మాత్రం అభికి ఎదురుసమాధానం చెప్పేసి వెళ్ళిపోతుంది. ప్రేమ్ పాంప్లేట్స్ తీసుకుని వస్తాడు. ఆ పాంప్లేట్స్ తీసుకుని చూసి నందు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంట్లో వాళ్ళందరూ వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తామని అంటారు. తులసి అందరికీ కొన్ని పాంప్లేట్స్ ఇచ్చి పంచమని చెప్తుంది. అందరూ తనకి సపోర్ట్ గా ఉండటం చూసి నందు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఏమైందని ప్రేమ్ అడుగుతాడు. ఒకప్పుడు ఒంటరివాడిని అనుకున్నా కానీ ఇప్పుడు ఇంత మంది సపోర్ట్ చేస్తుంటే ఎమోషనల్ గా అనిపిస్తుందని చెప్తాడు.


Also Read: 'ఏవయ్యో పెనిమిటీ' అని రిషిని పిలిచిన వసు- మిస్టర్ ఇగో మాములోడు కాదు పొగరుని ఆట ఆడించేస్తున్నాడు


అందరూ సంబరంగా పాంప్లేట్స్ పంచుతూ ఉంటారు. కాసేపటికి కేఫ్ మొత్తం కస్టార్స్ తో నిండిపోతుంది. అక్కడికి వచ్చిన ఒకతను లాస్యని పిలుస్తాడు. టేబుల్ మీద మంచినీళ్ళు కూడా లేవు ఏ చేస్తున్నారు తీసుకురా అని అడుగుతాడు. లాస్య కోపంగా వెళ్ళి తీసుకుని వస్తుంది. అది చూసి తులసి నవ్వుకుంటుంది. తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు అందరూ సంతోషపడతారు. నందు, తులసి కలిసి మాట్లాడుకోవడం ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఆనందపడతారు. కేఫ్ డెవలప్ చేసుకోవడానికి ఎంతగా కష్టపడుతున్నారో అని పరంధామయ్య వాళ్ళని చూసి అంటాడు. లాస్య అదంతా గమనిస్తూ నందు మళ్ళీ తులసికి దగ్గర అవుతాడా అని భయపడుతుంది.