ఆరోజు జానకి నాకు కిడ్నీ దానం చేసి ఉంటే ఈరోజు నేను ఇంత విషం తీసుకుని చచ్చిపోయే దాన్ని అని జ్ఞానంబ కోపంగా అంటుంది. జానకి కిడ్నీ తనకే ఇచ్చేయమని చెప్పేదాన్ని. అయినా తన మీద నీకు అంత కక్ష్య ఏంటని గోవిందరాజులు అంటాడు. అఖిల్ ఏమి పట్టకుండా వెళ్ళిపోతాడు. బాబు ఏడుస్తున్న పట్టించుకోకుండా పరధ్యానంలో ఉంటుంది జెస్సి. అఖిల్ వచ్చి కోపంగా బుద్ధి ఉందా బాబుని ఇంత చివరన పడుకోబెట్టావ్ కింద పడిపోతే ఏంటని అరుస్తాడు. బాబుని తీసుకుని జ్ఞానంబ వాళ్ళ దగ్గరకి వస్తాడు.


అఖిల్: ఈ ఇంటికి శని పట్టింది నా బిడ్డని బలి కోరుకుంటుంది


జెస్సి: జానకి అక్క గురించి ఆలోచించలేదు బాబు మంచం చివరకు వచ్చాడంట


అఖిల్: పెద్ద వదినకి సమస్య వస్తే దానికి అందరూ ఆలోచిస్తూ కూర్చోవాలా. వదిన ఏం చేసినా గొప్పగా పొగుడుతూ ఉంటాడు కదా అందుకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఉమ్మడి కుటుంబం అంటే ఇలాగే తగలబడుతుంది


Also Read: మండపంలో తులసి, లాస్య గొడవ - చివరి నిమిషంలో పెళ్లి చేసుకోనని చెప్పిన దివ్య, రాజ్యలక్ష్మి షాక్


మల్లిక; కరెక్ట్ గా చెప్పావ్, మళ్ళీ వేరుగా వెళ్లిపోతే వాళ్ళని మోసేదేవరు. వాళ్ళని ఆకాశానికి ఎత్తుతూ భజన చేయాలి కదా 


అఖిల్: ఎవరి బతుకులు వాళ్ళు బతుకుదాం అంటే ఆ మహాతల్లి వినలేదు అప్పుడే జానకి వస్తుంది. ఒకసారి బయటకి వెళ్ళి చూడండి అందరూ మన కుటుంబం గురించి ఎంత పరువు తక్కువగా మాట్లాడుతున్నారో.. దీనంతటకీ కారణం వదినే. స్టేషన్ నుంచి అన్నయ్య అయితే వస్తాడు కానీ పోయిన పరువు తిరిగి రాదు కదా. ఇప్పుడు కూడా తాను తలుచుకుంటే వాళ్ళ బాస్ ని బతిమలాడి విడిపించొచ్చు. కానీ తను మాత్రం అలా చేయదు. పబ్లిసిటీ కావాలి కదా. నీ పెద్ద కోడలు నిలువెత్తు స్వార్థానికి నిదర్శనం. ఇలాంటి పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని పెద్దన్నయ్య ఏం బాగుపడతాడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనేసరికి గోవిందరాజులు కోపంగా లాగిపెట్టి చెంప పగలగొడతాడు.


గోవిందరాజులు: మర్యాద తప్పి మాట్లాడకు నీ హద్దుల్లో నువ్వు ఉండు పెద్దన్నయ్య భార్య గురించి మాట్లాడే హక్కు లేదు


అఖిల్: ఇదే చెంప దెబ్బ వదినకి పడి ఉంటే అన్నయ్య స్టేషన్ లో ఉండేవాడు కాదు ముందు ఆవిడని సంస్కరించండి


Also Read: మిస్టర్ ఇగోలో రొమాంటిక్ యాంగిల్, అసలు ఆగడం లేదుగా- కిడ్నాపర్స్ కి చెక్ బెట్టబోతున్న రిషి


నువ్వు ఇలా మౌనంగా ఉండబట్టే అఖిల్ అలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి సమయంలో జానకి వాళ్ళ మాటలు విని ఉంటే అని చూసేసరికి ఎదురుగా జానకి ఉంటుంది. నేను మొత్తం విన్నానని ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళికుమిలి కుమిలి ఏడుస్తుంది. మిమ్మల్ని చూడాలని ఉంది ఒకసారి కనిపించరా ప్లీజ్ అని జానకి కోరుకోగానే రామ పక్కనే ప్రత్యక్షమవుతాడు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ సరసాలు ఆడుకుంటారు. అక్కడ సీన్ ఏంటో వీళ్ళ సరసాలు ఏంటో పిచ్చ తలనొప్పి పుట్టించేశారు.