కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి తల్లిదండ్రులని రమ్మని పంతులు పిలుస్తాడు. నందుతో కలిసి తులసి వెళ్లబోతుంటే లాస్య అడ్డుపడుతుంది. ఆయన భార్యని నేను, కన్యాదానం చేసే హక్కు తనదేనని లాస్య అంటుంది.


తులసి: పెళ్లి కూతురు తల్లిని నేను. దివ్యకి కన్యాదానం చేసే హక్కు నాది


లాస్య: కన్యాదానం ఎవరు చేయాలి భార్యాభర్తలా లేదంటే పరాయి వాళ్ళా


తులసి; కన్నతల్లిని పక్కన ఉండగా వేరేవరో ఆ స్థానంలో కూర్చుని ఎలా చేస్తారు పంతులు గారు


లాస్య: నా మొగుడు పక్కన పరాయి ఆడది కూర్చోవడానికి ఒప్పుకోను. ఇన్ డైరెక్ట్ గా నందు భార్యగా అనిపించుకోవాలని చూస్తున్నావ్ నేను ఒప్పుకోను


తులసి: కన్యాదానం చేసి దివ్య తల్లిగా చెప్పుకోవాలని చూస్తున్నావ్ నేను ఒప్పుకోను


Also Read: మిస్టర్ ఇగోలో రొమాంటిక్ యాంగిల్, అసలు ఆగడం లేదుగా- కిడ్నాపర్స్ కి చెక్ బెట్టబోతున్న రిషి


ఏంటక్కా ఇది వీధి పంపుల దగ్గర కొట్లాటలా ఉందని బసవయ్య అనేసరికి అనసూయ మధ్యలో దూరవద్దని అంటుంది. పెళ్లి కూతురి తండ్రి విగ్రహంలా నిలబడుతున్నాడు వాళ్ళేమో తిట్టుకుంటున్నారని అంటాడు. ఇది వాళ్ళ ఇంటి విషయం తేల్చుకోవాల్సింది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం సపోర్ట్ చేయాలని రాజ్యలక్ష్మి చెప్తుంది. నువ్వు ఏ విషయం తేల్చుకుంటే మేము ఇక్కడ ఉండాలో వెళ్లిపోవాలో తేల్చుకుంటామని సరస్వతి అంటుంది. అసలు నువ్వు మా ఇంటి మనిషివి కాదు ఈ ఇంటి కోడలిని నేను. నువ్వు కన్యాదానం చేసుకో కానీ మా ఆయన్ని అప్పు ఇచ్చే ప్రసక్తే లేదని లాస్య గొడవకు దిగుతుంది.  


నువ్వు అమ్మ వచ్చి కన్యాదానం చేస్తారా లేదంటే నన్ను ఇక్కడ నుంచి లేచి వెళ్లిపొమ్మని అంటారా అని దివ్య నిలదీస్తుంది. ఇదేంటి కథ అడ్డం తిరుగుతుంది దివ్య నా కోడలు అవాలి నా పగ తీర్చుకునే అవకాశం వదులుకోనని రాజ్యలక్ష్మి మనసులో అనుకుంటుంది. లాస్యతో ఈ సంబంధం గురించి మర్చిపో బ్రీఫ్ కేసు కూడ మర్చిపొమ్మని మెల్లగా చెప్తుంది. వీళ్ళు వినిపించుకోవడం లేదు పెళ్లి పీటల మీద నుంచి లేచి రా విక్రమ్ అనేసరికి లాస్యనే తగ్గుతుంది. సరే తులసితో కలిసి వెళ్ళి కన్యాదానం చెయ్యి కానీ మనసులో నన్నే ఊహించుకోమని అంటుంది.


Also Read: యష్ హెల్త్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్- ఎన్నెన్నో జన్మలబంధంలో 'పవిత్రబంధం'


నందు, తులసి కలిసి విక్రమ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. దివ్య చాలా సంతోషిస్తుంది. ప్రియ రోడ్డు మీద పరుగులు పెట్టుకుంటూ పెళ్లి జరిగే మండపానికి వెళ్తుంది. దివ్య బంగారం లాంటి భవిష్యత్ ముక్కలు కాబోతుందని లాస్య సంబరపడుతుంది. దివ్య, విక్రమ్ జీలకర్ర బెల్లం తంతు పూర్తవుతుంది. కూతురి పెళ్లి చూస్తూ నందు వాళ్ళు మురిసిపోతారు. వాళ్ళ అమ్మలాగే దివ్య కూడా జీవితాంతం కన్నీళ్లతో మిగిలిపోవాలని లాస్య మనసులో కోరుకుంటుంది. పెళ్లి జరుగుతుండగా నందుకి ఫోన్ వస్తుంది. మంగళసూత్రం కట్టించే టైమ్ ఇక్కడే ఉండమని తులసి అంటుంది కానీ ఇప్పుడే వస్తానని నందు పక్కకి వెళతాడు. ప్రియ తులసి దగ్గరకి వెళ్లబోతుంటే రాజ్యలక్ష్మి వస్తుంది. ప్రియని సంజయ్ చూసేస్తాడు. చివరికి ప్రియ నందు దగ్గరకి వెళ్తుంది. అది చూసి సంజయ్ పరుగున వెళ్ళబోతాడు.