ఖుషి వేద కోసం గులాబీ పూల బొకే తీసుకొస్తుంది. డాడీ నీ మీద అలిగారు కదా అందుకని ఈ బొకే ఇచ్చి ప్రేమగా మాట్లాడు అప్పుడు నేను వచ్చి పప్పీ ఇస్తాను కోపం పోయి నీతో కూడా ప్రేమగా మాట్లాడతారని ఖుషి చెప్తుంది. డాడీ మమ్మీ మీద అలగడం నాకు నచ్చలేదు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అప్పుడు నేను హ్యాపీగా ఉంటానని అంటుంది. అప్పుడే వేదకి యష్ నుంచి ఫోన్ వస్తుంది. యశోధర కి యాక్సిడెంట్ అయ్యిందని అవతలి వ్యక్తి చెప్పేసరికి వేద కూలబడిపోతుంది. వెంటనే హాస్పిటల్ కి పరుగులు తీస్తారు. బ్యాక్ బోన్ బాగా డ్యామేజ్ అయ్యిందని సర్జరీ చేశామని డాక్టర్ చెప్తాడు. ప్రమాదం ఏమి లేదు కదా అని మాలిని అంటే ఇంకా రిస్క్ లోనే ఉన్నారు 50-50 ఛాన్స్. ఒక్కోసారి కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు.
Also Read: కృష్ణ, మురారీ క్యూట్ మూమెంట్- నందిని మిస్సింగ్, రేవతి మీద ఫైర్ అయిన ఈశ్వర్
హాస్పిటల్ బెడ్ మీద ఉన్న యష్ ని చూసి వేద కుమిలి కుమిలి ఏడుస్తుంది. అభిమన్యు మళ్ళీ చిత్ర ఫోటో ఫోన్లో చూస్తూ మురిసిపోతుండగా మాళవిక అరుచుకుంటూ కంగారుగా వస్తుంది. యశోధర్ కి సీరియస్ గా ఉంది, తప్పతాగి యాక్సిడెంట్ అయ్యిందని చెప్తుంది. బిజినెస్ లో ఉన్న అడ్డు తొలిగిపోయిందని అభి చంకలు గుద్దుకుంటాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోగానే చూశావా అన్నీ గుడ్ న్యూస్ లు వింటున్నావ్ నేను నీ లక్కీ ఛామ్ అంటుంది. నువ్వు కాదు నా లక్కీ ఛామ్ తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని మనసులో అనుకుంటాడు. వేద డాక్టర్ ని కలుస్తుంది. యష్ కి ప్రాణాపాయం తప్పింది ఎప్పుడైనా స్పృహలోకి రావచ్చు. కానీ ఆయన లోయర్ బాడీ పారలైజ్ అయ్యింది. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ ఆయన ట్రీట్మెంట్ కి రియాక్ట్ అయితే బాగుంటుంది. ఆయన బెడ్ మీద ఉండాల్సి రావచ్చని చెప్పేసరికి వేద షాక్ అవుతుంది.
యష్ కళ్లు తెరవగానే ఎదురుగా వేద కనిపిస్తుంది. తెల్లారిన తర్వాత వేద గుడికి వెళ్ళి దేవుడి ముందు తన ఘోష వెళ్లబోసుకుంటుంది. ఎన్నో పూజలు చేశాను ఎందుకు నాకు ఇంత శిక్ష వేశావు. నా వల్ల తప్పు జరిగి ఉంటే నన్ను శిక్షించు. నా భర్త నాకు ప్రాణం. ఆయన బాధపడుతుంటే నేను ఎలా చూడగలను నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. నువ్వే నా కష్టం తీర్చాలని కన్నీళ్ళతో వేడుకుంటుంది. ఆ రోజు గుడిలో కనిపించిన సోదమ్మ మళ్ళీ కనిపిస్తుంది. తన భర్తని ఈ గండం నుంచి తప్పించమని అడుగుతుంది. నీ మనసు మంచిది. చిమ్మ చీకటి తొలగిపోతుంది. చీకటి వెలుగుల బతుకు నీది. చిట్ట చివరికి గెలుపు నీది. ధైర్యంగా ఉండు నీకు అన్నీ మంచిరోజులేనని చెప్పేసి వెళ్ళిపోతుంది. కాసేపటికి డాక్టర్ మళ్ళీ యశోధర్ అవుట్ హాఫ్ డేంజర్ అని చెప్తాడు. కానీ పేషెంట్ కాళ్ళలో నరాలు దెబ్బతిన్నాయి కదల్లేడని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు.
Also Read: రామాని షూట్ చేసిన మనోహర్ - జానకి మీద ద్వేషం పెంచుకున్న జ్ఞానంబ
నా హజ్బెండ్ ట్రీట్మెంట్ మొత్తం నేనే మానిటర్ చేస్తాను. ఈ యాక్సిడెంట్ వల్ల ఇలా అయ్యింది తప్ప ఎలాంటి ఇష్యూస్ లేవని తనని త్వరలోనే నడిచేలా చేస్తానని వేద చెప్తుంది. బెడ్ మీద దిగులుగా ఉన్న యష్ కి ధైర్యం చెప్పేందుకు చూస్తుంది. ఆ మాటలన్నీ సులోచన వింటూ ఉంటుంది.