ఈ రాశివారు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఏప్రిల్ 17 రాశిఫలాలు

Rasi Phalalu Today 17th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Continues below advertisement

ఏప్రిల్ 17 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీరు స్నేహితులతో చాలా బిజీగా ఉంటారు. బంధువుల నుంచి ఏదైనా బహుమతిని అందుకునే అవకాశం ఉంది. కొత్త స్నేహం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి. పనుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉద్యోగులు లక్ష్యాన్ని పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వ పనుల్లో విజయం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.

Continues below advertisement

వృషభ రాశి

ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన వార్తలు అందుకుంటారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ముందుకుసాగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ పడిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంది. మీ ప్రియమైన వ్యక్తితో సమయం స్పెండ్ చేస్తారు. కొత్త బాధ్యతలు చేపడతారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గౌరవం పొందుతారు. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. 

మిథున రాశి

మీ రోజు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. మానసిక ఆందోళన ఉంటుంది. పనిచేయాలనే ధ్యాస ఉండదు. కార్యాలయంలో అధికారుల, సహోద్యోగుల ప్రవర్తన కూడా సరిగా ఉండదు. ఖర్చులు పెరుగుతాయి. పిల్లలతో విభేదాలు రావొచ్చు. పొంచిఉన్న శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఓపికగా వ్యవహరించండి. మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి.

Also Read: గంగా పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, పుష్కరాలు ఎలా ప్రారంభమయ్యాయి!

కర్కాటకం

ఈ రోజు ఈ రాశివారు  జాగ్రత్తగా ప్రవర్తించాలి. కుటుంబ సభ్యులతో అనవసర వాదన పెట్టుకోవద్దు. కోపాన్ని అదుపుచేయండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. నిబంధనలకు విరుద్ధంగా ఏ పనీ చేయవద్దు. భగవంతుని స్మరణ మీకు  మనశ్శాంతిని ఇస్తుంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సానుకూలంగా ఉంటారు.

సింహ రాశి 

ఈ రోజు మీకు ఫలవంతమైన రోజు. జీవిత భాగస్వామితో  మనస్పర్థలు రావచ్చు. వ్యాపారంలో కూడా భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. అనవసర ఖర్చులున్నాయి జాగ్రత్తపడండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. కెరీర్ సంబంధిత సమాచారం అందుబాటులో ఉంటుంది.

కన్యా రాశి

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది.కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది. మనసు కూడా ఆనందంగా ఉంటుంది. సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. సహోద్యోగుల పూర్తి సహకారం లభిస్తుంది.మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడపగలుగుతారు.ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడపగలుగుతారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం సంతోషాన్ని ఇస్తుంది.

తులా రాశి

మీ రోజు సాధారణంగా ఉంటుంది. చదువులో ఆటంకాలు ఏర్పడవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించవద్దు. మీరు సన్నిహితులను కలుస్తారు. మీకున్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఉద్యోగులు తమపనిపై మాత్రమే దృష్టిపెట్టాలి. సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

Alos Read: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!

వృశ్చిక రాశి

ఈ రోజు ఏదో విషయంలో భయపడతారు. కుటుంబ సభ్యులు లేదా బంధువులతో వివాద సూచనలున్నాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తిపత్రాలు జాగ్రత్తగా ఉంచాలి. ఉద్యోగులు ఈరోజు పనిచేయడం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనుస్సు రాశి

ఈ రోజు మీరు ఆధ్యాత్మికత విషయాలపై ఆసక్తి చూపిస్తారు. కొత్త ప్రణాళికలు అమలుచేయడంలో ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ మనసు సంతోషంగా ఉంటుంది.  అనుకోని ప్రయాణాలు చేస్తారు..బంధుమిత్రులను కలుస్తారు. అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 

మకర రాశి

ఈరోజు స్నేహితునితో వాదోపవాదాలు జరగవచ్చు. మాటపై నిగ్రహం మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. స్టాక్ మార్కెట్‌లో మూలధనాన్ని పెట్టుబడి పెట్టగలుగుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కంప్యూటర్లతో పనిచేసే వ్యక్తులు సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. విద్యార్థులు చదువులో ఎక్కువ శ్రద్ధ వహించాలి.

కుంభ రాశి

ఆర్థికపరంగా ఈరోజు మీకు మంచిరోజు. మంచి భోజనాన్ని ఆస్వాదిస్తారు. స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటంది. రోజంతా ఆనందంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు కష్టానికి తగిన ఫలితం అందుతుంది. 

మీన రాశి

ఈ రోజు మీ మనసులో ఏదో గందరగోళం నెలకొంటుంది. ఆర్థికపరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి..వాటిని నియంత్రించాలి. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మాటతీరు మార్చుకోకుంటే ఇబ్బందిపడాల్సి ఉంటుంది. మీకు అత్యంత ప్రయమైనవారు మీకు దూరమవడం మిమ్మల్ని బాధపెడుతుంది. కుటుంబంలో కలహాలు సమసిపోతాయి.

Continues below advertisement