అఖిల్ రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి చదువుతున్నాడు నువ్వు సహకరించు అని జ్ఞానంబ అంటుంది. అఖిల్ విషయం చెప్పమని జానకికి సైగ చేస్తాడు. జానకి కూడా అఖిల్ విషయం చెప్పడానికి ఇదే మంచి సమయం అనుకుని చెప్పేందుకు ట్రై చేస్తుంటే నీలావతి జ్ఞానంబ అని పిలుస్తూ వస్తుంది. మల్లికా గర్భవతి కదా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోడానికి వచ్చాను అని కవర్ చేస్తుంది. పక్క ఊరిలో మంచి సంబంధం ఉంది అమ్మాయి కూడా బాగుంటుంది నీ చిన్న కొడుకు అఖిల్ కు మాట్లాడమంటావా అని నీలావతి అంటుంది. ఆ మాటకి అఖిల్, జానకి షాక్ అవడం మల్లిక గమనిస్తూ ఉంటుంది. ఇంకా రెచ్చగొట్టు అని నీలావతికి మల్లిక సైగ చేస్తుంది. ఆ కుటుంబం కూడా నువ్వు కోరుకున్నట్టే చాలా పద్ధతిగా ఉంటుంది, నీ సంబంధం అంటే ఇష్టం కూడాను నువ్వు సరే అంటే వెంటనే మాట్లాడేస్తాను అని అంటుంది. వాడు చిన్న పిల్లాడు అప్పుడే పెళ్లి ఏంటి, నాలుగు సంవత్సరాల వరకు పెళ్లి ఆలోచనే లేదు వాడు స్థిర పడిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అని జ్ఞానంబ చెప్తుంది.


అత్తయ్యగారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే చాలా పెద్ద సమస్యే అవుతుంది, జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఊరుకోరు అని జానకి మనసులో అనుకుంటుంది. అఖిల్ పెళ్లి అయ్యాక కూడా స్టడీస్ కంటిన్యూ చెయ్యొచ్చు తనకి కుండ ఒక తోడు ఉంటుంది కదా అని జానకి అంటుంది. పెళ్లి అనేది బాధ్యతతో పాటు భరియాయి కూడా తీసుకుని వస్తుంది దాని వల్ల చదువు పక్కదారి పడుతుంది. అఖిల్ చదువు పూర్తయ్యే వరకు పెళ్లి ప్రస్తావన లేదని తేల్చి చెప్తుంది. అప్పుడే వాడి పెళ్ళికి తొందర ఏముందని రామా కూడా అంటాడు. రేపు వినాయక చవితి కదా నీ చేతుల మీదగా పూజ చేయించాలని అనుకున్నా నీ పేరు మీద బట్టలు కూడా పెట్టాలని అనుకున్నా ఆ ఏర్పాట్లు చూడమని జానకికి జ్ఞానంబ పురమాయిస్తుంది.


Also Read: తులసిని ఛీ కొట్టి వెళ్ళిన సామ్రాట్- పార్టీ చేసుకుంటున్న నందు, లాస్య


నీలావతితో పెళ్లి నాటకం ఆదిస్తే జానకి టెన్షన్ ఏంటో, అఖిల్ తడబాటు ఏంటో తెలుస్తుంది అనుకుంటే వీళ్ళు సైగలు చేసుకుంటున్నారు కానీ విషయం బయటకి చెప్పడం లేదు ఎలా అని మల్లిక మనసులో అనుకుంటుంది. ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశం లేదని అత్తయ్యగారు తెగేసి చెప్పారు కానీ జెస్సి ప్రగ్నన్సీ గురించి బయట ప్రపంచానికి తెలియకుండా ఎలా చెయ్యాలి, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి అని జానకి ఆలోచిస్తూ ఉంటుంది. డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా విషయం చెప్పి రామాగారు నిర్ణయం అడగాలని అనుకుంటుంది. అప్పుడే రామా చాలా సంతోషంగా ఉందని అంటాడు. జానకి తన స్నేహితురాలి వంక పెట్టి రామాని సలహా అడుగుతుంది. ఈ విషయం వెంటనే ఇంట్లో చెప్పమని చెప్పండి విజయం సాధిస్తుంది అని సలహా ఇస్తాడు.


రామాగారు చెప్పినట్టు ఎలాగైనా అత్తయ్యగారికి విషయం చెప్పాలి అని జానకి నిర్ణయం తీసుకుంటుంది. జ్ఞానంబ ఇంట్లో వినాయక చవితి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. జానకిని ఇరికించాలని మల్లిక మళ్ళీ ప్లాన్ వేస్తుంది. ఎలాగైనా నీతో ఈరోజు ఒక తప్పు చేయించి నిన్ను ఇరికిస్తా అని జానకి నడిచే దారిలో అరటి తొక్క వేస్తుంది. అరటి తొక్క మీద కాలు వేసి జారీ పడబోతుంటే రామ పట్టుకుంటాడు, తన చేతిలో ఉన్న పూలు అన్నీ వాళ్ళిద్దరి మీద పడతాయి. అది చూసి మల్లిక కుళ్లుకుంటుంది. పూజ పూలు కిందపడేసి జానకి చాలా పెద్ద తప్పు చేసింది అత్తయ్యగారు ఒక తప్పు కొట్టేయండి అని అరుస్తూ ఉంటుంది. ఏయ్ నోరు ముస్తావా అని జ్ఞానంబ కసురుకుంటుంది. జ్ఞానంబ మాత్రం నమ్మకంగా ఏమి కాలేదులే ఆలోచించకు పూజ నీ చేతుల మీదగానే జరగాలి అని అంటుంది.     


Also Read: మాధవ్ కి వాత పెట్టిన భాగ్యమ్మ- రాధని మెచ్చుకున్న దేవుడమ్మ, రెండు ఇళ్ళల్లో వినాయక చవితి సంబరాలు