వసంత్, చిత్ర పెళ్లి గురించి వేద, యష్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి కూర్చోబెడతాడు. ఇందులో మాట్లాడుకోవడానికి ఏముంది దామోదర్ చెల్లి నిధితో ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేశాము కదా అని మాలిని అంటుంది. అల్లుడుగారు మనసు మార్చుకున్నారేమో అని సులోచన అంటుంది. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది. చిత్రకి వసంత్ కి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు యష్ చెప్తాడు. నాకు నచ్చలేదని మాలిని అంటుంది. ప్రేమించుకున్న వాళ్ళని విడదీసి వాళ్ళ ఉసురు పోసుకుంటామా ఏంటి అని సులోచన, మాలిని తిట్టుకుంటూ ఉండగా దామోదర్ ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూసి ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు.


నేను నీకు చెప్పిందేంటి నువ్వు చేస్తుందేంటి అని దామోదర్ సీరియస్ గా అడుగుతాడు. ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం అని యష్ నీళ్ళు నములుతూ చెప్తాడు. కాసేపు వాళ్ళని టెన్షన్ పెడతాడు. ఆయన మిమ్మల్ని పొగుతున్నారు టెన్షన్ పడకండి అని దామోదర్ భార్య చెప్తుంది. శర్మ దేవుడు ముందు దణ్ణం పెట్టుకుంటూ చిత్ర ప్రేమ గెలవాలి తనకి వసంత్ కి పెళ్లి జరగాలి అని కోరుకుంటాడు. తదాస్తు అని సులోచన అంటుంది. ఆ పెళ్లి జరగడం చాలా కష్టమని శర్మ భయపడతాడు. భర్త చేసిన తప్పును మన వేద సరిదిద్దుతుంది. మన వేద తాను మారేలా చేసిందని సులోచన అంటుంది. వీళ్లిద్దరి మాటలు చిత్ర వింటూ కంగారు పడుతుంది.


Also Read: దేవి మీద ప్రేమ పెంచుకుంటున్న చిన్మయి- అయోమయంలో రుక్మిణి, ఆదిత్యపై సత్య అనుమానం


మాలిని దామోదర్ చెల్లి నిధితో వసంత్ పెళ్లి చెయ్యాలని పట్టుదలగా ఉన్నారని శర్మ అనడంతో ఆమె పట్టుదలతో ఉంటే ఏంటి వాళ్ళ పెళ్లి ఎలా చెయ్యాలో, దామోదర్ గారికి ఎం చెప్పాలో నాకు బాగా తెలుసు అని సులోచన చెప్తుంది. ఆ మాటలు బయట ఉన్న మాలిని కూడా వింటుంది. ఆ మాలిని ప్లాన్ ఫెయిల్ చేస్తాను, ఆవిడ గారి ముందే చిత్ర, వసంత్ పెళ్లి చేస్తాను అని శపథం చేస్తుంది. అమ్మ సులోచన పెద్ద ప్లానె వేశావే నేను ఉండగా దామోదర్ గారిని నీ బుట్టలో పడానిస్తానా మలబార్ మాలిని ఇక్కడ తగ్గేదెలే అని అనుకుంటుంది.


యశోధర్ గారు చాలా మంచి వాళ్ళు, తను నన్ను సొంత చెల్లెలిలాగా చూసుకుంటున్నారు, నేను లైక్ చేసిన వసంత్ తో నా పెళ్లి జరుగుతుంది అంటే అందుకు కారణం యశోధర్ గారే అని నిధి పొగుడుతుంది. మీ యశోధర్ పర్ఫెక్ట్ జెంటిల్మెంట్ అని దామోదర్ అంటే యష్ చాలా లక్కీ వేద లాంటి మంచి భార్య దొరికిందని ఆయన భార్య అంటుంది. మనం పెళ్లి చెయ్యాలని చూస్తే కొంతమంది చెడగొట్టాలని చూస్తారు. ఎదురింటి వాళ్ళే పక్కింటి వాళ్ళో వచ్చి వసంత్ ని మా అమ్మాయి ప్రేమిస్తుందని చెప్తూ ఉంటారు వాళ్ళని పట్టించుకోవద్దని మాలిని చెప్తుంది. నేను అలాంటివి ఏమి పట్టించుకోను వసంత్ తో నిధి పెళ్లి జరుగుతుంది, జరిగి తీరాలి అని దామోదర్ అంటాడు.


Also Read: మోనితను నడిరోడ్డుపై వదిలేసి దీప దగ్గరకు వెళ్లిపోయిన కార్తీక్, మోనితకు పెద్ద షాకే ఇది!


యష్, వేద గదిలోకి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటారు. చిత్ర, వసంత్ పెళ్ళికి ఒప్పుకుంటున్నట్టు అందరి ముందు చెప్పిన మీరే ఆయన ముందు కూడ చెప్తే సరిపోయేది కదా అని యష్ తో అంటుంది. వచ్చి రాగానే ఆయన నిధి, వసంత్ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతుంటే నేను ఎలా మాట్లాడాను, అసలే దామోదర్ చెల్లి విషయంలో చాలా సెన్సిటివ్ గా ఉంటారని యష్ చెప్తాడు. దానికి వేద మాత్రం ఒప్పుకోదు. ఇప్పుడు ఎం చెయ్యాలా అని తలపట్టుకుంటాడు. విషయం చెప్పి ఒప్పించడం తప్పితే వేరే దారి లేదని వేద ఖరాఖండిగా చెప్తుంది.


దామోదర్ వాళ్ళు బయటకి వెళ్తుంటే సులోచన వాళ్ళని పలకరిస్తుంది. మీరు మా ఆతిథ్యం కూడా తీసుకోవాలి అని సులోచన అనేసరికి వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి బయటకి వెళ్తున్నారని మాలిని అంటుంది. ఇద్దరు మాట మాట అనుకుంటూ కవర్ చేసుకుంటూ పోట్లాడుకుంటారు.