Horoscope 8th September 2022:  ఈ రోజు తుల రాశి వారు తమ పిల్లల కెరీర్ కోసం అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోవలసి ఉంటుంది. మేష రాశివారు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. సెప్టెంబరు 8 గురువారం ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.


మేష రాశి
మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఖర్చులు పెరగవచ్చు. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. న్యాయపరమైన విషయాల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి.


వృషభ రాశి
ఈ రోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. పాత స్నేహితుడిని కలవడం ద్వారా మీ మనోవేదనలను మరచిపోతారు.


మిథున రాశి
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నెగెటివ్ ఆలోచనలు మనసులో రాకుండా చూసుకున్నప్పుడే సక్సెస్ అవుతారు. ప్రేమ జీవితంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.


Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!


కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశి వారు సక్సెస్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనసులో కొత్త ఆలోచనలు పుడతాయి. కార్యాలయంలోని సీనియర్ అధికారుల ప్రశంసలు అందుకుంటారు.


సింహ రాశి
ఈ రోజు సింహ రాశి వారు తమ తెలివితేటలను పూర్తిస్థాయిలో ప్రదర్శిస్తే కానీ ఫలితం పొందలేరు. మీ పనులు సకాలంలో పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకోండి. జీవితంలో క్రమశిక్షణ పాటించాలి.


కన్యా రాశి
వ్యాపారులు లాభాలు పొందుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శుభకార్యాన్ని ఇంట్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటారు. మనస్సు చంచలంగా ఉంటుంది.విద్యార్థులకు ఈరోజు శుభదినం.


తులా రాశి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. పిల్లల కెరీర్ కోసం, అనుభవజ్ఞుల సలహా తీసుకోవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు వింటే మీరు ప్రయోజనం పొందుతారు. 


Also Read: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశకు ఏ రంగులు వేస్తే మంచిది!


వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ప్రభుత్వోద్యోగులకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి. 


ధనుస్సు రాశి
ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు.  ఉన్నత చదువుల కోసం ప్రయత్నించేందుకు విద్యార్థులకు ఇదే మంచి సమయం. 


మకర రాశి
మనస్సులో సానుకూల ఆలోచనల ప్రభావం ఉంటుంది.  ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. బట్టల వ్యాపారులు లాభపడతారు.  వ్యాపారులు  కస్టమర్‌లతో సంబంధాన్ని కొనసాగించండి. ఉద్యోగులకు శుభసమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.


కుంభ రాశి
కాస్త ఓపికగా వ్యవహరించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రణాళిక లేని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.


మీన రాశి
ఈ రోజు మీరు మీ ప్రత్యర్థులను ఓడించడంలో విజయం సాధిస్తారు. పనిలో ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపార పరంగా ఈరోజు అనుకూలమైన రోజు. ఖర్చులు అదుపులో ఉండాలి. కుటుంబంతో సంతోష సమయం స్పెండ్ చేస్తారు.