యాపిల్ వాచ్ అల్ట్రాను కంపెనీ బుధవారం జరిగిన ఫార్ అవుట్ ఈవెంట్లో లాంచ్ అయింది. యాపిల్ వాచ్ ప్రో మోడల్‌ను కంపెనీ లాంచ్ చేయనుందని వార్తలు వచ్చాయి. కానీ దానికి అల్ట్రా అని పేరు పెట్టారు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 36 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. టైటానియం బాడీతో ఈ వాచ్‌ను రూపొందించారు.
యాపిల్ వాచ్ అల్ట్రా ధర
ఈ వాచ్ ధరను మనదేశంలో రూ.89,900గా నిర్ణయించారు. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, జపాన్, యూఏఈ, యూకే సహా మరో 40 దేశాల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఆల్ఫైన్, ఓషన్, ట్రెయిల్ వాచ్ బ్యాండ్లతో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
యాపిల్ వాచ్ అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఇందులో 49 ఎంఎం రెటీనా డిస్‌ప్లేను అందించారు. ఏకంగా 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లే అందించనుంది. టైటానియం బాడీతో దీన్ని రూపొందించారు. కొత్త యాక్షన్ బటన్ కూడా ఇందులో ఉంది. దీని ద్వారా రకరకాల ఫీచర్లు ఉపయోగించుకోవచ్చు.
మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం మూడు మైక్రోఫోన్లు ఇందులో అందించారు. ఎల్1, ఎల్5 జీపీఎస్ అల్గారిథంలను సపోర్ట్ చేసేలా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పటివరకు వచ్చిన యాపిల్ వాచ్‌ల్లో అత్యంత కచ్చితమైన జీపీఎస్ ఫంక్షనాలిటీ యాపిల్ వాచ్ అల్ట్రాలోనే ఉందని కంపెనీ అంటోంది.
కొత్త యాక్షన్ బటన్ ద్వారా వినియోగదారులు వేగంగా వర్కవుట్స్ మొదలు పెట్టవచ్చని యాపిల్ తెలిపింది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 36 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ వాచ్ అందించనుంది. లో పవర్ మోడ్ ఆన్ చేస్తే ఏకంగా 60 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందించనుంది.
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ధర కూడా లాంచ్ అయింది. ఈ సిరీస్ లో ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్ 13 సిరీస్ కంటే మెరుగైన బ్యాటరీ లైఫ్, మంచి కెమెరాలతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 14, 14 ప్లస్‌ల్లో ఏ15 బయోనిక్ చిప్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఏ16 బయోనిక్ చిప్‌ను అందించారు.
ఐఫోన్ 14 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.89,900 నుంచి, ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,990 నుంచి, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,900 నుంచి మొదలు కానుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?