యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్లో రెండో తరం ఎయిర్‌పోడ్స్ లాంచ్ అయ్యాయి. మొదటి తరం ఎయిర్‌పోడ్స్ 2019లో లాంచ్ అయ్యాయి. వీటిలో ఫైండ్ మై సపోర్ట్ ఉన్న ఇన్‌బిల్ట్ స్పీకర్ అందించారు. యాపిల్ హెచ్2 చిప్ కూడా ఉంది. మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఇవి మార్కెట్లోకి వచ్చాయి. వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇవి సపోర్ట్ చేయనున్నాయి.
యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో (రెండో తరం) ధర
వీటి ధరను అమెరికాలో 249 డాలర్లుగా (సుమారు రూ.19,850) నిర్ణయించారు. ఇక మనదేశంలో వీటి ధర రూ.26,900గా ఉంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. ఇప్పుడు ఎయిర్‌పోడ్స్ ప్రో ధరను కూడా యాపిల్ రూ.19,900కు తగ్గించింది.
యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో (రెండో తరం) స్పెసిఫికేషన్లు
వీటిలో యాపిల్ హెచ్2 చిప్‌ను అందించారు. డాల్బీ అట్మాస్, పర్సనలైజ్ చేసిన స్పేషియల్ ఆడియో, హెడ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటిని వినియోగదారులు కస్టమైజ్ చేసుకోవచ్చు. మెరుగైన ఆడియో క్వాలిటీ కోసం హై ఎక్స్‌కర్షన్ డ్రైవర్‌ను అందించారు. ప్రెజర్ కంట్రోల్స్ కూడా ఇందులో ఉండటం విశేషం.
ప్రస్తుతం ఎయిర్‌పోడ్స్ ప్రోలో అందుబాటులో ఉన్న యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కంటే రెట్టింపు ఏఎన్‌సీని ఇది అందించనుంది. ఫైండ్ మై బిల్ట్ అనే ఫీచర్ కూడా ఈ ఎయిర్‌పోడ్స్‌లో ఉంది. దీని ద్వారా వినియోగదారులు ఆడియో డివైస్‌ను ఫైండ్ చేయవచ్చు.
కనెక్టివిటీ విషయానికి వస్తే... కొత్త ఎయిర్ పోడ్స్ ప్రోలో బ్లూటూత్ వీ5.3 కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. ఐపీఎక్స్4 స్వెట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. వీటిని లైట్‌నింగ్ కేబుల్ ద్వారా చార్జ్ చేయవచ్చు. ఇయర్ పోడ్స్ బరువు 5.3 గ్రాములుగా ఉంది. కేస్‌తో కలిపితే మొత్తం 50.8 గ్రాములుగా ఉంది.
యాపిల్ వాచ్ సిరీస్ 8ను యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్లో లాంచ్ చేసింది. వీటికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి జరగనుంది. యాపిల్ వాచ్ సిరీస్ 7 జీపీఎస్ ఓన్లీ వేరియంట్ ధర మనదేశంలో రూ.45,900గా నిర్ణయించారు. మిడ్ నైట్, స్టార్ లైట్, గ్రీన్, సిల్వర్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు.
యాపిల్ వాచ్ ఎస్ఈ జీపీఎస్ వేరియంట్ ధర అమెరికాలో 249 డాలర్లుగా (సుమారు రూ.19,800) నిర్ణయించారు. మనదేశంలో జీపీఎస్ మోడల్ ధర ను రూ.29,900గా నిర్ణయించారు. మిడ్ నైట్, సిల్వర్, స్టార్‌నైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయ్యాయి.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?