సామ్రాట్ తులసి మీద అరుస్తూ ఉంటాడు. జరిగింది ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావ్ అని అనసూయ అంటే మా ఆంటీని అపార్థం చేసుకుంటున్నారని అంకిత అంటుంది. కానీ వాళ్ళ మాటలు సామ్రాట్ వినేందుకు ఒప్పుకోడు. ఇప్పుడిప్పుడే సరిగా అర్థం చేసుకుంటున్నాను, నాతో బిజినెస్ పార్టనర్షిప్ తెంచుకుంటున్నటు సింపుల్ గా ఒక మెసేజ్ పెట్టి ఊరుకుంది నేను తనకి ఇచ్చిన గౌరవానికి ఇలాగేనా ప్రవర్తించేది. కనీసం ఫోన్ చేసి అయినా మాట్లాడొచ్చు కదా. నాతో పార్టనర్షిప్ ఇష్టం లేకపోతే ఇలా పేపర్లో ఎక్కడం ఎందుకు, నా పరువు తియ్యడం ఎందుకు అని అరుస్తాడు. ఆ పేపర్ ప్రేమ్ చూసి షాక్ అవుతాడు. దీనికి మా అమ్మకి ఏం సంబంధం లేదని అంటాడు. అవును మరి నేను మీ ఇంట్లో వస్తుంటే మీడియా వాళ్ళు బయటకి వెళ్తున్నారు వాళ్ళకి మీ అమ్మకి కూడా ఎటువంటి సంబంధం లేదు వాళ్ళని మీ అమ్మ పిలవలేదు కదా వెటకారంగా అంటాడు.
మీరు వెటకారంగా అన్నా అదే నిజమని అంకిత చెప్తుంది. మీ ఆంటీ నన్ను మోసం చేసిందని సామ్రాట్ అరుస్తాడు. జీవితంలో ఇంకెవరిని నమ్మకుండా చేసింది, నా కళ్ళు తెరిపించింది థాంక్స్ అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే కోపంతో ఇంటికి వస్తాడు. అప్పుడే సామ్రాట్ బాబాయ్ వస్తాడు. ఎందుకు తులసి మీద అంతా కోపమని అడుగుతాడు, ఇన్నాళ్ళూ పాముకు పాలు పోసి పెంచాను అని నాకు తెలియలేదు బాబాయ్ అని అంటాడు. ఎం మాట్లాడుతున్నావో తెలుస్తుందా పాలరాయిలాంటి స్వచ్చమైన మనసు ఉన్న తులసిని పాము అంటావెంటీ అని తిడతాడు. నాతో పార్టనర్షిప్ తెంచుకుంటే వదిలేసేదాన్ని కానీ పేపర్ లో వేయించింది, మీడియా వాళ్ళని పయిపించి ఇంటర్వ్యూ ఇచ్చిందని కోపంగా చెప్తాడు. తులసిది అటువంటి వ్యక్తిత్వం కాదని పెద్దాయన చెప్తాడు. తులసితో మాట్లాడటానికి ఫోన్ చేయబోతుంటే సామ్రాట్ ఆపుతాడు. ఇప్పుడే తులసి దగ్గరకి వెళ్ళి నా కళ్ళారా చూశాను ఇంకేం చెయ్యాలి అని అనేసరికి గోడవపడి వచ్చావా అని పెద్దాయన కోపంగా అడుగుతాడు.
Also Read: మాధవ్ కి వాత పెట్టిన భాగ్యమ్మ- రాధని మెచ్చుకున్న దేవుడమ్మ, రెండు ఇళ్ళల్లో వినాయక చవితి సంబరాలు
సామ్రాట్ కోపంగా ఉన్న టైంలోనే హనీ వస్తుంది. తులసి ఆంటీ రెండు రోజుల నుంచి కనిపించడం లేదు, నాతో మాట్లాడలేదు ఒకసారి తులసి ఆంటీ కి ఫోన్ చేసి నేను బెంగ పెట్టుకున్నా అని చెప్పు అని హనీ సామ్రాట్ అంటుంది. ఆ మాటకి తులసి ఆంటీ కనిపించకపోతే నిద్ర పట్టదా ముద్ద దిగడా బెంగ ఏంటి అని గట్టిగా అరిచేస్తాడు. ఆ మాటలకి హనీ బెదిరిపోయి తాతయ్య అని పరుగుతీసి భయపడుతుంది. ఇంకోసారి తులసి ఆంటీ పేరు ఎత్తితే గదిలో పెట్టి తాళం వేస్తాను అని అరుస్తాడు. నువ్వు మనిషివి కాదు రాక్షసుడివి పెళ్లి చేసుకుని వచ్చే దాని జీవితం కూడా నాశనం చేయకు ఇలాగే ఉండు అని పెద్దాయన తిట్టి వెళ్ళిపోతాడు.
పేపర్లో ఆ న్యూస్ ఎవరు వేయించారా అని తులసి ఇంట్లో అందరూ ఆలోచిస్తూ ఉంటారు. మామ్ మీద సామ్రాట్ గారు అరిస్తే అందరూ మౌనంగా ఉన్నారని అభి గొడవ చేసేందుకు చూస్తాడు. సామ్రాట్ అన్నీ మాటలు అంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నావ్ నాకు నచ్చలేదని పరంధామయ్య అంటాడు. ఇంట్లో వాళ్ళు కూడా అలా మౌనంగా ఉండటం నచ్చలేదని చెప్తారు. ఆవేశంలో ఉన్న వ్యక్తి విచక్షణ కోల్పోతాడు సామ్రాట్ గారు ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నారని తులసి వెనకేసుకొస్తుంది. తులసి తన జీవితం ఏమిటో అని వేదాంతం మాట్లాడుతూ నిరాశగా ఉంటుంది. రేపు వినాయక చవితి నా మీద పడిన నిందలు దూరమవుతాయేమో చూద్దాం అని అంటుంది.
Also Read: మాట మార్చిన యష్- షాకైన వేద, నిధి, వసంత్ పెళ్ళికి ఏర్పాట్లు
నందు, లాస్య ఫుల్ ఖుషీగా ఉంటారు. సామ్రాట్ కూడా అందరి లాంటి మామూలు మగాడే. అంత ఇష్టపడిన తులసిని సైతం ఒక చిన్నఅబద్ధం నమ్మి అవమానించాడు, అపార్థం చేసుకున్నాడు దూరం చేసుకుని తులసికి బై చెప్పాడు, ఇక వాళ్ళ మధ్య దూరం కాళీ బూడిద అయింది అని లాస్య సంబరపడుతుంది. సామ్రాట్ ని మన గుప్పిట్లో పెట్టుకుని మనం చెప్పేది వినేలా చెయ్యాలని లాస్య అనుకుంటుంది. సామ్రాట్ అన్న మాటలకి హనీ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి సామ్రాట్ బాధపడతాడు. దగ్గరకి రమ్మని పిలుస్తాడు కానీ హనీ రాను అని భయపడుతుంది. ఇంకెప్పుడు అలా చెయ్యను అని సామ్రాట్ చాలా బాధపడి ఏడుస్తాడు. అది చూసి హనీ బాధపడుతుంది.