జానకి ఆలస్యంగా నిద్ర లేస్తుంది. పక్క ఊరులో స్వీట్ ఆర్డర్ ఉందని ఈరోజు మీరే కాలేజీకి వెళ్ళమని రామా జానకితో చెప్తాడు. విష్ణు, మల్లిక మళ్ళీ గిల్లీ కజ్జాలు మొదలుపెడతారు. నువ్వు గాజులు చేయించమని అడిగావ్ కదా అందుకని షాప్ కి వెళ్తున్నా అని విష్ణు అంటాడు. మీ అమ్మ వేసిన ఫిక్సెడ్ డిపాజిట్ మన షాపు బాగు చేయించుకోవడానికి ఇస్తాను అని మాట ఇచ్చింది కదా ఇప్పుడు వెళ్ళి ఆ డబ్బులు ఆడగమని మల్లిక చెప్తుంది. అడిగితే అమ్మ ఏమైనా అనుకుంటుందేమో అని విష్ణు అంటాడు. కానీ మల్లిక మాత్రం వినదు వెళ్ళి అడగమని ఒత్తిడి చేస్తుంది. జానకి జెస్సి విషయం గుర్తు చేసుకుని కోపంగా ఉంటుంది. జెస్సి విషయం అఖిల్ తో తేల్చుకున్నాకే కాలేజీకి వెళ్తాను అని మనసులో అనుకుంటుంది.
విష్ణు జ్ఞానంబ దగ్గరకి వచ్చి డబ్బులు అడుగుతాడు. డబ్బులు ఇస్తే షాపు రిపేర్ చేయిస్తానని అంటాడు. ఇప్పుడున్న బట్టల షాపు బాగోలేదని డబ్బులు ఇస్తే షాపుని అందంగా తయారు చేస్తామని అంటుంది. అంతక ముందు అయితే జానకి చదువు విషయం తెలియదు కాబట్టి వెన్నెల, అఖిల్ మాత్రమే చదువుకుంటున్నారని ఆ డబ్బులు ఇస్తా అని మాట ఇచ్చాను అని జ్ఞానంబ అంటుంది. మరి ఇప్పుడు ఇవ్వాలని అనుకోవడం లేదా అత్తయ్యగారు అని మల్లిక అనుమానంగా అడుగుతుంది. అనుకోవడం లేదని చెప్తుంది. ఎందుకని మల్లిక అడుగుతుంది. ఇప్పుడు అఖిల్, వెన్నెలతో పాటు జానకి చదువు కూడా తోడైంది కదా అని అంటుంది. ఆ రోజు మీరు జనకిని కాలేజీలో జాయిన్ చేసే ముందు ఒక మాట చెప్పారు కదా అదే అత్తయ్యగారు ప్రభుత్వ కాలేజీ ఫీజులేవీ ఉండవని చెప్పారు మరి ఇప్పుడేమో ఇలా అంటున్నారు అని మల్లిక భయపడుతూ అడుగుతుంది.
Also Read: సామ్రాట్ రాక్స్, నందు షాక్- తులసితో కాళ్ళ బేరానికి వచ్చిన నందు, లాస్య
మీరు ఆ డబ్బులు ఇస్తాను అనేసరికి మేము ఏమి ప్రయత్నాలు చేసుకోలేదని చెప్తుంది. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు అప్పుడు డబ్బులు అవసరం అయితే వేరే వాళ్ళని అడగలేము కదా పైగా అఖిల్ పై చదువులు చదవాలని అంటున్నాడు ఇప్పట్లో ఆ డబ్బు తీసే ఉద్దేశం లేదని జ్ఞానంబ తేల్చి చెప్పేస్తుంది. డబ్బులు ఇవ్వను అని చెప్పేసింది కదా మీ అమ్మ వెళ్ళండి షాప్ కు అని అరుస్తుంది. అఖిల్ మీద అత్తయ్యగారు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఎలాగైనా తనతో ఈరోజు మాట్లాడాలి అనుకుంటుంది.
జానకి అఖిల్ ని పక్కకి పిలిచి మాట్లాడుతుంది. ఎందుకు అఖిల్ నన్ను చూడగానే జారుకోవాలని అనుకుంటున్నావ్ ఏదైనా తప్పు చేశావా అని అడుగుతుంది. నేనేమీ తప్పు చెయ్యలేదు చదువు గురించి ఎక్కడ క్లాస్ పీకుతావో అని అఖిల్ అంటాడు. నేనేమీ తప్పు చెయ్యలేదని బుకాయిస్తాడు. జెస్సి విషయంలో నువ్వు తప్పు చెయ్యలేదని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు అని అడుగుతుంది. నాకు అంతా తెలుసు నీ వల్ల జెస్సి ప్రగ్నెంట్ అయ్యింది. ఆడపిళ్ళకి ప్రాణం కంటే మానం ఎక్కువ అలాంటిది నీ వల్ల తల్లి కాబోతున్న జెస్సీకి తాళి కట్టి న్యాయం చేయాల్సింది పోయి అబార్షన్ చేయించుకోమంటావా? నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా అని నిలదిస్తుంది. నాకు ఆ ప్రగనెన్సీకి ఏ సంబంధం లేదు వదినా అని అఖిల్ చెప్తాడు. దానికి కారణం నేను కాదు అనేసరికి జానకి కోపంగా అఖిల్ మీదకి చెయ్యి ఎత్తుతుంది. చాలు ఆపేయ్ నిన్ను ప్రేమించి నమ్మినందుకు ఒక ఆడపిల్ల గురించి అలా అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది తప్పించుకోవాలి అనుకున్నా తప్పించుకోలేవు మీ ఇద్దరి ప్రేమ గురించి ఫోటోలతో సహ పూర్తి సాక్ష్యాలు నాదగ్గర ఉన్నాయని జానకి ఫోన్లో ఫోటోస్ కోసం వెతుకుతుంది. కానీ అవి కనిపించవు. నా ఫోన్లో ఫోటోస్ డిలీట్ చేసింది నువ్వే అన్నమాట, చాలా ఎదిగిపోయావ్ నీ నుంచి మీ అమ్మగారు కోరుకుంటుంది ఇది కాదు అత్తయ్యగారి ఆశలు సమాధి చేస్తున్నావ్. ఫోటోలు డిలీట్ చేసినంత మాత్రాన నువ్వు బయటపడినట్టు కాదు. జెస్సిని పెళ్లి చేసుకునే విషయంలో నువ్వు అనుకూలంగా ఉంటే హెల్ప్ చేస్తాను లేదంటే విషయం అత్తయ్యగారికి చెప్పేస్తాను. సాయంత్రం లోగా ఆలోచించుకుని విషయం చెప్పేయ్ లేదంటే నా రియాక్షన్ వేరేగా ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది.
Also Read: తగ్గేదెలే అంటోన్న మోనిత, ముంబయికి డాక్టర్ బాబు- కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప
జెస్సి కడుపుకి కారణం ఎవరు అని తన తల్లిదండ్రులు మళ్ళీ అడుగుతారు. కానీ జెస్సి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇప్పుడు నేను అఖిల్ పేరు చెప్తే ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తుంది. కొన్ని రోజులు టైం కావాలని జెస్సి అడుగుతుంది. నీ మొండితనం నీకు విలువ అయినప్పుడు మేం చావడమే మంచిదని జెస్సి తల్లి కోపంగా అనేసి వెళ్లిపోతారు. విషం తాగేందుకు చూస్తుంటే జెస్సి వచ్చి ఆగమని బతిమలాడుతుంది. వినకపోయేసరికి అసలు విషయం చెప్తాను అని అంటుంది. జ్ఞానంబ గారి మూడో కొడుకు అఖిల్ అని చెప్తుంది. ఆ మాటకి వాళ్ళు షాక్ అవుతారు.