సీనియర్ హీరోయిన్ జమున (Jamuna) మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వెండితెర సత్యభామగా, మహిళా ప్రాధాన్య చిత్రాల కథానాయికగా, అగ్ర కథానాయికలకు జోడీగా సుమారు 200 చిత్రాల్లో నటించిన ఆవిడ మరణం ఎంతో మందికి బాధను కలిగించింది. ఆవిడ వారికి ఏదో ఒక సమయంలో ఒక సందేహం వస్తుంది. ఎప్పుడూ ఆమె మెడ ఊగుతూ ఉంటుంది. అందుకు కారణం ఏమిటో తెలుసా?


జమున నెత్తి మీద పడిన హీరో
జమున హిట్ సినిమాల్లో 'లేత మనసులు' ఒకటి. అందులో హరినాథ్ హీరోగా నటించారు. నిజం చెప్పాలంటే... తమిళంలో విజయవంతమైన 'Kuzhandaiyum Deivamum' చిత్రానికి అది రీమేక్. తమిళంలో జయ శంకర్ హీరోగా నటించారు. ఆ సినిమా చేసే సమయానికి ఆయన కొత్త. అప్పటికి జమున స్టార్ హీరోయిన్. అందువల్ల, ఆమెతో చిత్రీకరణ చేయడానికి కంగారు పడేవారు. 


'లేత మనసులు'లో 'అందాల ఓ చిలుకా...' పాట ఉంది కదా! ఆ సాంగ్ తమిళ్ వెర్షన్ షూటింగ్ చేస్తున్న సమయంలో గడ్డి మేట నుంచి జారుకుంటూ వచ్చి కింద ఉన్న కథానాయిక పక్కన వాలాలి. కంగారులో జయ శంకర్ చూసుకోకుండా అడ్డ దిడ్డంగా కిందకు వచ్చారు. వచ్చి వచ్చి జమున నెత్తి మీద పడ్డారు. దాంతో ఆవిడ ప్రాణం మీదకు వచ్చినంత పని అయ్యింది. 


మెడ నరాలు దెబ్బ తిన్నాయ్!
జమున నెత్తి మీద జయ శంకర్ పడటంతో వెంటనే షూటింగ్ ఆపేశారు. ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స చేశారు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మళ్ళీ షూటింగులకు హాజరు అయ్యారు. అయితే, కొన్నాళ్ళకు ఆ ప్రమాదం మళ్ళీ తిరగబెట్టింది. మెడ నరాలు దెబ్బ తిన్నాయని తెలిసింది. 


మెడ ఊగిపోయేది అందుకే!
షూటింగులో మెడకు గాయం కావడం, ఆ తర్వాత సమస్య తిరగబెట్టడం... వీటి వల్ల జమున మెడ ఊగడం ప్రారంభమైంది. చాలా ఆస్పత్రులు తిరగడంతో పాటు చాలా మంది వైద్యులకు చూపించారు. కానీ, సమస్యకు పరిష్కారం లభించలేదు. మీరు నిశితంగా గమనిస్తే... 'రాజపుత్ర రహస్యం' సినిమాలో జమున మెడ ఊగడం కనిపిస్తుంది.


Also Read : జమునను బాయ్‌కాట్ చేసిన ఎన్టీఆర్, ఎన్టీఆర్


సినిమాల్లో జమున పోషించిన పాత్రలు కావచ్చు... నిజ జీవితంలో ఆమె వ్యక్తిగతం , ప్రవర్తన కావచ్చు... చాలా మందికి ఆదర్శప్రాయమని చెప్పాలి. పెళ్ళైన తర్వాత కూడా జమున సినిమాల్లో నటించారు. వర్కింగ్ విమెన్, మ్యారీడ్ హీరోయిన్ కల్చర్ అప్పట్లో తీసుకు వచ్చిన హీరోయిన్లలో ఆవిడ ఒకరు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా జమున ఎక్కువ చేశారు. అప్పట్లో మహిళా ప్రాధ్యాన చిత్రాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.


Also Read : రెండు పార్టులు పవన్ 'అన్‌స్టాపబుల్‌ 2' సందడి - ఫస్ట్ పార్ట్ ఎప్పుడంటే? 



జమున వ్యక్తిగత జీవితానికి వస్తే... ఆమె మాతృభాష తెలుగు కాదు. కానీ, అచ్చమైన తెలుగింటి కోడలు. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జూలూరి రమణారావును ఆమెను వివాహం చేసుకున్నారు. ఆయన నవంబర్ 10, 2014లో మృతి చెందారు. రమణా రావు, జామున దంపతులకు ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు వంశీ జూలూరి. అమ్మాయి పేరు స్రవంతి. వాళ్ళిద్దరూ భాగ్య నగరంలోనే ఉంటున్నారు.