మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లిన చిరు..  నేరుగా సీఎం క్యాంపాఫీస్‌కు వెళ్లారు. బయటకు వచ్చి సీఎం జగన్ స్వాగతం పలికారు. స్వాగతం ఆచార్య.. వెల్కం ఆచార్య అని జగన్ ఆహ్వానించారు. చిరంజీవి ఆ పిలుపులతో చిరునవ్వులు చిందించారు. తర్వాత జగన్‌కు శాలువా కప్పి .. పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. వారిద్దరి మధ్య లంచ్ భేటీలో కీలకమైన అంశాలు చర్చించే అవకాశం ఉంది.


Also Read: ఏపీలో టికెట్ రేట్స్‌తో మాకు స‌మ‌స్య‌ లేదని ఎందుకు అన్నానంటే.. నాగార్జున వివరణ!


ప్రస్తుతం సినిమాటిక్కెట్ రేట్ల అంశంతో ఏపీ ప్రభుత్వం - టాలీవుడ్ మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. సినీ పరిశ్రమపై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన విమర్శలపై టాలీవుడ్ ముఖ్యులు ఘాటుగా స్పందించడం ప్రారంభించారు. కోవూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఉందనే అభిప్రాయానికి వస్తున్నారు. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పరిస్థితిని చక్క బరిచేందుకు చిరంజీవిని సీఎంతో లంచ్ భేటీకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.


Also Read: ఏపీ సీయం జ‌గ‌న్‌తో చిరంజీవి భేటీ... టికెట్ రేట్స్ గురించి చ‌ర్చిస్తారా?
    


సీఎంతో భేటీకి చిరంజీవి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.  గత ఏడాది ఆగస్టులోనే పేర్ని నాని చిరంజీవికి ఫోన్ చేసి..సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చారు.. వచ్చి కలిసి ఇండస్ట్రీ సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. కానీ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాలు వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవే పలుమార్లు అపాయింట్‌మెంట్ అడిగారు కానీ స్పందన రాలేదు.


Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..


హఠాత్తుగా సీఎంవో అధికారులు సీఎం జగన్ అపాయింట్‌మెంట్‌ను ఖరారు చేసి.. చిరంజీవికి సమాచారం పంపారు. టాలీవుడ్ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో  ఉన్న చిరంజీవి వెంటనే అంగీకరించారు. చర్చల తర్వాత ఏమైనా ఫలితాలు ఉంటాయో లేదో చూడాలి. 



Also Read: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ...



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి