సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ కొద్ది నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతున్న వీరిద్దరు.. ఈ ఏడాది జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో వీరి వివాహ వేడుక జరిగింది. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతి సహా పలువురు టాప్ స్టార్స్ ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.
వెడ్డింగ్ తర్వాత ఈ జంట ఏమాత్రం సమయం దొరికినా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా దుబాయ్ వేదికగా జాలీగా గడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం విఘ్నేష్ శివన్ బర్త్ డే కావడంతో నయనతార ఈ వేడుకను స్పెషల్ గా అరేంజ్ చేసింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ముందు బర్త్ డే సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడకులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు విఘ్నేష్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఈ జంట కొంత మంది పిల్లలతో ఫోటోలు తీసుకున్నారు. వీటిలో ఓ ఫోటోను విఘ్నేష్ తన ఇన్ స్టాలో షేర్ చేశాడు.
ఈ తాజాగా ఫోటోలో పిల్లలు ఎంతో సంతోషంగా నవ్వుతున్నారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన విఘ్నేష్ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టాడు. “కొంతమంది పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నాం. భవిష్యత్తు కోసం ప్రాక్టీస్ చేయాలి కదా” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార ప్రెగ్నెంట్ అయ్యిందని ఊహాగానాలు వస్తున్నాయి. అదే విషయాన్ని విఘ్నేష్ తన పోస్టుతో చెప్పారని చర్చించుకుంటున్నారు. అయితే, ఈ ఊహాగానాలపై విఘ్నేష్, నయనతారలు స్పందించలేదు.
తాజాగా ఈ నూతన జంటకు సంబంధించిన పెళ్లి వేడుక టీజర్ విడుదల అయ్యింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో నెట్ ఫ్లిక్స్ ఈ టీజర్ ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు నయనతార పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు. పెళ్లి సందర్భంగా.. తాళికట్టే కొన్ని ఫోటోలను నయనతార, విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నయనతార విఘ్నేశ్ శివన్ పెళ్లి వేడుకల రైట్స్ ను నెట్ ఫిక్స్ రూ. 25 కోట్లకు కొనుగోలు చేసింది. వీరి పెళ్లిని నెట్ ఫ్లిక్స్ భారీగా ఖర్చుపెట్టి ఘనంగా నిర్వహించింది. ఈ పెళ్లి వేడుకను ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో చిత్రీకరించింది. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ వేడుకను స్ట్రీమింగ్ చేయనుంది. తాజాగా ఈ డాక్యుమెంటరీ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో నయనతార విఘ్నేష్ శివన్‌ల పరిచయంలోని మధుర ఘట్టాల్ని రూపొందించారు. ఈ గ్లింప్స్ వైరల్ గా మారింది. అటు ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ కానుంది.
Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జగనన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్