తమిళ హీరో శివ కార్తికేయన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలు 'సీమ రాజా', 'రెమో', 'శక్తి', 'డాక్టర్'తో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఇప్పుడు 'జాతి రత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశారు. శివకార్తికేయన్ 20వ సినిమా (SK20) ఇది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మరియాను హీరోయిన్ గా తీసుకున్నారు. టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
తమన్ సంగీతం అందించనున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలు. న్యూ ఇయర్ సందర్భంగా సినిమాను ప్రకటించి.. ఫిబ్రవరి నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆగస్టు 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి సినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. 'ప్రిన్స్'. ఇది ఇంగ్లీష్ టైటిల్ కాబట్టి తెలుగు, తమిళ భాషలకు సరిపోతుందని.. కథ పరంగా చూసుకున్నా సినిమాకి యాప్ట్ అవుతుందని.. దీన్ని ఫైనల్ చేశారట. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు.
Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?