Indian 2 Shooting In Vizag : లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ తెలుగు రాష్ట్రాల్లోని నగరాలపై ఫోకస్ పెట్టారు. వాళ్ళిద్దరి కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'ఇండియన్ 2'ను కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల్లో చిత్రీకరణ చేస్తున్నారు.
విశాఖలో కమల్ 'ఇండియన్ 2'
'ఇండియన్ 2' సినిమా చిత్రీకరణ ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలుసా? మన విశాఖపట్నంలో! అవును... విశాఖలోని హార్బర్ ఏరియా, పరిసర ప్రాంతాలలో కమల్ హాసన్ సహా ఇతర ప్రధాన తారాగణంపై దర్శకుడు శంకర్ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈనెల 14న విశాఖలో ఇండియన్ టు షెడ్యూల్ ప్రారంభమైంది. సుమారు ఎనిమిది రోజుల పాటు చిత్రీకరణ చేయాలని ప్లాన్ చేశారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో విశాఖ షెడ్యూల్ పూర్తి కావాలి.
విశాఖ మాత్రమే కాదు... కొన్ని రోజుల క్రితం విజయవాడలోనూ 'ఇండియన్ 2' సినిమా చిత్రీకరణ జరిగింది. సుమారు 8 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా... కమల్ ఇతర ప్రధాన ఆర్టిస్టులపై శంకర్ రెండు రోజులపాటు చిత్రీకరణ చేశారు. అంతకు ముందు రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కూడా 'ఇండియన్ 2' చిత్రీకరణ జరిగింది.
'ఇండియన్ 2' సినిమాతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా 'గేమ్ చేంజర్' సినిమాను సైతం శంకర్ తెరకెక్కిస్తున్నారు. అందులోని కొన్ని కీలక సన్నివేశాలను విశాఖ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ చేసిన విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది వేసవిలో రెండో భారతీయుడు...
దీపావళికి మూడో భారతీయుడు విడుదల!
భారీ చిత్రాలకు పెట్టింది పేరైన శంకర్ తన కెరీర్ ప్రారంభించిన తర్వాత రెండు కాదు... మూడు సినిమాలను ఒకేసారి తీస్తున్నారని చెప్పాలి. 'భారతీయుడు 2' తర్వాత దానికి కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా విడుదల కానుంది. 'ఇండియన్ 2' సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత సినిమా అవుట్ పుట్ పట్ల శంకర్ చాలా సంతృప్తి వ్యక్తం చేశారట. సన్నివేశాలు అద్భుతంగా రావడంతో వాటిని కుదించడం ఇష్టం లేక 'ఇండియన్ 3' చేయాలని నిర్ణయం తీసుకున్నారట.
Also Read : మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?
Indian 2 Movie Release Date : వచ్చే ఏడాది వేసవిలో 'ఇండియన్ 2' విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బహుశా... ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రావచ్చు. ఆ తర్వాత దీపావళికి 'ఇండియన్ 3' విడుదల చేయాలని భావిస్తున్నారట.
అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions)తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ సంస్థపై సుభాస్కరన్ నిర్మిస్తోన్న చిత్రమిది. ఇందులో కమల్ సరసన కాజల్ నటిస్తున్నారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల సినిమా ఇంట్రో గ్లింప్స్ సైతం విడుదల చేశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రవివర్మన్, సంగీతం: అనిరుద్ రవిచంద్రన్, కూర్పు: ఎ. శ్రీకర ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: టి.ముత్తురాజ్.
Also Read : 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' సినిమా రివ్యూ: రక్షిత్ శెట్టి బ్లాక్ బస్టర్ కొట్టారా? డిజప్పాయింట్ చేశారా?