స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతీయులంతా జాతీయ జెండాను ఎగరేసి 'జనగణమన' అంటూ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అలా దేశభక్తిని చాటుకుంటారు. అయితే మనలోకి దేశభక్తిని రగిలించే తెలుగు సినిమా పాటలు చాలానేఉన్నాయి . వాటిని వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ నుండి నేటి యంగ్ హీరోల వారలు ఎన్నో దేశభక్తి గీతాలను వెండితెర వేదికగా మనకి అందించారు. ఆ పాటలేవో ఇప్పుడు చూద్దాం!
వెలుగు నీడలు :
ఏఎన్నార్ నటించిన ఈ సినిమాలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన 'పాడవోయి భారతీయుడా..' అనే పాటను పి.సుశీల, ఘంటసాల పాడారు. ఈ పాట వచ్చి దశబ్దాలు గడిచినా.. ఇప్పటికీ క్లాసిక్ దేశభక్తి గీతాల్లో మొదటి ప్లేస్ లో ఉంటుంది.
అల్లూరి సీతారామరాజు :
ప్రముఖ సినీ నటుడు కృష్ణ నటించిన ఈ సినిమాలో 'తెలుగు వీర లేవరా.. దీక్షపూని సాగరా..' అంటూ సాగే ఈ పాట అప్పట్లో ఒక సెన్సేషన్. ఇప్పటికీ ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.
మేజర్ చంద్రకాంత్ :
ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా 'పుణ్యభూమి నాదేశం నమో నమామి' పాట.. దేశం కోసం ప్రాణం అర్పించిన ఎందరో మహానుభావుల త్యాగాలను గుర్తుచేసే విధంగా రూపొందించారు. ఎస్పీబీ పాడిన ఈ పాటకు మణిరత్నం సంగీతం అందించారు.
రోజా :
ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో 'వినరా వినరా దేశం మనదేరా' అంటూ రాజశ్రీ పాడిన పాటను ఎప్పటికీ మర్చిపోలేం.
రెహ్మాన్ స్పెషల్ ఆల్బమ్ :
'మా తుఝే సలాం.. వందేమాతరం' అంటూ రెహ్మాన్ కంపోజ్ చేసిన ఈ పాట ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుంది.
ఖడ్గం :
ఆగస్టు 15 వచ్చిందంటే టీవీల్లో కచ్చితంగా 'ఖడ్గం' సినిమాను టెలికాస్ట్ చేస్తారు. ఈ సినిమాలో 'మేమే ఇండియన్స్' అనే ఎప్పటికీ స్పెషల్ అనే చెప్పాలి.
జై :
నవదీప్ హీరోగా నటించిన ఈ సినిమాలో 'దేశం మనదే..' అనే పాటను అనూప్ రూబెన్స్ ఎంతో బాగా కంపోజ్ చేశారు. లిరిక్స్ కూడా ఆకట్టుకుంటాయి.