శ్రీరాముని పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా 'ఆదిపురుష్'. హిందీలో 'తానాజీ' వంటి హిట్ సినిమా తీసిన తర్వాత దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 'ఆదిపురుష్' స్క్రిప్ట్ రాసిన తర్వాత తన మదిలో ప్రభాస్ రూపం మాత్రమే కనిపించిందని, ఒకవేళ ఆయన ఈ పాత్ర (శ్రీరాముని) పాత్ర చేయనని అంటే సినిమా చేసేవాడిని కాదని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
శ్రీరాముని పాత్ర చేయడానికి స్వచ్ఛమైన మనసున్నా నటుడు కావాలని... ఆ స్వచ్ఛత, కల్మషం లేని వ్యక్తిత్వం, మంచి లక్షణాలన్నీ ప్రభాస్‌లో కనిపించాయని ఓం రౌత్ పేర్కొన్నారు. ఒకవేళ ప్రభాస్ చేయనని అంటే స్క్రిప్ట్ పక్కన పెట్టేద్దామని అనుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
Also Read: ప్రభాస్ రీసెంట్ కెరీర్‌లో ఇదొక రికార్డ్... అంత తక్కువ రోజుల్లోనా!?
రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే... సినిమాలో రామాయణం మొత్తం చూపించడం లేదని, కీలక భాగాన్ని మాత్రమే చూపిస్తున్నానని, అదేంటో ఇప్పుడే చెప్పానని ఓం రౌత్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో 11వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ శ్రీరామునిగా కనిపించనున్న ఈ సినిమాలో సీత పాత్రలో కృతీ సనన్ నటించారు. లంకాధిపతి రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఆయన పాత్ర పేరు లంకేశ్.
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మరి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి