హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతి కాంబోలో వస్తున్న తాజా మూవీ ‘మంగళవారం’. ‘RX100’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొని ‘మంగళవారం‘ చిత్రం మైల్ స్టోన్ గా నిలువబోతోందన్నారు.  ఈ టీజర్ చూసి దర్శకుడు సుకుమార్ సైతం షాక్ అయ్యారని చెప్పారు.


అప్పుడు నేను అనుకున్నది ఇప్పుడు నిజమైంది!


కొన్ని సినిమాలకు వైబ్ క్రియేట్ అవుతుందన్న అల్లు అర్జున్, ‘మంగళవారం‘ సినిమాలో అటువంటి వైబ్ ఉందన్నారు. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా ఈ సినిమాను దీవించాలని విజ్ఞప్తి చేశారు. “కొన్ని రోజుల క్రితం ఈ మూవీ టీజర్ చూశా. షాక్ అయ్యా.వెంటనే సినిమా చూడాలనే కోరిక మనలో అతి తక్కువ సినిమాలు కలిగిస్తాయి. 'మంగళవారం' టీజర్ సినిమా చూడాలనే కోరిక కలిగించింది. అజయ్ భూపతి గారు నాకు కథ చెప్పినప్పుడు  మీరు గర్వించే స్థాయిలో సినిమా తీస్తా అని చెప్పారు. ట్రైలర్లో ఆ ఫీలింగ్ ఇచ్చారు. నాకు 'ఆర్ఎక్స్ 100' చాలా ఇష్టం. అందులో 'పిల్లా రా' సాంగ్ మా ఇంట్లో ఎప్పుడూ ప్లే అవుతుంది. ఆయన గొప్ప టెక్నీషియన్. పెద్ద దర్శకుడు అవుతాడని నాకు నమ్మకం ఉండేది” అన్నారు.


దర్శకుడు సుమార్ షాక్ అయ్యారు!


“రెండు రోజుల క్రితం 'పుష్ప 2' షూటింగ్ జరుగుతుంటే,  సుకుమార్ గారు వచ్చి 'మంగళవారం సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వెళ్తున్నావా? అని అడిగారు. అవునని చెప్పా. అప్పుడు ఆయనకు టీజర్ చూపించా. దాన్ని చూసి ఆయన షాక్ అయ్యారు.  కొన్ని సినిమాలకు వైబ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాలో అటువంటి వైబ్ ఉంది. ప్రేక్షకులు అందరూ వచ్చి మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాను. 'ఆర్ఎక్స్ 100' ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఇప్పుడు హీరోయిన్ పాయల్ కు 'మంగళవారం' మైల్ స్టోన్ కావాలని కోరుకుంటున్నా. ఆమెకు ఆల్ ది బెస్ట్. చాలా బోల్డ్ విషయం ఉన్న కథ ఇది. అజయ్ భూపతి కథ చెప్పినప్పుడు ఇటువంటి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలని అనిపించింది. ఆయన బాగా డీల్ చేస్తారని అనుకున్నా. టీజర్, ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా తీశారని అనిపించింది. సినిమా అవుట్ పుట్ మీద పాజిటివ్ గా ఉన్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని చెప్పారు. ఈ నెల 17న విడుదల అవుతున్న 'మంగళవారం' సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించాలని కోరారు.


నా అభిమానులే నాకు ఆదర్శం


ఇక తన అభిమానలపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. తన అభిమానులే తనకు ఆదర్శం అని చెప్పారు. “నా ఆర్మీలాగా, నాకు అండగా నిలుస్తారు ఫ్యాన్స్, నా బలం మీరు. చాలా మంది ఫ్యాన్స్ కు వాళ్ల హీరోనే ఇన్స్​ప్రెషన్ ఏమో? నాకు మాత్రం నా ఫ్యాన్సే ఆదర్శం. మిమ్మల్ని చూసిన తర్వాతే నా మీద నాకు నమ్మకం వస్తుంది. మీ అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను” అని బన్నీ చెప్పుకొచ్చారు.


Read Also: రామ్ చరణ్ సినిమాలో అర్జున్​ కీలకపాత్ర.. భోళే అన్న అట-శోభ ఆంటీ అట, ఫన్నీగా సాగిన ప్రోమో