ది పంచుల వర్షం గురించి మీకు తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆది ‘జబర్దస్త్’ను వదిలి.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో సెటిలయ్యాడు. సుధీర్ కూడా ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ను పూర్తిగా వదిలేసి ‘స్టార్ మా’లోని ‘సూపర్ సింగర్ జూనియర్’లోకి వెళ్లాడు. చివరికి ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ని సైతం వదిలేశాడు. అతడి లోటును భర్తీ చేసేందుకు రష్మీని రంగంలోకి దించారు. నటి ఇంద్రజ స్థానాన్ని పూర్ణతో భర్తీ చేశారు. మొత్తానికి షోలో ఎంటర్‌టైన్మెంట్ తగ్గకుండా జాగ్రత్తపడుతున్నారు. ‘జబర్దస్త్’ షోలు కాస్త డల్‌గా కనిపిస్తున్నా.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ మాత్రం బాగానే ఆకట్టుకుంటోంది. కొత్త కాన్సెప్టులు.. బోలెడంత మంది కమెడియన్లు ఉండటం వల్ల షో కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. రష్మీ కూడా తనకు ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేస్తున్నట్లే కనిపిస్తోంది. 


ఆషాడమాసం సందర్భంగా తాజాగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ నుంచి ఓ ప్రోమో బయటకు వచ్చింది. ఈ ఎపిసోడ్‌కు ప్రగతి స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చారు. స్టేజ్ మీద డ్యాన్స్‌తో ప్రగతి తన ఎనర్జీని చూపించారు. ఆది పంచ్‌లకు ప్రగతి పడి పడి నవ్వారు. ఆషాడం అల్లుళ్ల కాన్సెప్ట్‌తో ఈ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా వర్ష.. రష్మీని కాసేపు ఆట పట్టించింది. ‘‘నువ్వు కూడా ఆషాడానికి వచ్చావు కదా అక్కా. బావ అక్కడున్నాడు కదా’’ అని వర్షా కామెంట్ చేసింది. దీంతో రష్మీ.. ‘‘ఎవరే నీకు అక్క? వెళ్లి కూర్చో’’ అని మండిపడింది. ఆ వెంటనే ఆది అందుకుని.. ‘‘రష్మీ, నాకు తెలిసి మీది ఒక సంవత్సరం ఆషాడం అనుకుంటా’’ అని అన్నాడు. దీంతో రష్మీ ముఖం పక్కకు తిప్పేసుకుంది. అయితే, ప్రగతి, పూర్ణ మాత్రం కడుపుబ్బా నవ్వుకున్నారు. సుధీర్ షో నుంచి వెళ్లినా.. అతడి పేరు మాత్రం ప్రతి ఎపిసోడ్‌లో వినిపిస్తోంది. దీంతో అభిమానులు.. సుధీర్ లేకపోయినా, అతడి పేరు ఈ షోను నడిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ జులై 10న ప్రసారం కానుంది. 



Also Read: 'జబర్దస్త్' వదిలేసిన అనసూయ - ఆ స్టార్ డైరెక్టరే కారణమా?