బుల్లితెరపై 'జబర్దస్త్' షోకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ షో చూస్తుంటారు. ఎన్ని వివాదాలు ఎదురైనా.. ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది 'జబర్దస్త్'. ఈ షోని మొదలుపెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ అత్యధిక టీఆర్ఫీతో దూసుకుపోతుంది. అయితే ఈ షో నుంచి యాంకర్ అనసూయ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. 


నిజానికి ఈ షోతో అనసూయ విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. అలాంటిది ఆమె ఈ షోకి గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అనసూయ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ స్టార్ డైరెక్టర్ ఉన్నట్లు సమాచారం. 'జబర్దస్త్' షోని వదిలేయమని దర్శకుడు క్రిష్ ఆమెని కన్విన్స్ చేసినట్లు టాక్. ప్రస్తుతం క్రిష్ 'కన్యాశుల్కం' అనే వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. 


సోనీ లివ్ కోసం ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనసూయ వేశ్య మధురవాణి క్యారెక్టర్ లో కనిపించనుంది. ఈ సిరీస్ తో అనసూయకి క్రిష్ తో స్నేహం ఏర్పడింది. దీంతో అనసూయను కొన్ని విషయాల్లో ఆయన గైడ్ చేస్తున్నారట. ఈ క్రమంలో 'జబర్దస్త్'ను వదిలేసి కొత్త ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేయమని చెప్పారట. అలానే అనసూయకి వస్తోన్న సినిమా ఆఫర్స్ లో ఏవి పిక్ చేయాలో కూడా ఆయన చెబుతున్నట్లు సమాచారం. ఆయన సలహాల మేరకే అనసూయ 'జబర్దస్త్'ను వదిలేసిందట. అయితే కొన్ని సార్లు ఇలాంటి సలహాలు బాగానే వర్కవుట్ అవుతాయి.. కొన్ని సార్లు మాత్రం కావు. మరి అనసూయ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!