గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటిస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'. యూవీ క్రియేషన్స్, జీఏ (గీతా ఆర్ట్స్) 2 పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'బన్నీ' వాసు నిర్మాత. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్ జనాలు బాగా రీచ్ అయింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. 
 
జూలై1, 2022న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని 'అందాల రాశీ' అనే పాటను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్, రాశి ఇద్దరూ లాయర్లుగా కనిపించనున్నారు.
మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయట. స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ : ర‌వీంద‌ర్, స‌హ నిర్మాత : ఎస్‌.కె.ఎన్‌, లైన్ ప్రొడ్యూసర్ : బాబు, ఎడిటింగ్ : ఎన్.పి. ఉద్భ‌వ్, సినిమాటోగ్ర‌ఫీ : క‌ర‌మ్ చావ్ల‌ , సంగీత దర్శకుడు: జేక్స్ బిజాయ్. 
 

పాట లిరిక్స్ అందాల రాశీ మేకప్ వేసి.. నా కోసం వచ్చావే..స్వర్గంలో కేసే నా మీద వేసి.. భూమ్మీద మూసావే..నరనావకీలా పని నేర్పుతారా.. నను చేర్చుకోరా రెడీగా ఉన్నా రా..ఫీ వద్దులేరా.. ఫేమస్సు కారా.. ఇక నా సేవ చేసేసుకో.. ఆగేటట్టుందే.. నా గుండె హిప్సే చూస్తుంటే..ఏదీ గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే.. (2) అందాల రాశీ మేకప్ వేసి.. నా కోసం వచ్చావే.. బుల్లితెర నేనే.. బిగ్ స్టారును నేనే..తెలుగిళ్లలోనే ప్రతి ఒక్కరు ఫ్యానే..అన్నీ వదిలి వచ్చేసాను పోస్టే ఇచ్చుకో..మోమాటాలు ఏవీ లేక ఫాలో చేసుకో..మా బాగుందే నీ పేరు సూపర్ కుదిరిందే..బ్లాక్ అండ్ వైట్ హాలుకు మొత్తం కలరింగ్ వచ్చిందే..నా కండీషన్స్ అన్నీ నీకిష్టమైతే ఇక వచ్చేయ్ లేటెందుకే.. కాంబో కుదిరిందే.. మనిద్దరి కాంబో కుదిరిందే..ఎండే లేని సీరియళ్లా వందేళ్లుండాలే.. (2) అందాల రాశీ మేకప్ వేసి.. నా కోసం వచ్చావే..స్వర్గంలో కేసే నా మీద వేసి.. భూమ్మీద మూసావే.. ఆగేటట్టుందే.. నా గుండె హిప్సే చూస్తుంటే..ఏదీ గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే.. (2)