సుమంత్ అశ్విన్ హీరోగా, శ్రీకాంత్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఇదే మా కథ’ సినిమా టీజర్‌ను హీరో విక్టరీ వెంకటేష్ ఆదివారం ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. రోడ్ జర్నీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు గురుపవన్ దర్శకత్వం వహించారు. సుమంత్ సరసన తాన్య హోప్ హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్ ఆరంభంలో భూమిక బుల్లెట్ బండి నడుపుతూ కనిపిస్తుంది. వారంతా హిమాలయాల్లో మంచు కొండల మధ్య బైక్ ట్రిప్ వెళ్లినట్లుగా టీజర్ చూపించాడు. ఇందులో సుమంత్ హెయిర్ స్టైల్ చూస్తే మాత్రం నవ్వు ఆగదు. బాహుశా అతడి క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడం కోసం ఆ హెయిర్ స్టైల్ పెట్టారేమో అనిపిస్తోంది.  శ్రీకాంత్ డైలాగ్ ద్వారా అది స్పష్టమవుతుంది. ఎక్స్‌ట్రాలు చేసేవాడికే బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడనే డైలాగ్ మరి ఎవరిని ఉద్దేశించినదో సినిమా చూస్తేనే తెలుస్తుంది. 



‘‘ముందు కంటే మనుషులు ఇప్పుడు జంతువులను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ప్రేమించినవాళ్లు మోసం చేస్తుంటే.. జంతువులను కాకుండా ఇంకెవరిని ప్రేమించాలి?’’ డైలాగ్ బాగుంటుంది. అయితే, చివర్లో ఓ పెళ్లి సీన్లో హీరోయిన్ వరుడు గురించి చెబుతూ.. ‘‘వీడిది ఇంతే సైజ్’’ అని వధువుతో చెప్పడంతో టీజర్ ముగిసింది. సినిమా కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా.. ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  


‘ఇదే మా కథ’ టీజర్:


Also Read: కనులకు తెలియని ఓ కలలా.. సిద్ శ్రీరామ్ మరో మెలోడీ.. సుమంత్ పాటకు మహేష్ బాబు ఫిదా!


ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్‌ కార్యక్రమంలో దర్శకుడు గురుపవన్ మాట్లాడుతూ.. తాను కూడా రైడర్‌నని, అందుకే ఆ నేపథ్యంతో కథ రాశానని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందే లడక్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేపట్టామని తెలిపారు. అయితే, లాక్ డౌన్ వల్ల షూటింగ్‌లో ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత.. జాగ్రత్తలు పాటిస్తూ మిగతా షెడ్యూల్‌‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశామన్నారు. మ‌నాలి షెడ్యూల్ బ్యాలెన్స్ ఉందని, డిసెంబ‌ర్‌లో షూటింగ్ పూర్తిచేస్తామన్నారు. ఇప్పటివరకు చేయని పాత్రల్లో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్ కనిపిస్తారని తెలిపారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. 


Also Read: బుల్లితెరపై మహేష్‌తో ఎన్టీఆర్ గేమ్.. టీఆర్పీ ఆకాశాన్నంటుతుందా?


హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘నాకు బైక్ రైడింగ్ ఇష్టమే. కానీ ప్రొఫెషనల్ రైడర్‌ను కాదు. లాక్‌డౌన్‌లో గురుపవన్ నాకు శిక్షణ ఇచ్చారు. శ్రీకాంత్, భూమిక వంటి సీనియర్ నటులతో నటించడం అద్భుతమైనర అనుభవం’’ అని తెలిపాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘నాకు చిన్నపట్టి నుంచి బైక్ రైడింగ్ ఇష్టం. ఓ సారి కారులో హైదరాబాద్ నుంచి లడక్‌కు కారులో వెళ్లాను. మళ్లీ ఇన్నాళ్లకు ఈ టీమ్‌తో కలిసి లడక్ వెళ్లడం మంచి ఎక్స్‌పీరియన్స్’’ అని తెలిపారు.