సినిమాలు విడుదల అయిన తర్వాత ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులు చాలా ఆసక్తిగా ఎదురుచూసేది? ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది! నిర్మాతలు తమ సినిమా అంత కలెక్ట్ చేసింది, ఇంత వసూలు చేసిందని చెబుతుంటారు. సినిమా యూనిట్ చెప్పే లెక్కల మీద కొంత మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు హీరో సిద్ధార్థ్ కూడా అదే చెప్పారు. అయితే... నిర్మాతలతో పాటు మీడియా, ట్రేడ్ వర్గాలకు కూడా చురకలు అంటించారు.


"నిర్మాతలు కొన్నేళ్లుగా బాక్సాఫీస్ లెక్కల విషయంలో అబద్దాలు చెబుతున్నారు. ఇప్పుడు ట్రేడ్, మీడియా కూడా వాళ్ల అఫీషియల్ ఫిగర్స్ చెప్పడం స్టార్ట్ చేశాయి. అన్ని భాషలు... అన్ని ఇండస్ట్రీలలో ఒకే విధంగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో నిజాయతీ లేదు. సినిమాల కలెక్షన్ రిపోర్టులను తారుమారు చేయడానికి ఈ రోజుల్లో కమీషన్ లేదా రేటు ఎంత?" అని ఘాటుగా సిద్ధార్థ్ ట్వీట్ చేశారు.






గతంలో టికెట్ రేట్స్ విషయంలో కూడా సిద్ధార్థ్ ట్వీట్లు చేశారు. ఏపీలో టికెట్ రేట్స్ తక్కువ చేయడంతో సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వాల జోక్యం వద్దన్నట్టుగా ఆయన ట్వీట్లు చేశారు. 'బొమ్మరిల్లు'తో తెలుగులో భారీ విజయం అందుకున్న సిద్ధార్థ్, అప్పట్లో వరుస తెలుగు సినిమాలు చేశారు. కొంత విరామం తర్వాత మరోసారి 'మహాసముద్రం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. 


Also Read: శంకర్-చరణ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అదే ఫార్ములా..
Also Read: అదీ ప్రభాస్ రేంజ్... 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్‌కు యంగ్ హీరో & హాట్ బ్యూటీ రష్మీ యాంకరింగ్!
Also Read: సముద్రఖని డైరెక్షన్.. త్రివిక్రమ్ ప్రొడక్షన్.. హీరోగా పవన్..
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
Also Read: పవన్ కల్యాణ్ హీరోగా మేనల్లుడి సినిమాకు సీక్వెల్?
Also Read: బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ ఏంటి? ఇదిగో తెలుసుకోండి!!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి