1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరకు మొదటి సంతానంగా జన్మించారు ఘట్టమనేని రమేష్ బాబు.  ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు సోదరుడికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీ్ చేశారు.

కృష్ణ సూపర్ హిట్ మూవీ  ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో బాల నటుడుగా పరిచయమైన రమేష్ బాబు....ఆ తర్వాత కృష్ణ నటించిన పలు సినిమాల్లో కనిపించాడు. ‘మనుషులు చేసిన దొంగలు’, ‘దొంగలకు దొంగ,’ ‘అన్నాదమ్ముల సవాల్’ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’, ‘పాలు నీళ్లు’ నటించిన  రమేష్ బాబు.. వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’తో హీరోగా పరిచయమయ్యారు. హీరోగా ‘సామ్రాట్’తో విజయాన్నందుకున్న రమేష్ బాబు  ‘చిన్ని కృష్ణుడు’, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్’ ‘ముగ్గురు కొడుకులు’, కృష్ణ గారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు లో నటించారు.  1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో 'ఎన్‌కౌంటర్’ తర్వాత ఇప్పటి వరకూ తెరపై కనిపించని రమేశ్... కృష్ణ ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించి.. ‘అర్జున్’ ‘అతిథి’ చిత్రాలు తెరకెక్కించారు.  ‘దూకుడు’ , ‘ఆగడు’ సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. తండ్రి కృష్ణతో కలసి  'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు,'' ఆయుధం','ఎన్‌కౌంటర్'...తమ్ముడు మహేశ్ తో కలసి  'బజారు రౌడీ',' ముగ్గురు కొడుకులు' లో నటించారు.రమేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ వర్గాలు కూడా సోషల్ మీడియా వేదికగాశుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.Also Read: మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు..తొలి సంతకం ఆ ఫైలుపైAlso Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్లAlso Read:  ‘బిగ్ బాస్’లో తల్లీకూతుళ్ల వార్.. తొక్కలో రిలేషన్‌షిప్ వద్దంటూ ఆనీ కన్నీళ్లుAlso Read: ‘పంచతంత్రం’ టీజర్.. ముసలి తాబేలు చెప్పే మన కథలు.. బ్రహ్మీ ఈజ్ బ్యాక్!Also Read: ‘పుష్ప’ నుంచి సెకండ్ సింగిల్ శ్రీవల్లి ఫుల్ సాంగ్ ఇదిగో..Also Read: పవన్ కల్యాణ్‌ విమర్శలకు మోహన్ బాబు ఆన్సర్ ఎప్పుడు? మాటలతోనా? చేతలతోనా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి