Kowushik Bheemidi interview about Happy Ending Movie: యంగ్ హీరో యష్ పూరి ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘హ్యాపీ ఎండింగ్’. అపూర్వరావు హీరోయిన్. కౌశిక్ భీమిడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో దర్శకుడు కౌశిక్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


పురాణ కథతో ఈ జెనరేషన్ కు లింక్!


భారతీయులు ఎంతగానో ఇష్టపడే మహాభారతంలోని శాపాలను లేటెస్ట్ జెనరేషన్ కుర్రాడికి ఆపాదించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు కౌశిక్ తెలిపారు. “ఒక రోజు మహాభారతం చదువుతుండగా, దానిలోని చాలా శాపాలు గురించి తెలిసింది. ఇలాంటి శాపాన్ని ఇప్పటి జెనరేషన్ కుర్రాడు ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ‘హ్యాపీ ఎండింగ్’ కథ మొదలవుతుంది. ఇలాంటి మూవీస్ ఏవైనా తెలుగులో వచ్చాయా? అని ఆలోచించాను. అప్పట్లో బాలకృష్ణ నటించిన ఒక సినిమా ఉంది. కానీ, ఈ మధ్య ఏదీ రాలేదు. వెంటనే స్క్రిప్ట్ రైటింగ్ మీద దృష్టి పెట్టాను. యష్ ను చూడగానే నాకు చాలా ప్రామిసింగ్ గా అనిపించాడు. నా స్టోరీకి బాగా సెట్ అవుతాడని నమ్మాను. యష్ కు కూడా కథ బాగా నచ్చింది. అలా ‘హ్యాపీ ఎండింగ్’ ప్రాజెక్ట్ షురూ అయ్యింది. ఈ సినిమాను ప్రేక్షకులంతా చూసేలా తెరకెక్కించాలి అనుకున్నాం.  అలాగే తీశాం” అని తెలిపారు.


మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా


‘హ్యాపీ ఎండింగ్’ ఒక మంచి రొమాంటిక్ డ్రామా అని దర్శకుడు కౌశిక్ వెల్లడించారు. “‘హ్యాపీ ఎండింగ్’ మూవీని ఒక మంచి రొమాంటిక్ డ్రామాగా రూపొందించాం. కథలో హీరోకు శాపం ఉంటుంది కాబట్టి అతడికి ట్రాజెడీ. కానీ చూసే ఆడియెన్స్ కు మాత్రం నవ్వుకునేలా ఉంటుంది. ఈ సినిమా పోస్టర్ లో హీరోయిన్స్ ను చూపించలేదు. కానీ,  సినిమాలో వాళ్ల క్యారెక్టర్స్ చాలా కీలకంగా ఉంటాయి. నాకు కె విశ్వనాథ్, శేఖర్ కమ్ముల గారి మూవీస్ ఇష్టం. వారి సినిమాల్లో లేడీ క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే నేనూ ఈ మూవీలో హీరోయిన్స్ కు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ డిజైన్ చేశాను. చిన్నప్పుడే ఓ బాబా శాపం పొందిన ఓ యువకుడు ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాడు అనేది చూపిస్తున్నాం. శాపం వల్ల తన పార్టనర్ తో ఫిజికల్ గా ఉండలేకపోయినా..అతను వేరే పద్ధతులతో తన ప్రేమను ఆమెపై చూపిస్తాడు. తన ప్రేయసిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తాడు. ఇప్పటిదాకా మన సినిమాల్లో రొమాన్స్, సన్నిహితంగా ఉండటాన్ని ఒకరకంగా చూపించాం. ‘హ్యాపీ ఎండింగ్’లో ఆ రొమాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో యష్, అపూర్వ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు.


Read Also: పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ - ఆ స్టార్ హీరోతో రొమాన్స్?