Teja Sajja's Hanuman First Review In Telugu: 'హనుమాన్' శుక్రవారం (జనవరి 12న) ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. గురువారం (ఈ నెల 11వ తేదీ) సాయంత్రం 6.15 గంటల నుంచి పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 150 షోలు షెడ్యూల్ చేశారు. ఆల్మోస్ట్ షోస్ అన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఈ సినిమాపై ప్రేక్షకులలో క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. 


'హనుమాన్'కు సూపర్ డూపర్ పాజిటివ్ టాక్!


పెయిడ్ ప్రీమియర్లు వేయడానికి ముందు సినిమా ఇండస్ట్రీలోని కొందరి ప్రముఖులకు 'హనుమాన్' దర్శక నిర్మాతలు స్పెషల్ షో వేశారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం సినిమా అదిరిపోయిందట. మరి ముఖ్యంగా క్లైమాక్స్ లో 15 నిమిషాలు పాటు వచ్చే హనుమంతుడి ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అని చెబుతున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటివరకు ప్రేక్షకులు ఎవరు చూడని విధంగా హనుమంతుడిని దర్శకుడు ప్రశాంత్ వర్మ చూపించారని తెలిసింది.


హీరో తేజా సజ్జా నటన సినిమా హైలైట్స్‌లో ముందు వరుసలో ఉంటుందని 'హనుమాన్' స్పెషల్ షో చూసినవాళ్లు తెలిపారు. ఇంటర్వెల్ తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్ రోల్స్ చేసిన తేజా సజ్జా, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా ఉన్నాయని తెలిసింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ ప్రతి సన్నివేశంలోనూ కనిపించిందని, నిర్మాత ఖర్చుపెట్టిన ప్రతి రూపాయిని తెరపైకి తీసుకొచ్చారని, విజువల్ ఎఫెక్ట్స్ & గ్రాఫిక్స్ ఉన్నత స్థాయిలో ఉన్నాయని, ప్రేక్షకులకు హనుమాన్ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. సో... బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ నమోదు చేయడం కన్ఫర్మ్.


Also Readతెలివిగా తప్పించుకున్న శ్రీలీల, తమన్ ఎంతడిగినా కుర్చీ మడత పెట్టలేదు





'హనుమాన్' భారీ విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఈ సంక్రాంతికి మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నా... వాటితో పాటు తమ సినిమా కూడా చూస్తారని ధైర్యంగా పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగుతున్నారు. అంచనాలకు తగ్గట్టుగా పెయిడ్ ప్రీమియర్ షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి.


'హనుమాన్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పోటీ గట్టిగా ఉంది. బరిలో నాలుగు సినిమాలు ఉండగా... అన్నిటి కంటే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు ట్రేడ్ వర్గాల్లో ఎక్కువ క్రేజ్ ఉంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లు దాటింది. నాగార్జున 'నా సామి రంగ' ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం రూ. 18.50 కాగా... వెంకటేష్ 'సైంధవ్' ప్రీ రిలీజ్ బిజినెస్ పాతిక కోట్లు. మరి, 'హనుమాన్' బిజినెస్ ఎంత? తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.


Also Read: 'హనుమాన్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? - ఏ ఏరియాను ఎన్ని కోట్లకు అమ్మారంటే?


'హనుమాన్'లో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ హీరో సిస్టర్ రోల్ చేశారు. తేజా సజ్జా సరసన అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌ సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదల కానుంది.