HanuMan team meets UP CM Yogi Adityanath: అయోధ్య పురిలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ చేయడంతో భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరిలో సంతోషం నెలకొంది. జై శ్రీరామ్ నామం నలుదిక్కులు వినిపించేలా గట్టిగా మారుమోగింది. థియేటర్లలోనూ జై శ్రీరామ్... జై హనుమాన్ నామస్మరణ బలంగా వినపడింది. అందుకు కారణం 'హనుమాన్'. ఈ సినిమా హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మలను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తన కార్యాలయంలో కలిశారు. 


యోగితో ప్రశాంత్ వర్మ ఏం డిస్కస్ చేశారంటే?
'హనుమన్' విజయం సాధించడంతో హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మను యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. యువ ప్రేక్షకులపై ఈ సినిమా ఎటువంటి ప్రభావం చూపించిందనేది ముఖ్యమంత్రికి దర్శకుడు వివరించారు. అంతే కాకుండా భారతీయ పురాణ ఇతిహాసాల గొప్పదనాన్ని సినిమాలో ఎలా మిళితం చేసిందీ కూడా చెప్పారు. 


యోగితో సమావేశం తర్వాత ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ''యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడం నిజంగా మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాం. నాకు ఇన్‌స్ఫైరింగ్ మూమెంట్ ఇది. సినిమాల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను ఎలా కాపాడుకోవచ్చనేది యోగి గారు మాతో చర్చించారు. 'హనుమాన్' సినిమాలో మేం చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఆఫ్ బీట్ కథను తీసుకుని సూపర్ హీరోగా మార్చిన తీరును ఆయన గుర్తించారు. సినిమాల్లో కొత్తదనం, సాంప్రదాయాలకు విలువ ఇచ్చే నాయకుడు మనకు ఉండటం మన అదృష్టం. ఇటువంటి ప్రోత్సాహాలు మేం మరిన్ని కొత్త ప్రయోగాలు చేయడానికి మనకు స్ఫూర్తి ఇస్తుంది'' అని చెప్పారు. 


'హనుమాన్'గా నటించడం సవాల్ - తేజ సజ్జ
'హనుమాన్' సినిమాలో హనుమంతునిగా నటించడం ఒక సవాల్ అని హీరో తేజ సజ్జ అన్నారు. అదే సమయంలో అటువంటి పాత్ర చేయడం తనకు లభించిన గొప్ప అదృష్టం అన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారికి కలవడం తనకు చాలా గర్వంగా ఉందని ఆయన చెప్పారు. ఇంకా తేజ సజ్జ మాట్లాడుతూ ''మా 'హనుమాన్' సినిమా, అది మన కల్చర్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది యోగి గారితో డిస్కస్ చేశాం'' అని చెప్పారు.


Also Read: రామ్ చరణ్ బర్త్‌ డేకి ముందు - నయా మేకోవర్‌తో సెట్స్ మీదకు!






తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హనుమాన్' సినిమాకు రూ. 200 కోట్ల వసూళ్ల మార్క్ క్రాస్ చేసింది. ఇంకా థియేటర్లలో జోరు చూపిస్తోంది. ఈ సినిమాకు కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా సాగుతోంది. కేవలం తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు... హిందీ ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఆల్రెడీ టాప్ 15లో ఎంటర్ అయ్యింది. అతి త్వరలో టాప్ 10లోకి వస్తుంది.


Also Readఎన్టీఆర్ 'దేవర' డేట్ మీద కన్నేసిన దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'