టాలీవుడ్ లో అతిచిన్న వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లలో హన్సిక ఒకరు. దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హన్సిక. ఈ సినిమా తో ఓవర్ నైట్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు హన్సిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హన్సికకు పెళ్లి కుదిరిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. హన్సిక డేటింగ్ చేస్తోన్న వ్యక్తి తోనే పెళ్లి ఖాయం అయిందని, పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


హన్సిక కొంత కాలంగా ఓ ప్రముఖ వ్యక్తితో డేటింగ్ లో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ వ్యక్తి పేరు సోహోల్ కూతురియా. ఈయన ఒక ప్రముఖ వ్యాపారి. హన్సిక అతడినే.. డిసెంబరు 4న పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఓ సమాచారం ప్రకారం పెళ్ళికి రెండు రోజుల ముందు నుంచి సంగీత్, మెహంది కార్యక్రమాలు కూడా జరగబోతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే ప్రారంభం అయినట్లు సమాచారం. రాజస్థాన్లోని జైపూర్లో ముండోటా ప్యాలెస్ లో హన్సిక వివాహం జరగబోతుందని, ఇప్పటికే ఆ హోటెల్ లో పెళ్లికి సంబంధించి కొన్ని రూమ్స్ కూడా ముందుగానే బుక్ చేసుకున్నట్లు కోలీవుడ్ నుంచి సమాచారం అందుతోంది. 


ఇక హన్సికాకు సోహాల్ కంపెనీలో హన్సికకు కూడా వాటాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హన్సిక పెళ్ళికి సంబంధించిన ఇరు వర్గాలు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే హన్సిక పెళ్లి వార్త విని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ సరైన టైంలో హన్సిక పెళ్లి చేసుకుంటుంది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారట. 


అయితే ఇప్పటికీ మంచి అవకాశాలతో సినిమాల్లో నటిస్తోన్న హన్సిక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. ప్రస్తుతం హాన్సిక ఒక్కో చిత్రానికి 2 కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటోందని టాక్. ఇటు టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా హన్సిక నటిస్తోంది. మరోవైపు హన్సిక నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఆమె సినీ జీవితం పై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందని ఫిల్మ్ వర్గాల టాక్. మొత్తానికి హన్సిక పెళ్లి వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే హన్సిక పెళ్లి గురించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. దీనిపై హన్సిక ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం హన్సిక పలు సినిమాల్లో నటిస్తోంది.



Also Read : ఒక్క శుక్రవారం - ఐదుగురు అందగత్తెలకు అగ్ని పరీక్ష - హిట్ కొట్టేది ఎవరు? ఛాన్సలు పట్టుకునేది ఎవరు?