Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'గుర్తుందా శీతాకాలం' విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Continues below advertisement

తెలుగు చిత్రసీమలోని ప్రతిభావంతులైన యువ హీరోల్లో సత్యదేవ్ (Satyadev) ఒకరు. మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో విలన్‌గా, హిందీలో అక్షయ్ కుమార్ 'రామ్ సేతు'లో హనుమంతుడిగా... అక్టోబర్‌లో రెండు సినిమాలతో సందడి చేశారు. ఇప్పుడు డిసెంబర్‌లో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.     

Continues below advertisement

తమన్నాతో సత్యదేవ్ సినిమా!
సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'గుర్తుందా శీతాకాలం' (Gurthunda Seethakalam Movie). ఇందులో ఆయన సరసన పాన్ ఇండియా స్టార్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కథానాయికగా నటించారు. రెండు వారాల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు నేడు వెల్లడించారు. 

డిసెంబర్ 9న... గుర్తుంటుందిగా!
Gurtunda Seetakalam On Dec 9th : డిసెంబర్ 9న 'గుర్తుందా శీతాకాలం' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. నిజం చెప్పాలంటే./.. ఈపాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కరోనా కారణంగా తొలుత వాయిదా పడింది. ఆ తర్వాత థియేటర్ల దగ్గరకు భారీ కమర్షియల్ సినిమాలు క్యూ కట్టడంతో వాయిదా వేయక తప్పలేదు. రెండు మూడు సార్లు విడుదల తేదీ వెల్లడించి మరీ వెనక్కి వెళ్లారు. ఇప్పుడు మంచి తేదీ చూసుకుని విడుదల చేస్తున్నారు.

సత్యదేవ్‌కు ఈ సంవత్సరం ఐదో రిలీజ్ ఇది. 'గాడ్ ఫాదర్', 'రామ్ సేతు' కంటే ముందు 'ఆచార్య'లో అతిథి పాత్ర చేశారు. 'గాడ్ సే'లో హీరోగా నటించారు. అటు తమన్నాకూ ఐదో రిలీజ్ కావడం విశేషం. వరుణ్ తేజ్ 'గని'లో స్పెషల్ సాంగ్ చేసిన ఆవిడ... 'ఎఫ్ 3'లో వెంకట్జ్ జోడీగా కనిపించారు. హిందీలో 'బబ్లీ బౌన్సర్', 'ప్లాన్ ఎ ప్లాన్ బి' సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు 'గుర్తుందా శీతాకాలం'తో మరోసారి కథానాయికగా వస్తున్నారు. 

Also Read : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

జీవితాంతం గుర్తుకు వచ్చే సంఘటనలతో...
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' చిత్రానికి నాగ శేఖర్ దర్శకులు. ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సమర్పణలో భావ‌న ర‌వి, రామారావు చింతపల్లితో కలిసి ఆయన సినిమాను నిర్మించారు. కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాకు రీమేక్ ఇది.

''ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌నలను ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో రూపొందించిన చిత్రమిది'' అని 'గుర్తుందా శీతాకాలం' యూనిట్ పేర్కొంది.

'గుర్తుందా శీతాకాలం' సినిమాలో మేఘా ఆకాష్ (Megha Akash), కావ్య‌ శెట్టి (Kavya Shetty) నటించారు. ఇందులో ప్రియదర్శి (Priyadarshi Pulikonda) వినోదం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టాక్. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు. ల‌క్ష్మీ భూపాల్ మాటలు రాశారు. ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, సినిమాలో సాంగ్స్ హైలైట్ అవుతాయని, ఆ పాటల్లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బావుంటుందని నిర్మాతలు తెలిపారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola