గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 22 Today Episode 562)
ఎవ్వరికీ తెలియకుండా ఓ వ్యక్తి దగ్గర్నుంచి పెన్ డ్రైవ్ తీసుకున్న రిషి...అది ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఫుటేజ్ చూసి షాక్ అవుతాడు. పరీక్ష రాయకుండా చేసేందుకు వసుధారని సాక్షితో కిడ్నాప్ చేయిస్తుంది దేవయాని. అయితే ఆ ఫుటేజ్ లో వసుధారకి మత్తు మందిచ్చి తీసుకెళ్లిన వ్యక్తిని..ఆ వెనుకే ఉన్న సాక్షిని చూస్తాడు. ఇంత పెద్ద విషయం వసుధార నా దగ్గర దాచిందా అనుకుంటాడు. కట్ చేస్తే ఇంటికెళ్లిన రిషిని తీసుకుని ధరణి రూమ్ కి వెళుతుంది వసుధార. నా దగ్గరకు వచ్చినప్పుడే ఇలా జరిగింది సార్ అని చెప్పి బాధపడుతుంది.. నీ దగ్గరకు వచ్చిన ఎవ్వర్నీ ప్రశాంతంగా ఉంచవా వసుధారా అని అనేస్తాడు రిషి...ఏమీ మాట్లాడలేక బాధగా చూస్తుండిపోతుంది వసుధార...
Also Read: వంటలక్కకి ఘోర అవమానం, ఇంట్లోంచి వెళ్లిపోయిన హిమ, సౌందర్యకి దొరికిపోయిన మోనిత!
జరిగిన కథ
రిషి తనతో మాట్లాడుతాడో లేదో అనుకున్న మహేంద్ర దగ్గరకు వచ్చి sorry చెబుతాడు రిషి. నా కోపం ఎంతోసేపు ఉండదు డాడ్ అంటూనే భోజనం చేశారా అని అడుగుతాడు. ఆ తర్వాత గౌతమ్ వసు ను ఏమైనా అన్నావా అనటంతో అప్పుడే అక్కడికి జగతి వస్తుంది. దూరమైన వాళ్ళు దగ్గర కారని.. దగ్గరైన వాళ్ళు దూరం కారు అని జగతిని-వసుధారని ఉద్దేశించి అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అటు వసుధార కాలేజీలో తన క్లాస్ రూమ్ కి వెళ్లి బోర్డు మీద యాంగ్రీ ప్రిన్స్ అని రాసి రిషి గురించి తనలో తాను మాట్లాడుకుంటుంది. ఎలాగైనా రిషి సార్ ఇక్కడికి రావాలి అనుకుంటండంగా అక్కడకు వస్తాడు రిషి.
రిషి: ఏం జరిగినా నాకు నీ మీద ప్రేమ తగ్గదు..నీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాను.. నీ దగ్గర నుండి నాకు సమాధానం కావాలి.. ఆ ప్రశ్న ఏంటో.. ఆ జవాబు ఏంటో నీకే తెలుసు.. దాన్నిబట్టే భవిష్యత్తు ఉంటుంది
వసు: ఏడుస్తూ నా ప్రేమలో ఎటువంటి సార్ధం లేదంటుంది.
రిషి: మూడు రోజుల్లో సమాధానం కావాలని అక్కడి నుంచి వెళ్తాడు
ఆ తర్వాత రిషి తన క్యాబిన్ దగ్గరకు వెళ్లి ఓ వ్యక్తి దగ్గర్నుంచి పెన్ డ్రైవ్ తీసుకుంటాడు..ఈ పెన్ డ్రైవ్ ఇచ్చిన సంగతి ఎవ్వరికీ చెప్పొద్దు నువ్వెళ్లు అని పంపించేసి క్యాబిన్లోకి వెళతాడు.
Also Read: వసు చుట్టూ ప్రేమకంచె వేసిన రిషి, సహాయం చేయాలంటూ పెద్ద మెలిక పెట్టిన ఈగో మాస్టర్
ఆ తర్వాత వసుధార ఇంట్లో వదిలేసిన చీర తీసుకెళ్లి ఇస్తుంది ధరణి. కాసేపు మాట్లాడాక అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంతలో యాక్సిడెంట్ అయి కాలికి దెబ్బతగిలి పడిపోతుంది. వసుధార ఇంటికి తీసుకురావడం చూసి దేవయాని మండిపడుతుంది. వసు ఎక్కడినుంచి వచ్చింది ...ఆ సమయంలో వసు అక్కడ ఎందుకు ఉంది..గతంలో రిషికి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడే ఉన్నావు, ఇప్పుడు ధరణికి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడే ఉన్నావ్...మా ఇంటి వాళ్లకి ఎప్పుడు ఏం జరుగుతుందో కాచుకుని కూర్చుంటావా అని నోరు పారేసుకుంటుంది.
జగతిని కాఫీ ఇమ్మని అడిగితే..ముందు ధరణి పని చూశాక ఇస్తానంటుంది జగతి. కోపంగా రియాక్టైన దేవయాని దగ్గరకొచ్చిన వసుధార..జగతి మేడం మీరు కాఫీ ఇవ్వండి ధరణి మేడం పని నేను చూసుకుంటా అంటుంది. నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్లు రిషి వస్తే కోప్పడతాడని దేవయాని అంటే...ఆయన వచ్చాకే వెళతాను అంటుంది వసుధార. ఇదంతా బుధవారం రాత్రి ఎపిసోడ్..దీనికి కొనసాగింపే పైన ప్రోమో....