గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 21 Today Episode 561)
రిషి ఇంకా ఇంటికి రాలేదని మహేంద్ర సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్ అంకుల్ రిషి కాల్ చేశాడా అని అడుగుతాడు. లేదని మహేంద్ర చెప్పడంతో..ఎందుకు అంకుల్ అంత డల్ గా ఉన్నారంటాడు. ఇంతలో రిషి ఎంట్రీ ఇవ్వడం చూసి..నాపై ఇంకా కోపంగా ఉన్నాడు పలకరించకుండానే వెళతాడేమో అనుకుంటాడు మహేంద్ర... ఈ రోజు ఎపిసోడ్ లో రిషి-వసుధార మధ్య డిస్కషన్ కంటిన్యూ అవుతోంది.
రిషి: నాకోపం నా ప్రేమ ఒక్కసారి వస్తే పోయేవి కాదు..మన ప్రేమకోసం కోపాన్ని పక్కనపెడతాను దానికి నువ్వో సాయం చేయాలి
వసుధార: ఏం చేయాలి సార్
రిషి ఏదో చెబుతుంటాడు..అది విని వసుధార కళ్లలో నీళ్లు తిరుగుతాయి..మన ప్రేమకోసం ఈ మాత్రం చేయలేవా అని వసుచేతిపై చేయివేస్తాడు రిషి..ఆ చేతిపై కన్నీళ్లు పడతాయి..ఇంతకీ రిషి ఏం కోరాడో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే
Also Read: వంటలక్కే నా భార్య అన్న కార్తీక్, దీపను పిచ్చిదాన్ని చేసేందుకు స్కెచ్ వేసిన మోనిత!
జరిగిన కథ
వసుధార వెళ్లిపోయినప్పుడు ధరణి పెరుగు-పంచదార కలపి ఇవ్వడంపై దేవయాని ఫైర్ అవుతుంది.
దేవయాని:నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా పెరుగులో చక్కెర కలిపి...ఇంటి కోడళ్ళకి ఇంటి ఆడపిల్లలకు ఇస్తారు... నువ్వు వసుధారకి ఇచ్చావంటే నేను ఏమనుకోవాలి. ఇంతలో జగతి ...ఆ తర్వాత మహేంద్ర అక్కడకు వస్తారు. ఇక్కడ నీకు ఇద్దరు శిష్యులు తయారయ్యారు. కాలేజ్ లో ఒకరు, ఇంట్లో ఒకలు. ఇది నా ఇల్లు నేను ఎవర్ని రమ్మంటే వాళ్ళు రావాలి,ఎవరు ఉండాలి అనుకుంటే వాళ్లే ఉండాలి. తోటి కోడలు ఎలాగూ నాకు విలువ ఇవ్వదు. నువ్వు కూడా ఈ మధ్య విలువట్లేదు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది దేవయాని.
దేవయాని వెళ్ళిపోయిన తర్వాత, అక్కయ్య గురించి తెలిసిందే కదా మనసుకు తీసుకోకు అని అంటుంది జగతి.
వసుని దించేసి వెళ్లిపోతున్న రిషితో...సాయంత్రం రెస్టారెంట్ కి వస్తారు కదా సార్ అని అడుగుతుంది.
రిషి: ఇప్పుడు విషయం అది కాదు వసుధార. నేను ఇంత సైలెంట్ ఉన్నా అంటే జరిగిన సంఘటనలు ఒప్పుకున్నట్టు కాదు.కొన్ని విషయాల్లో నన్ను ప్రభావితం చేయొద్దు. నా ఆలోచనలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవద్దు.నన్ను నాలా ఉండనీ. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు
వసు: జగతి మేడం విషయం గురించే కదా సార్ మీరు చెబుతున్నారు అనుకుంటుంది మనసులో
Also Read: ఒకరికి ఈగో మరొకరికి పొగరు ఇద్దరూ ఇద్దరే -'తగ్గేదే లే' అన్న రిషి, 'వదిలేదే లే' అన్న వసు
మరోవైపు ఇంట్లో..రిషి ఇంకా రాలేదేని టెన్షన్ పడుతుంటాడు మహేంద్ర. రిషి నీది స్వార్థమైన ప్రేమ అన్నా సరే రిషి మీద ఏమాత్రం కూడా కోపం రాలేదు అంటుంది జగతి.
మహేంద్ర: ఎందుకో తెలియదు రిషి అంటే నాకు ప్రాణం.నా శరీరంలో ఒక భాగమైపోయాడు.వాడి మీద నాకెందుకు కోపం వస్తుంది
జగతి: నీకెందుకు కోపం ఉంటుంది మహేంద్ర నీ సొంత కొడుకు కదా
మహేంద్ర: నీ కొడుకు కూడా జగతి.ఏమో ఏదో ఒక రోజు రిషి కూడా నిన్ను అమ్మా అని పిలిచే రోజు వస్తుందేమో. నేను నిన్ను కలుస్తానని జీవితంలో అనుకోలేదు. నువ్వు మన ఇంటికి వస్తావని కూడా అనుకోలేదు అలాగే ఇది కూడా జరగవచ్చు
జగతి: నాకు అంత పెద్ద అసలు లేవు మహేంద్ర ఇప్పటికే జరిగింది చాలు ఈ విషయం వల్ల రిషి ప్రేమ మీద ప్రభావం ఏమీ పడదు కానీ ఈ సందర్భాన్ని దేవయాని అక్కయ్య ఎలా వాడుకుంటారో అనే భయం వేస్తోంది
మహేంద్ర: ఏం జరుగుతుందో చూద్దాం జగతి
రోడ్డుపక్కన కారు ఆపి రిషి...రూమ్ లో వసుధార ఇద్దరూ ఒకే విషయంపై ఆలోచిస్తారు.
రిషి-వసు: వసుధారకు తను చేసే ప్రయత్నం తప్పని తెలియడం లేదా ....నేను చేసిన పని తప్పని ఎందుకు అంటున్నారు
రిషి-వసు:గురుదక్షిణ ఒప్పందం ఎలా ఒప్పుకుంటుంది -నేను అంతకన్నా మంచి గురుదక్షిణ ఎలా ఇవ్వగలను
రిషి-వసు:నా బాధ నాకు తెలుసు నేను జగతి మేడంని అమ్మ అని పిలవడం అసంభవం - మీరు త్వరలోనే జగతి మేడంని అమ్మా అని పిలిచి తీరుతారు
దీనికి కొనసాగింపే పైన పోస్ట్ చేసిన ప్రోమో...