గుప్పెడంతమనసు జనవరి 12 గురువారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 12th Update)


తన క్యాబిన్లో కూర్చున్న రిషి..క్యాబిన్ బయట వసుధారని చూసి షాక్ అవుతాడు.
రిషి: నువ్వొచ్చావా 
వసుధార: ఏం సార్ రాకూడదా..మీరు నన్ను వదిలేసి వస్తే నేను రాననుకున్నారా
రిషి: ( నా ఇష్టప్రకారమే పెళ్లి జరిగిందన్న వసుధార మాటలు గుర్తుచేసుకుంటాడు) వెళ్లిపో వసుధారా నవ్వు వేరే వాళ్లతో   తాళికట్టించుకున్నప్పుడు..నువ్వు నా కళ్లెదురుగా నిల్చుంటే నేను భరించలేను..మోసపోయాను నీచేతిలో
వసుధార: నాకు పెళ్లైంది నిజమే..కానీ..
రిషి: ఇంకేం మాట్లాడకు వసుధార..వెళ్లిపో ఇక్కడి నుంచి
వసుధార షాక్ అయి చూస్తుంది....


Also Read: మోనిత గుండె దీపకు మార్పిడి, కార్తీక్ ప్రేమ కోసం ప్రాణత్యాగం - ఎవరి ప్రేమ గెలిచినట్టు!


గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
రాజీవ్: మెడలో నువ్వే తాళి కట్టుకుని ఎవరో తాళి కట్టారని నన్ని నమ్మిస్తున్నావు. ఎంత గొప్ప ఆలోచన నీది ఎంత తెలివి నీది. ఇంత తెలివైనది నాకు భార్యగా వస్తుంది అంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా . అందుకే నాకు నువ్వే కావాలి ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చావు నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. పద హాస్పిటల్ కి వెళ్దాం
వసు: నేను హాస్పిటల్ కీ వెళ్తాను నువ్వు  రావాల్సిన అవసరం లేదు
రాజీవ్: నీ రక్షణ సంరక్షణ అన్ని నావే కదా దగ్గరుండి తీసుకెళ్తాను
అప్పుడు వసుధార..నువ్వు అవసరం లేదు ఇక్కడే ఉండు అనేసి ఆటో ఎక్కి వెళ్లిపోతుంది. 


మరోవైపు కాలేజీకి వెళ్లిన రిషి, వసుధారతో కలిసి గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉండగా జగతి అక్కడకు వెళుతుంది.
జగతి: జ్ఞాపకాలు అందంగానే ఉంటాయి కానీ అన్ని జ్ఞాపకాలు అందమైనవి కావు రిషి . ఎందుకు మనసుకు గుచ్చుకునే జ్ఞాపకాలను తలుచుకుంటావు . ఈ జ్ఞాపకాల నుంచి నువ్వు బయటపడాలి 
రిషి: మేడం నా తప్పేముంది చెప్పండి. ఎందుకు ఇలా చేసింది . ప్రాణంగా ప్రేమించడమే తప్ప మీ శిష్యురాలు నా మనసుని ఏం అర్థం చేసుకుంది మేడం. నా పసి మనసుని అర్థం చేసుకోకుండా మీరు వెళ్లిపోయారు. మీరు ఎందుకు వెళ్లిపోయారు నాకు తెలియదు, మీరు కూడా నాకు చెప్పలేదు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేని వారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారని అనుకోవడం లేదు
రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆగు రిషి అనడంతో మీరేం చెప్పకండి మేడం మీ శిష్యురాలు కనిపిస్తే ఈ రిషీంద్ర భూషణ్ కి మోసపోవడం కొత్తేమీ కాదు. జ్ఞాపకాలతో బతకగలడు తను నాకు అక్కర్లేదు అన్న విషయం చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 


మరొకవైపు వసుధార హాస్పిటల్ కి వెళుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది . చక్రపాణి చేతులు పట్టుకుని ఎప్పుడు నీ కూతురు తలవంచే పని చేయదు నాన్న అని ఎమోషనల్ అవుతూ ఇంతలో సుమిత్రకు మెలుకువ వస్తుంది.అత్తయ్య మామయ్య బాగానే ఉన్నారు నువ్వు మీ ఇంటికి వెళ్లి వాళ్ళని బాగానే చూసుకుంటావు మరి నా సంగతేంటి మీ కుటుంబం లిస్టులో నుంచి నన్ను కొట్టేసావా అని అంటాడు రాజీవ్. చూడు వసు ఇప్పుడు నువ్వు నేను ఈ ప్రపంచం దృష్టిలో భార్యా భర్తలము అనడంతో బావ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని అంటుంది వసుధార. 


మరొకవైపు కాలేజీలో జగతి రిషి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. జగతి ఏంటి జగతి ఇది అనగా రిషిని చూడాలంటేనే నా గుండె తరుక్కుపోతోంది మహేంద్ర అని అంటుంది. మనసు ముక్కలు చేసుకుని బాధను అనుభవిస్తూ మౌనంగా ఉన్నాడు మనం ఏమి చేయలేమా రిషి బాధను తీర్చలేమా అని అంటుంది. మనం ఏం చేయలేము జగతి అనడంతో ఇద్దరూ బాధపడతారు.


సుమిత్ర-చక్రపాణికి మెలకువ రావడంతో..ఇద్దరి దొంగనమస్కారం చేస్తాడు రాజీవ్. అప్పుడు కానిస్టేబుల్ ఎస్సై కి ఫోన్ చేసి వాళ్ళకి మెలకువ వచ్చింది అని చెప్పడంతో సరే వస్తున్నాను అంటాడు. మరోవైపు రిషి క్యాబిన్లోకి వెళ్లి కూర్చుని వసుధార మాటలు తలుచుకుని బాధపడతాడు.....దీనికి కొనసాగింపే పైన ఉన్న ప్రోమో...