Guntur Kaaram movie 1am shows theatre in hyderabad: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన కొత్త సినిమా 'గుంటూరు కారం' బెనిఫిట్ షోలు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అర్ధరాత్రి ఒంటి గంటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 థియేటర్లలో షోలు పడతాయి. అందులో హైదరాబాద్ థియేటర్లు ఎన్ని? ఏయే థియేటర్లలో ఒంటి గంటకు సినిమా ప్రదరిస్తారో చూడండి. 


గుంటూరు కారం బెనిఫిట్ షోస్ థియేటర్స్ లిస్ట్!



  1. నెక్సాస్ మాస్, కూకట్ పల్లి

  2. ఏఎంబీ సినిమాస్, గచ్చిబౌలి

  3. భ్రమరాంబ థియేటర్, కూకట్ పల్లి

  4. మల్లిఖార్జున థియేటర్, కూకట్ పల్లి

  5. అర్జున థియేటర్, కూకట్ పల్లి

  6. విశ్వనాథ్ థియేటర్, కూకట్ పల్లి

  7. గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ

  8. సుదర్శన్ 35 ఎంఎం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్

  9. రాజధాని డీలక్స్, దిల్ సుఖ్ నగర్

  10. శ్రీరాములు థియేటర్, మూసాపేట్

  11. శ్రీ సాయి రామ్ థియేటర్, మల్కాజ్ గిరి

  12. శ్రీ ప్రేమ థియేటర్, తుక్కుగూడ

  13. ప్రసాద్ మల్టీప్లెక్స్, నెక్లెస్ రోడ్

  14. ఎస్విసీ తిరుమల థియేటర్, ఖమ్మం

  15. వినోద థియేటర్, నల్గొండ

  16. మమతా థియేటర్, కరీంనగర్

  17. నటరాజ్ థియేటర్, నల్గొండ

  18. ఎస్విసీ విజయ థియేటర్, నిజామాబాద్

  19. వెంకటేశ్వర థియేటర్, మహబూబ్ నగర్

  20. శ్రీనివాసా థియేటర్, మహబూబ్ నగర్

  21. రాధిక థియేటర్, వరంగల్

  22. అమృత థియేటర్, హన్మకొండ

  23. ఎస్విసీ ముల్టీప్లెక్స్, గద్వాల్


Also Read: 'గుంటూరు కారం' దెబ్బకు 'సలార్' రికార్డ్ గల్లంతు... మమ మహేష్ మాస్






హైదరాబాద్ సిటీలో చూస్తే... టోటల్ 13 థియేటర్లలో వంటి గంటకు 'గుంటూరు కారం' షోలు పడతాయి. సంక్రాంతికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూడాలని కోరుకునే ఆడియన్స్ సరిగ్గా ప్లాన్ చేస్తే... జనవరి 11వ తేదీ సాయంత్రం 'హనుమాన్' చూసి, ఆ తర్వాత డిన్నర్ చేసి... మిడ్ నైట్ ఒంటి గంటకు 'గుంటూరు కారం' చూడవచ్చు. ఉదాహరణకు... 'భ్రమరాంబ' థియేటర్లో గురువారం సాయంత్రం 6.15 గంటలకు 'హనుమాన్' పెయిడ్ ప్రీమియర్ షో ఉంది. ఆ థియేటర్లో మిడ్ నైట్ ఒంటి గంటకు 'గుంటూరు కారం' బెనిఫిస్ట్ షో ఉంది.


Also Readశ్రద్ధా శ్రీనాథ్ @ వైఫ్ రోల్స్ - గ్లామర్ రోల్స్ కాదు, సపరేటు రూటులో సైంధవ్ హీరోయిన్



'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం'. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. మహేష్ మాస్ అవతార్, ఆ ఎనర్జీ అభిమానులకు నచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే... భారీ కలెక్షన్స్ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా హాఫ్ మిళియన్ మార్క్ చేరుకోవడం ఖాయం. సంక్రాంతి సీజన్ కనుక ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. 


మహేష్ సరసన యంగ్ హీరోయిన్లు శ్రీ లీల, మీనాక్షీ చౌదరి నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మలయాళ నటుడు జయరామ్, రావు రమేష్, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్, 'రంగస్థలం' మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ప్రొడ్యూస్ చేశారు.