నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని నందగోపాల్ కి చెప్పు అని తులసి చెప్తుంది. ముందు నీ బుర్రకి ఎక్కించుకో తర్వాత మీ ఆయన నందగోపాల్ కి అర్థం అయ్యేలా చెప్తావ్ అని అంటుంది. ఈ మహారాణిగారు ఇన్ డైరెక్ట్ గా నాకు వార్నింగ్ ఇస్తుందని లాస్య మనసులో అనుకుంటుంది. మీ ప్రవర్తన బట్టి సామ్రాట్ గారి ప్రవర్తన ఉంటుందని హెచ్చరిస్తుంది. ఒక్క అవకాశం దొరికితే చాలు నేను ఏంటో చూపిస్తాను అని లాస్య అంటుంది. తులసి సామ్రాట్ క్యాబిన్ లోకి వస్తుంది. ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. లాస్య కోసం నందు ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే నందు నందు అనుకుంటూ లాస్య సంతోషంగా వస్తుంది. మనల్ని తిరిగి జాబ్ లో జాయిన్ చేసుకోడానికి సామ్రాట్ ఒప్పుకున్నారు అని చెప్తుంది. ఏం చెప్పి ఒప్పించావ్ అని అడుగుతాడు.
ఇక మా వల్ల ఎటువంటి గొడవ జరగదని హామీ ఇచ్చాను అంటే ఒప్పేసుకున్నారు నిన్ను పొగిడారు కూడా అని లాస్య డబ్బా కొడుతుంది. మరి తులసి ఊరుకుందా అని నందు అంటే తులసి వల్లే జాబ్స్ వచ్చాయని తెలిస్తే నందు రివర్స్ అవుతాడు ఆ నిజం దాచిపెట్టాలని అనుకుంటుంది. సర్ ప్రైజింగ్ గా తులసి అడ్డుకోలేదని చెప్తుంది. నాకు నమ్మకం లేదు తులసి మౌనం వెనక ఏదో ప్లాన్ ఉండే ఉంటుందని నందు అంటాడు కానీ లాస్య నచ్చజెబుతుంది. దివ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిందని నందుకి ఫోన్ చేసి చెప్తారు. నందు, లాస్య సైట్ దగ్గర సామ్రాట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆఫీసుకి రెడీ అయ్యేలోపు వెయిట్ చేస్తూ ఉండేది, ఆఫీసు నుంచి వచ్చేసరికి నా కోసం గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉండేది అలాంటి తులసి కోసం నేను ఇప్పుడు పావు గంట నుంచి చేతులు కట్టుకొని ఆమె కోసం వెయిట్ చేస్తున్నా అని నందు చిరాకుపడతాడు.
Also Read: వేదని వదిలి మాళవిక చెయ్యి అందుకున్న యష్- జలస్ ఫీల్ అయిన అభిమన్యు
సామ్రాట్, తులసి కారులో నుంచి దిగుతారు. వాళ్ళని చూసి లాస్య కౌంటర్స్ వేస్తూ ఉంటుంది. తులసిగారు మీ తులశివనంలోకి వచ్చాం హ్యాపీనా అని సామ్రాట్ చెప్తాడు. సైట్ లో నడుస్తూ ఉంటే ఒక గుంత దాటాల్సి వస్తుంది తులసి భయంగా నిలబడి పోవడంతో సామ్రాట్ ధైర్యం చెప్తాడు. జీవితంలో పైకి ఎదగాలని అనుకున్నారు ఈ గుంత దాటలేరా నేను ఉన్నాను కదా భయపడకండి అని తులసికి సామ్రాట్ చెయ్యి అందిస్తాడు. చెయ్యి పట్టుకుని తులసి దాటేస్తుంది. ఆ పాణి గ్రహణం చూడు నందు అని లాస్య కౌంటర్స్ వేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ సంతోషంగా పనులు చేసుకుంటూ ఉంటారు. మార్నింగ్ నుంచి నాకు కాఫీ కూడా ఇవ్వలేదు చిన్న ఝలక్ ఇస్తా అని ప్రేమ్ శ్రుతి కాఫీ అని అరుస్తూ ఉంటాడు.
విననట్టు ఉంటాను ఏమి చేస్తాడో అని శ్రుతి పట్టించుకోదు. మొగుడు కాఫీ అడుగుతుంటే పట్టించుకోకుండా వెళతావ్ ఏంటే అని అనసూయ అంటుంది. ఇక చేసేది లేక ఉండు చిటికిలో పట్టుకొని వస్తాను అని శ్రుతి వెటకారంగా చెప్తుంది. శ్రుతి కాఫీ చేసి తీసుకొస్తుంది. అమృతం పట్టుకొని వస్తున్న దేవతలాగా ఉంది అని ప్రేమ్ మనసులో పొంగిపోతాడు. శ్రుతి కాఫీ షుగర్ వేయకుండా చేదుగా తీసుకొని ఇవ్వడంతో వాక్ అంటాడు. పాటలు పాడే వాళ్ళు షుగర్ వేసుకోకుండా కాఫీ తాగలంట నెట్ లో చూశాను అని శ్రుతి ఇరికిస్తుంది. నీ భార్య చూడు ఎంత శ్రద్ధ చూపిస్తుందో తాగు అని అనసూయ బెదిరిస్తుంది. దీంతో ప్రేమ్ చచ్చినట్టు ఆ కాఫీ తాగేస్తాడు.
సామ్రాట్ తులసిని చూస్తూ ఉంటే నందు జలస్ గా ఫీల్ అవుతాడు. మాజీ మొగుడు పక్కనే ఉన్నాడు అని ధ్యాస కూడా లేకుండా తులసిని చూడు ఎలా చూస్తున్నాడో సిగ్గు లేకుండా అని నందు మనసులో తిట్టుకుంటాడు. ఏంటి సర్ అంతా తీక్షణంగా చూస్తున్నారు అని నందు అడుగుతాడు. నేను ఒక దురదృష్టవంతుడు గురించి ఆలోచిస్తున్నా అని సామ్రాట్ చెప్తాడు. ఎవరు సర్ అని నందు అడిగేసరికి ఇంకెవరూ నువ్వే అని అంటాడు. ఎంతో తపస్సు చేస్తే కానీ దేవుడు వరాలు ఇవ్వడు.. అలాంటిది దేవుడు అప్పనంగా నీకు మంచి వరం ఇచ్చాడు. వేరే ఎవరైనా నీ ప్లేస్ లో ఉంటే లైఫ్ లాంగ్ పండగ చేసుకునే వాడు. నువ్వు మాత్రం పిచ్చోడిలా వృధా చేసుకుంటున్నారు. దేవుడు మీకు ఇచ్చిన వరం తులసి గారు. అసలు ఆ వరాన్ని ఎందుకు వదులుకున్నావ్ అని అడిగేస్తాడు. బాస్ గా కాదు ఒక ఫ్రెండ్ గా అడుగుతున్నా అని సామ్రాట్ అంటాడు. మర్చిపోతున్న పీడకల గుర్తు చేయకండి అని నందు అంటాడు.