Bigg Boss 6 Telugu: ‘జీవితంలో పిల్లలు ఎంత ముఖ్యం’ అన్న అంశంపై తమ భావాలను పంచుకోమని చెప్పారు బిగ్ బాస్. దీంతో బిగ్ బాస్ ఇల్లు ఎమోషనల్ గా మారిపోయింది. ముఖ్యంగా సుదీపకు పిల్లల్లేరు అన్న సంగతి ఈ కార్యక్రమం ద్వారానే తెలిసింది. ఎప్పుడో పెళ్లయినా కూడా ఇప్పటివరకు పిల్లలు లేరన్న సంగతి సుదీప కన్నీళ్లతో చెప్పింది.
థైరాయిడ్ వల్ల...
‘2015లో నేను గర్భం ధరించా, కానీ నేను అప్పటికి బిడ్డను కనేందుకు రెడీగా లేను. అందరూ ఒత్తిడితో వచ్చిన గర్భాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఉంచుకున్నారు. నా బిడ్డతో మాట్లాడడం కూడా మొదలుపెట్టా. బేబీ హార్ట్ బీట్ కూడా బావుంది. కానీ అప్పుడు నాకు థైరాయిడ్ చాలా ఎక్కువ వచ్చేసింది. దాన్ని మేనేజ్ చేసుకోలేకపోయా. బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. నా చెల్లికి కూతురు పుట్టే వరకు నేను నాది అనుకోలేకపోయాను. ఆ బిడ్డ వల్లే మా రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి. మా ఆయన అంటుంటాడు... అది వాళ్ల పిల్ల ఎప్పుడైనా ఇచ్చేయాలి అని, చిన్న బొమ్మనే ఇవ్వాలంటే మనసు ఒప్పలేదు, వాళ్ల పాపని వాళ్లకి ఇస్తుంటే ప్రాణం పోయినట్టు అనిపించింది... అందరి పిల్లలు నా దగ్గరికి వస్తుంటారు. కానీ నా పిల్లలే నా చేతుల్లోకి రావడం లేదు. భవిష్యత్తులో సుదీప కూడా తల్లి అవుతుందని అనుకుంటున్నాను’ అంటూ ఎంతో ఏడ్చింది సుదీప. ఆమె స్టోరీ ఇంటిలోని సభ్యులను చాలా కదిలించింది. తల్లి కావాలని గత ఏడేళ్లుగా సుదీప ఎదురుచూడడం కళ్లు చెమ్మగిల్లేలా చేసింది.
ఆదిరెడ్డి కూడా తన కూతురు హద్విత గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నాకు పిల్లలంటే ఇష్టం ఉండదని గీతక్కలాగే అంటూ ప్రారంభించాడు. ఇప్పటికీ తన భార్య అంటుంటుందని డెలివరీ రోజు తన పక్కన లేనని, అది తాను రిగ్రెట్ ఫీలవుతున్నానని చెప్పాడు. తన చెల్లెలు అంధురాలని, దాని వల్ల బంధువులు తన పాప కళ్లు కూడా తేడాగా ఉన్నాయని అన్నారని చెప్పుకొచ్చాడు. వెంటనే తాను వైద్యులను కలిసి పాప కళ్లు చూపించానని, ఎలాంటి సమస్యా లేదని చెప్పడంతో చాలా ఆనందపడ్డానని అన్నాడు. ఇంట్లోకి కొత్త సభ్యులు వస్తే ఎంత వెధవ అయిన కనెక్ట్ అయిపోతారని చెప్పుకొచ్చాడు.
నా భార్య ప్రెగ్నెంట్
తన భార్య గర్భవతి అని, ఏడోనెల వచ్చి ఉంటుందని చెప్పాడు రేవంత్. తన భార్య వల్లే ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చాడు. తనకి నాన్న అనే పిలుపు తెలియదని, ఎప్పుడెప్పుడా నాన్న అని పిలుచుకుంటానా అని వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు.బాబు పుడితే తండ్రి పేరు పెట్టుకుంటానని, కూతురు పుడితే లక్ష్మిదేవి పుట్టిందని అనుకుంటా అని చెప్పుకున్నారు. మిగతా సభ్యులంతా తమ బాధను పంచుకున్నారు.
చంటి మాట్లాడుతూ తల్లి తన కళ్ల ముందే మంటల్లో కాలిపోయిందన, తాను ఎవరనైనా ఇష్టపడితే అందరూ ఇలాగే దూరం అవుతారని అన్నాడు. తనకు ఇద్దరు కూతుళ్లని, వాళ్లిద్దరూ స్కూలుకెళ్లాక నిద్ర లేస్తానని, వారు పడుకున్నాక వస్తానని చెప్పారు.
Also read: టీ ఎలా చేయాలో తెలియదు కానీ కెప్టెన్ అయిపోతాడంట, చంటి సెటైర్లు - డ్యాన్సులతో దద్దరిల్లిన ఇల్లు
Also read: నాలుగో నెలలో బిడ్డను పొగొట్టుకున్న మెరీనా - రోహిత్, ఎమోషన్‌తో నిండిపోయిన బిగ్‌బాస్ ఇల్లు