Bigg Boss 6 Telugu: అంతవరకు తిట్టుకున్నారు కొట్టుకున్నారు, అరుచుకున్నారు, గెలిచేందుకు పోరాడారు... కానీ బిగ్ బాస్ ఇచ్చిన ఓ పిలుపు కాస్త ఆ ఇంటిని ఎమోషనల్ గా మార్చేసింది. చూసే మనకు కూడా కన్నీరు తెప్పించింది. ప్రతి నవ్వు వెనుక ఒక ఏడుపు ఉంటుందని గుర్తు చేసింది. ప్రోమోలో ఏముందో ఓ లుక్కేయండి.
సిసింద్రీ టాస్కులో ఇచ్చిన బొమ్మలను టాస్కు అయిపోగానే తీసేసుకున్నాడు బిగ్ బాస్. ఆ క్షణంలో చాలా మంది బాధపడ్డారు. దాంతో బిగ్ బాస్ చిన్న టాస్కు ఇచ్చారు. రెండు రోజులు ఇచ్చిన బొమ్మతోనే ఇంతగా కనెక్ట్ అయిపోయిన ఇంటి సభ్యులు, వారి జీవితంలో ఒక బేబీ ఉంటే ఎలా ఉంటుందో చెప్పమని అడిగారు. దానికి ఇంటి సభ్యులంతా తమ అనుభవాలనే చెప్పారు. వారు చెప్పిన ప్రతిదీ కన్నీరు తెప్పించింది. ఇల్లు ఇంత సడెన్ ఎమోషనల్ గా మారుతుందని ప్రేక్షకులు కూడా ఊహించి ఉండరు.
నాన్నా అనే పిలుపు కోసం
సుదీప మాట్లాడుతూ 2015లో తాను గర్భం ధరించానని, థైరాయిడ్ బాగా పెరిగిపోవడం వల్ల బిడ్డ దక్కలేదని చెప్పింది. తన చెల్లికి బిడ్డ పుట్టే వరకు నాది అని అనుకోలేకపోయానని చెప్పుకుంటూ ఏడ్చింది. చెల్లి బిడ్డను తిరిగి ఇచ్చేస్తుంటే నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది అని కన్నీరు పెట్టుకుంది. రేవంత్ మాట్లాడుతూ తనకు నాన్న అన్న పిలుపు తెలియదని, తన భార్యకు ఏడోనెల వచ్చిందని, ఎప్పుడెప్పుడు నాన్నా అని పిలిపించుకుందామా అని ఉందని చెప్పాడు.
కీర్తి భట్ ఎవరి గురించి చెప్పిందో తెలియదు కానీ ‘ఇక్కడికి వచ్చే ముందు నాకు ఫోన్ వచ్చింది నా పాప లేదు అని, చివరి నిమిషంలో కూడా పాప దగ్గర ఉండలేకపోయా’ అని కన్నీరు పెట్టుకుంది.
బిడ్డను పొగొట్టుకున్న ఆ జంట
మెరీనా- రోహిత్ మాట్లాడుతూ తాము బిడ్డను కనాలని అనుకున్నామని. ఆరో వారంలో చెక్ చేస్తే బిడ్డ హార్ట్ బీట్ లేదని వైద్యులు చెప్పారని, మూడు నెలల నిండాక నాలుగో నెలల గర్భాన్ని తొలగించారని చెబుతూ బాధ పడ్డాడు. దానికి మెరీనా వెక్కి వెక్కి ఏడ్చింది.
ఇద్దరు అమ్మలు...
చలాకీ చంటి మాట్లాడుతూ కళ్ల ముందు అగ్నిప్రమాదం జరిగిందని, అందులో తన తల్లి కాలిపోయి చనిపోవడం చూశానని చెప్పాడు. గంటన్నర పాటూ ఏడ్చానని, ఆ ఏడుపు దేవుడు విన్నాడో ఏమో తెలియదు కానీ తన అమ్మను ఇద్దరిగా మారి బిడ్డలుగా పంపించాడని చెప్పాడు. పిల్లలున్న తల్లిదండ్రలు అడుక్కునైనా తినాలని, బిడ్డలని మాత్రం రోడ్డు మీద వదలద్దు అంటూ చెప్పాడు.
ఈసారి ప్రోమో మొత్తం ఎమోషనల్ గా ఉంది. ఇంటి సభ్యులంతా ఏడుస్తూ కనిపించారు.
Also read: రాత్రిపూట దొంగాటలు ఆడిన గీతూ, ఈ వారం కెప్టెన్సీకి పోటీపడేది ఆ నలుగురు
Also read: అయ్యో గీతూ బొమ్మ కూడా వచ్చేసిందే, పగ తీర్చుకున్న రేవంత్, ప్రోమో అదిరింది