Bigg Boss 6 T elugu: సిసింద్రీ టాస్కులో పగ తీర్చుకున్నాడు రేవంత్. రేవంత్ అభిమానులకు ఈ ఎపిసోడ్ బాగా నచ్చే తీరుతుంది. సిసింద్రీ టాస్కులో రేవంత్ బొమ్మనే తెలివిగా ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ ఏరియాలో పడేసి, రేవంత్ ను కెప్టెన్సీ పోటీదారు కాకుండా అడ్డుకుంది గీతూ. ఆ విషయంలో చాలా బాధపడ్డాడు రేవంత్. ఈ రోజు పగను తీర్చుకున్నాడు. గీతూ బొమ్మని కూడా తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో పడేశాడు. 


గీతూ తన బొమ్మని స్టోర్ రూమ్ లోని ఫ్రిజ్ వెనుక దాచింది. ఆ బొమ్మను రేవంత్ చూసేశాడు. దాన్ని తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్ స్థానంలో పెట్టాడు. గీతూ చేతిలో ఓడిపోయిన వాళ్లంతా ఆ సీన్ చూసి చాలా ఆనందించారు. రేవంత్ కాళ్లు నొప్పెడుతున్నా ఒంటి కాలిపై పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ బొమ్మను పడేశాడు. బొమ్మపడేయగానే శ్రీహాన్ కూడా చాలా ఆనందించాడు. ‘అయ్యో గీతూ బొమ్మ కూడా వచ్చేసిందే’ అంటూ కామెడీ చేశాడు. గీతూ కూడా చాలా కామెడీ చేశాడు. రాత్రి శ్రీహాన్ బొమ్మను గీతూ తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్ స్థానంలో పడేసింది. ఇప్పుడు గీతూ బొమ్మ కూడా పడడంతో శ్రీహాన్ జోకులేశాడు. ‘రాత్రి నా బాబు డాడీ ఒంటరిగా ఉన్నా గీతూ బొమ్మ కూడా పంపించు’ అన్నాడు. అంటూ కామెడీ చేశాడు. గీతూ కూడా అదే స్థాయిలో కామెడీ చేసింది. రేవంత్ మాత్రం పగ తీర్చుకున్న ఆనందాన్ని పొందాడు. తాడిని తన్నే వాడుంటే, వాడి తలను తన్నే వాడు ఉంటాడు... అన్నాడు. 



ఫైమా ఏడుపు...
ఇక కెప్టెన్సీ పోటీదారులుగా మారేందుకు ఫైమా, కీర్తి భట్, ఇనయా సుల్తానా, ఆరోహి పోటీ పడ్డారు. రింగులోపల ఉన్నవాడే కింగ్ అనే ఆట అది. రింగులో ఉన్న నలుగురిలో ఎవరైతే చివరి దాకా రింగులోపల ఉంటారో వారే గెలిచినట్టు. అయితే ఫైమా చేతులతో పక్కవాళ్లని తోసేయడంతో ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు రేవంత్. ఈ టాస్క్ కి రేవంత్ సంచాలకుడిగా ఉన్నాడు. దీంతో ఫైమా ఏడుపు మొదలుపెట్టింది. ఇక ఆరోహి కూడా బయటికి వచ్చేసింది. చివరగా ఇనయా, కీర్తి రింగులోపల మిగిలాడు. కీర్తి ఊహించని విధంగా ఇనయా ఆమెను బయటికి తోసేసింది. దీంతో ఆమె కెప్టెన్సీ పోటీదారుగా మారింది. 






Also read: అందుకే ‘నారాయణ నారాయణ’ అన్నా, అంతకు మించి ఏం లేదు, వివరణ ఇచ్చిన నాగార్జున


Also read: పెళ్లైన వారికి శోభనం గది, పెళ్లి కాని వారి పరిస్థితి ఏంటి? నాగార్జునకు నారాయణ కౌంటర్