బిగ్ బాస్ రియాల్టీ షోపై నిత్యం విమర్శలు చేసే సీపీఐ నారాయణ మరోసారి తన నోటికి పని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై నాగార్జున ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేస్తే.. నారాయణ మరీ నాటుగా కౌంటర్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ ముమ్మాటికీ బ్రోతల్ హౌస్ అంటూ విరుచుకుపడ్డారు. అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లు సంసారులు కాదన్నారు. అందులో ఏదో ఒకటి చేసుకునే బయటకు వస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన వాళ్లు పతివ్రతలు కారని నారాయణ అన్నారు. ఎవరైనా వాళ్లు పతివ్రతలే అని చెప్పినా తను నమ్మనన్నారు. పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు హౌస్ లోపలికి వెళ్లి ఏం చేసుకుంటున్నారో ఓపెన్ గా చూపించే దమ్ముందా? అని నారాయణ ప్రశ్నించారు. అంతేకాదు.. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జుననూ నారాయణ టార్గెట్ చేశారు. వాళ్ల ఇంట్లో వారిపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిగ్ బాస్ పై నారాయణ నిత్యం ఇలాంటి కామెంట్లు చేయడం, మీడియాలో ఆ వార్తలు ప్రసారం కావడం జరిగినా.. బిగ్ బాస్ నిర్వహకులు, నాగార్జున ఏనాడు స్పందించలేదు. కానీ, మరింత తీవ్ర స్థాయిలో ఎటాక్ చేయడంతో నాగార్జున ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేశారు.
బిగ్ బాస్ తాజా సీజన్ లో భార్యా భర్తలు అయిన మెరీనా, రోహిత్ కంటెస్టెంట్లుగా హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే హౌస్ లోకి వచ్చాక తన భర్త తనను సరిగా పట్టించుకోవడం లేదని, హగ్గులు, ముద్దులు ఇవ్వడం లేదని బాగా బాధపడింది. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న నాగార్జున శనివారం ఎపిసోడ్ లో మెరీనాకు హగ్ ఇప్పించారు. ముద్దులు కూడా పెట్టించారు. ఈ సందర్భంగా ‘‘నాగార్జున.. నారాయణ, నారాయణ వాళ్లిద్దరు మ్యారీడ్’’ అంటూ పంచ్ వేశారు.
అటు నాగార్జున వేసిన పంచ్ కు నారాయణ రియాక్ట్ అయ్యారు. నాగార్జున.. ‘‘నారాయణ, నారాయణ అంటే.. నారాయణ.. నాగన్నా.. నాగన్నా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో పెళ్లైన వారికి లైసెన్స్ ఇచ్చి మరీ శోభనం గది ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. మరి పెళ్లికాని వారి పరిస్థితి ఏంటి? అంటూ ప్రశ్నించారు. వాళ్లకు పెళ్లి కాలేదు కదా.. బంధువులు కూడా కాదు. ఈ వంద రోజులు వాళ్లేం చేస్తారో కూడా చెప్పు నాగన్నా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
మరోవైపు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన కంటెస్టెంట్లు నారాయణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఏం పని లేక బిగ్ బాస్ మీద పడ్డారని మండిపడుతున్నారు. ఈ వయసులో బిగ్ బాస్ హౌస్ లో వాళ్లేం చేసుకుంటారో చూడాలనుకునే బుద్ది ఏంటో అని కోపడ్డుతున్నారు. మొత్తంగా నారాయణ వర్సెస్ బిగ్ బాస్ రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
Also read: నామినేషన్ డే - రెండో వారమే వేడెక్కిన వాతావరణం, ఏం ఇరగదీశావ్ అంటూ ఆరోహిపై ఆదిరెడ్డి ఫైర్
Also read: ఈ వారం 'నో' ఎలిమినేషన్ - మరో ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్!