Etala Rajendar : కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే భయపడలేదని.. ఇప్పుడు కేసీఆర్కు ఎలా భయపడతానని అన్నారు. తనకు తన కుటుంబసభ్యులకు ఏమైనా కేసీఆర్ దే బాధ్యత అని చెప్పారు.హుజూరాబాద్ లో పదుల సంఖ్యలో గన్ లైసెన్సులు ఇచ్చి బెదిరింపులకు దిగుతున్నారని.. తనకు , తన కుటుంబ సభ్యులకు ఒక్క రక్తం బొట్టు కారినా దానికి భాధ్యత ముఖ్యమంత్రి కెసిఆర్ దే. ఎన్ని వచ్చినా వెనుకడుగు వెయ్యనని ప్రకటించారు. తప్పు చేసినవాళ్లు దొరలెక్క ఉంటున్నారని.. ప్రజల కోసం పనిచేసేవాళ్లకు శిక్షలు వేస్తున్నారని ఆరోపించారు. శాసనసభలో బీజేపీ హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఈటల ఆరోపించారు. స్పీకర్ ను మరమనిషి అన్నందుకు తనకు శిక్ష వేశారని.. మరి కేసీఆర్ అన్న మాటలకు ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు.
సభ్యుల హక్కులను కాపాడలేకపోతున్ స్పీకర్
అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని.. ఒక సభ్యుడు ఉన్నా బీఏసీలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చేవారని తెలిపారు. బీఏసీ అంశం గురించి రఘునందన్ రావు అడిగినా.. స్పీకర్ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కేసీఆర్ ను ఓడగొట్టేవరకు నిద్రపోను అని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సభ ఎప్పుడు జరగలేదని ఈటల అన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజాసమస్యలను అసెంబ్లీలో చర్చించలేదని మండిపడ్డారు. ప్రజలు హూజూరాబాద్ లో కేసీఆర్ ను తిరస్కరించి.. సభలోకి నన్ను పంపారని చెప్పారు.
హుజూరాబాద్‌లో గన్ లైసెన్స్‌లు ఇచ్చి భయపెట్టాలని చూస్తున్నారు !
అటువంటిది తనను సభ నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు. మరమనిషి అంటే సొంత అలోచన లేకుండా ఇతరులు చెప్పినట్టు చేసే వారని...తాను రాజీనామా చేసినప్పుడు కనీసం నా రాజీనామా లేఖ తీసుకోకుండా అవమాన పరిచారన్నారు. 294 మంది ఎమ్మెల్యేలు, 36 మంది మంత్రులు, 10-12 పార్టీలకు రూమ్ సరిపోయినప్పుడు.. బీఏసీ సమావేశానికి బీజేపీని పిలవడానికి రూమ్ఎందుకు సరిపోదని ప్రశ్నించారు. స్పీకర్మా హక్కులు కాపాడలేక పోయారని ఈటల విమర్శించారు. సీఎం మాట ఇచ్చి తప్పే వాడని.. చేస్తాడు అనే నమ్మకం ఎవరికి రావడం లేదని విమర్శించారు. వీఆర్వో సమస్యలు సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, గొల్ల కురుమల సమస్యలు అన్నీ చర్చించాలి. ఆర్టీసీ నిండా ముంచింది కెసిఆర్. ఇవన్నీ చర్చ జరగాల్సి ఉందన్నారు.
కేసీఆర్ తిట్టిన తిట్లకు ఏం చేయాలి ?
కానీ అలాంటి చర్చ జరగకుండా తమను బయటకు పంపారని విమర్శించారు. మరమనిషి అన్నందుకే ఇంత బాధ పడుతున్నారు. కెసిఆర్ ప్రధానిని ఫాసిస్ట్ అన్నారు దద్దమ్మ, చవట, భ్రష్టులు, రండ, లఫుట్, సన్యాసి, మతపిచ్చి, కులపిచ్చి గాళ్ళు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారరని.. సంస్కార హీనుడు, అబద్దాల కోరు కెసిఆర్ అని విమర్శించారు. బీసీ బిడ్డగా ఒక గవర్నర్ వస్తె గౌరవించని సంస్కార హీనులు కెసిఆర్, ఆయన పార్టీ అని మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ప్రజాభిప్రాయానికి రావాలని సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి స్పీకర్ ఉంటే బెంచ్ ఎక్కేవాల్లం కాదు, గవర్నర్ చైర్ తన్నేవాల్లం కాదన్నారు. ఆనాడు అవే కెసిఆర్ కి మంచింగ అనిపించాయి. ఇప్పుడు చక్రవర్తిలా, రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.