ప్రేమికులు గొడవ పడితే ఎలా ఉంటుందో చూపించమని ప్రేమ్, శ్రుతిలకి చిటిలో వస్తుంది. నిజంగానే ప్రేమిస్తున్నావ్ అనుకున్నా ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావ్ అనుకోలేదని శ్రుతి అంటుంది. నటిస్తుంది నేను కాదు నువ్వే అని ప్రేమ్ అంటాడు. ఇద్దరు తమ మనసులో ఉన్న కోపాన్ని అంతా బయటపెట్టుకుంటూ అరుచుకుంటూ ఉండటంలో అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. తులసి ఆపమని చెప్పినా కూడా ప్రేమ్ గొడవ పడుతూనే ఉంటాడు. దీంతో తులసి కోపంగా గట్టిగా రేయ్ ప్రేమ్ ఇక ఆపురా అని అరవడంతో ఇద్దరు చుట్టూ చూసుకుంటారు. మీరు నటిస్తున్నారా లేదా నిజంగా దెబ్బలాడుకుంటున్నారా అని తులసి అడిగేస్తుంది. మేము ఎందుకు దెబ్బలాడుకుంటాం టాస్క్ చేశామని శ్రుతి ప్రేమ్ అంటారు. నటించడం కాదు జీవించేశారు కాసేపు అందరినీ టెన్షన్ పెట్టేశారు అని అనసూయ అంటుంది.


ఇక ముసలోళ్లకి డాన్స్ చెయ్యమని చీటి వస్తుంది. ‘రాను రాను అంటోంది చిన్నదో’.. పాటకి ముసలోళ్ళు ఇద్దరు డాన్స్ ఇరగదీస్తారు. దివ్య తర్వాత చీటీ నందు వాళ్ళతో తీయిస్తుంది. పార్టనర్ ని చేతుల మీదకి ఎత్తుకుని డాన్స్ చెయ్యాలి అని వస్తుంది. అది విని తులసితో సహా ఇంట్లో వాళ్ళు కాస్త ఇబ్బందిగా మొహాలు పెడతారు. చిట్టి నడుమునే చూస్తున్నా అంటూ నందు, లాస్య డాన్స్ వేస్తారు. లాస్యని ఎత్తుకుని నందు చాలా సరదాగా డాన్స్ వేయడం చూసి తులసి ఫీల్ అవుతుండటం సామ్రాట్ చూస్తాడు. తులసికి పాట పాడమని వస్తుంది. తులసి తన సంతోషంగా ఉన్న విషయాలు గుర్తుకు తెచ్చుకుంటూ పాట పాడుతుంది.


Also Read: మాధవ్ కి ఝలక్ ఇచ్చిన రుక్మిణి- దేవుడమ్మకి నిజం చెప్పిన సత్య


లక్కీ, హనీ, సామ్రాట్ ముగ్గురు కలిసి డిజే టిల్లు పాటకి డాన్స్ వేసి సంబరపడతారు. తర్వాత దివ్య స్లీ తియ్యమని చెప్తుంది. మీకు నచ్చిన కథ చెప్పాలి అని అందులో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది కథలాంటి నిజం అని సామ్రాట్ అంటాడు. ఈరోజు నేను విజ్ఞేశ్వరుడు మహిమ తెలుసుకున్నాను. నా కథలో బాస్ మొండివాడు, చెవిటి వాడు. ఈ హేట్ హిమ్. అలాంటి వ్యక్తి నా కళ్ల ముందు కనిపిస్తే చెంప పగలగొడతాను. తన బిజినెస్ పార్టనర్ ని అపార్థం చేసుకోవడమే కాకుండా ఇంటి మీదకి వెళ్ళి రచ్చ చేస్తాడా? తన బిజెనెస్ పార్టనర్ ని తన మాజీ భర్త బతిమలాడుకున్నాడు. తానే మాజీ భర్త అని ఆఫీసులో తెలియనివ్వద్దు అని చెప్పాడు. ఆ మాటకి కట్టుబడింది. బాస్ ఆగడలు సహించింది కానీ మాజీ భర్తని మాత్రం ఎక్స్ పోజ్ చెయ్యలేదు. నూటికో కోటికో ఇలాంటి మంచి వాళ్ళు ఉంటారు. చేసిన తప్పుకు ఆమె మాజీ భర్త ఆమె కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగినా తప్పు లేదు. ఆ బిజినెస్ మెన్ తరపున ఆ మహాతల్లికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను’ అని సామ్రాట్ అనేసరికి అందరూ షాక్ అవుతారు.


నందు, లాస్య అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతారు. తులసిగారు ఈ బాస్ చేసిన తప్పులు క్షమించండి రేపు ఆఫీసుకి రండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని హనీని తీసుకుని సామ్రాట్ కూడా వెళ్ళిపోతాడు. తులసి దేవుడి ముందు కూర్చుని దండం పెట్టుకుంటూ తన మనసులో ఉన్న సంతోషాన్ని పంచుకుంటుంది.


Also Read: సామ్రాట్ ముందే నందుని అవమానించిన అనసూయ- పండగ సంబరాల్లో గొడవపడిన ప్రేమ్, శ్రుతి


తరువాయి భాగంలో..


తులసి వనం దగ్గరకి తులసిని సామ్రాట్ తీసుకుని వస్తాడు. అక్కడ చిన్న గుంట ఉంటే దాన్ని దాటాడానికి తులసి భయపడుతుంటే సామ్రాట్ చెయ్యి అందిస్తాడు.