నందు చెప్పకుండా ఉద్యోగం మానేసిన విషయం తెలిసి సామ్రాట్ ఫైర్ అవుతాడు. నందు ప్లేస్ లో తనకి ఇవ్వమని లాస్య సామ్రాట్ ని అడుగుతుంది. సరే వెళ్ళి ఆర్డర్ లెటర్ టైప చేయించి తీసుకురమ్మని చెప్తాడు. నా మీద నమ్మకం ఉంచి జనరల్ మేనేజర్ పోస్ట్ ఇస్తున్నందుకు చాలా థాంక్స్ అని సంబరపడిపోతుంది. కానీ సామ్రాట్ మాత్రం ఎందుకు అంత ఆరాటం ఆర్డర్ టైప్ చేయించి తీసుకురమ్మన్నది నీ పేరు మీద కాదు తులసి గారి పేరు మీద అని చెప్పేసరికి లాస్య ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆవిడ నిర్లక్ష్యం వల్ల 10 కోట్ల లాస్ వచ్చింది అన్నీ తెలిసి మళ్ళీ ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారు తనకి చదువు కూడా లేదని అంటుంది. అన్నీ ఉన్న నందుకి ఇస్తే ఏం చేశాడు చెప్పాచెయ్యకుండా మానేశాడు ఇప్పుడు తులసి గారు ఆ బాధ్యత తీసుకుంటారు అని చెప్తాడు.


నేను ఈవిడకి బాస్ అవుదామని అనుకుంటే ఈవిడ నా నెత్తికి ఎక్కి కూర్చుందే అని లాస్య మనసులో అనుకుంటుంది. తులసి దగ్గరకి వచ్చి ఫైల్ ఇచ్చి సైన్ చెయ్యమని ఇస్తుంది. నాకు దీనితో సంబంధం లేదని చెప్తుంది. నందగోపాల్ గారు వచ్చిన తర్వాత సైన్ చేయించుకోమని చెప్తుంది.. తాను రాడు జాబ్ మానేశాడు అని చెప్తుంది. సామ్రాట్ గారు నిన్ను మళ్ళీ జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేశారని లాస్య చెప్తుంది. కానీ తనకి ఇష్టం లేదని తులసి అంటుంది. ఇంకాసేపటిలో క్లయింట్స్ తో మీటింగ్ ఉంది జనరల్ మేనేజర్ హోదాలో నువ్వు కూర్చోవాలని చెప్తుంది. వెంటనే తులసి సామ్రాట్ దగ్గరకి వెళ్తుంది. మీ నిర్ణయం నాకు నచ్చలేదని వెనక్కి తీసుకోమని చెప్తుంది. కానీ సామ్రాట్ మాత్రం ఒప్పుకోడు. ఈసారి నా వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందేమో వద్దని తులసి అంటుంది. ఈసారి అలా జరగదు మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే నేనే బాధ్యత తీసుకుంటాను అని చెప్తాడు.


Also read: అక్కాచెల్లెళ్ల త్యాగాల మధ్య నలిగిపోతున్న ఆదిత్య ఊహించని నిర్ణయం- ఆందోళనలో దేవుడమ్మ


బాస్ గా ఒక ఫ్రెండ్ గా అడుగుతున్నా జనరల్ మేనేజర్ గా కాదనకండి అని అడుగుతాడు. తులసి ఒప్పుకుంటుంది. మీటింగ్ కి కావాల్సిన దాని గురించి సామ్రాట్ మాట్లాడుతూ ఉంటే మధ్యలో లాస్య కల్పించుకుంటూ నేను చూసుకుంటానులే అని చెప్తూ ఉంటుంది. దీంతో సామ్రాట్ సీరియస్ అవుతాడు. మీటింగ్ స్టార్ అవుతుంది.. లాస్య మాట్లాడబోతుంటే సామ్రాట్ మాత్రం అడ్డుకుంటాడు. జనరల్ మేనేజర్ తులసి గారు తను మాట్లాడతారు ఇది నీ ఇల్లు కాదు నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చెయ్యడానికి నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. అవమానంగా భావించిన లాస్య మీటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది.


ఆవేశంగా బయటకి వచ్చి స్టాఫ్ అందరి ముందు సామ్రాట్ తులసి గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఈ ఆఫీసులో సామ్రాట్ గారికి ఎవరి మాట్లాడిన నచ్చదు ఒక్క తులసి మాత్రమే మాట్లాడాలి. చదువు లేదు నోరు తెరిచి ఒక్క ముక్క ఇంగ్లీషు మాట్లాడటం రాదు అలాంటిది నేను తులసి ముందు తలదించుకుని మాట్లాడాల్సి వస్తుంది. కాసేపు మాట్లాడితే అందులో 50 సార్లు తులసి పేరు కలవరిస్తారని లాస్య అరుస్తుంది. ఎందుకు మేడమ్ అలా గట్టిగా అరుస్తున్నారని ఆఫీసులో ఒక మేడమ్ అంటుంది. సామ్రాట్ గారు ముందు మగాడు తర్వాత బాస్ అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. సామ్రాట్ గారి గురించి తప్పుగా మాట్లాడకండి ఆయన అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటారని స్టాఫ్ చెప్తారు.


Also read: సులోచనకి యాక్సిడెంట్ చేసిన మాళవికని కాపాడిన యష్- భర్త మీద అంతులేని నమ్మకం పెట్టుకున్న వేద


బురద చల్లకండి అని స్టాఫ్ అంటారు. రివర్స్ లో అందరూ లాస్యని దెప్పిపొడుస్తారు. పైకి మాత్రం ఫ్రెండ్స్ అని చెప్పి నటిస్తారు కానీ వాళ్ళిద్దరూ అంతకమించి అని అంటుంటే సామ్రాట్ వస్తాడు. సోరి సర్ ఇది నా చివరి తప్పు అనుకుని క్షమించండి అని బతిమలాడుతుంది. ఇది నీ మొదటి తప్పు కాదు ఇంతకముందు కూడా ఇలాగే చేశావ్ అప్పుడు నేను నీకు పెట్టిన కండిషన్ గుర్తుందా మీ వల్ల ఎలాంటి సమస్య రాకూడదు అని చెప్పాను కానీ నువ్వు చేసింది ఏంటి తులసి గారు చేసిన మేలు మర్చిపోయి స్టాఫ్ ముందు ఆమె గురించి తప్పుగా మాట్లాడావ్ చాలా తప్పు చేశావ్ అని అరుస్తాడు. తులసి అప్పుడే మీటింగ్ నుంచి బయటకి వచ్చి సామ్రాట్ లాస్య మీద అరవడం చూస్తుంది. లాస్యని బయటకి వెళ్లిపొమ్మని చెప్తాడు. జాబ్ నుంచి తీసేయొద్దని తన రిపిటేషన్ నాశనం అవుతుందని లాస్య సామ్రాట్ ని బతిమలాడుకుంటుంది. నీకు రిపిటేషన్ గురించి కూడా తెలుసా అని కోపంగా అరిచి వెళ్లిపొమ్మని చెప్పేస్తాడు.