భాగ్య తులసికి ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడుతుంది. నువ్వు మా ఆయనకి చేసిన సహాయానికి ఫలితంగా నీ రుణం తీర్చుకోవాలని అనిపించింది. అందుకే లాస్య దగ్గర ఉన్న బావ వీడియో డిలీట్ చేశానని చెప్తుంది. సాక్ష్యం లేదు కాబట్టి బావగారు గృహహింస కేసు నుంచి తప్పించుకున్నట్టేనని చెప్తుంది. ఆ మాట విని తులసి చాలా సంతోషపడుతుంది. ఇది మామూలు సహాయం కాదని పొగుడుతుంది. ఇక నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలని అనిపించినా ఈ చెల్లి ఉందని మర్చిపోకని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రాజ్యలక్ష్మి దగ్గరకి బసవయ్య వచ్చి మళ్ళీ ఎక్కించే ప్రయత్నం చేస్తాడు. దివ్య నుంచి వదినని ఎలాగైనా కాపాడాలని ప్రసన్న అంటుంది. ఏదో ఒకటి చేసి దివ్య తన కాలు జోలికి రాకుండా ఆపమని రాజ్యలక్ష్మి చెప్తుంది. అప్పుడే విక్రమ్ వచ్చి తల్లి కాలు చూసి దివ్య ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా పని చేసిందా అని అడుగుతాడు. కాలు రావడం లేదని నటిస్తుంది.


Also Read: మనసుల్ని మెలిపెట్టించేసిన తింగరిపిల్ల - కృష్ణని వదులుకోలేనని బాధపడుతున్న మురారీ


కొద్ది రోజుల పాటు దివ్యని రాజ్యలక్ష్మి కాలు జోలికి రావొద్దని చెప్పమని ప్రసన్న అంటుంది. దివ్య ఎంట్రీ ఇచ్చి ఆ దేవుడు దిగి వచ్చి చెప్పినా వినను మసాజ్ వద్దంటే సర్జరీ చేస్తానని అంటుంది. ఈరోజు అత్తయ్యని నడిపిస్తానని మాట ఇచ్చాను చేయాలా వద్దా అంటే నడిపించమని విక్రమ్ అంటాడు. నేను ఏడుస్తుంటే దీనికి బాగుందని రాజ్యలక్ష్మి మనసులో అనుకుంటుంది. తనకి ఎవరూ మసాజ్ చేయవద్దని భయంగా అంటుంటే మీరందరూ హాల్లో వెయిట్ చేయండి అత్తయ్య నడుచుకుంటూ మీ దగ్గరకి వస్తుందని దివ్య ధీమాగా చెప్తుంది. అందరూ బయటకి వెళ్లిపోతారు. నా కాలు నొప్పి తగ్గించడం నీ వల్ల కాదు రేపు నిన్ను ఇంతకంటే ఎక్కువ టార్చర్ పెడతానని రాజ్యలక్ష్మి బెదిరించేందుకు ట్రై చేస్తుంది. బుద్ధిగా నడుస్తూ హాల్లోకి వస్తే పని అయిపోతుంది కాదు కూడదు అంటే దబిడి దిబిడే.. ఏ నరం నొక్కితే కాలు పడిపోతుందో తనకి తెలుసని దివ్య మసాజ్ మొదలుపెడుతుంది.


Also Read: కావ్య ఫినిషింగ్ టచ్ సూపర్- అన్ని నిజాలు చెప్పేసిన స్వప్న, రాహుల్ పని ఇక ఇత్తడే


నొప్పితో రాజ్యలక్ష్మి కేకలు పెడుతుంది. అత్తయ్య నొప్పితో బాధపడుతున్నారు రికవరీ అవడం లేట్ అవుతుంది మరి వదిలేయనా అని దివ్య గట్టిగా విక్రమ్ ని అడుగుతుంది. వద్దు అమ్మని బెడ్ మీద చూడలేకపోతున్నా తను నడిచేలా చూడమని చెప్తాడు. దివ్య అత్త కాలు పిసికేసి నలిపేసి దుమ్ముదులిపేస్తుంది. కాసేపటికి రాజ్యలక్ష్మిని నడిపిస్తూ హాల్లోకి తీసుకొస్తుంది. తల్లి నడవటం చూసి విక్రమ్ సంతోషంగా దివ్యని ఎత్తుకుని పైకి తిప్పేస్తాడు. తులసి కేసు గెలుస్తామని ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్తుంది. అప్పుడే లాస్య ఇంట్లోకి వస్తుంది. కావాలని మళ్ళీ నందు, తులసిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నేనేమీ తులసిలాగా పరాయి మగవాడి వెనుక పడటం లేదని లాస్య అంటుంది. నందు కారు తీసుకువెళ్లడానికి వచ్చాను. ఈరోజుతో నీకు శిక్ష తప్పదు నేరుగా జైలుకి వెళ్తావు ఇక నీకు కారుతో ఏం పని? అందరం కోర్టుకి వెళ్దాం అక్కడి నుంచి నందు వ్యాన్ లో జైలుకి వెళ్తాడని లాస్య ధీమాగా మాట్లాడుతుంది.