నందు లెటర్ రాసి దాన్ని తులసికి ఇవ్వమని రాములమ్మని బతిమలాడతాడు. అది తీసుకెళ్ళి రాములమ్మ తులసికి ఇవ్వడానికి భయపడుతుంది. అందులో సోరి అని ఉంటుంది. నువ్వేం తప్పు చేశావాని అంటే తప్పు చేసిన వాళ్ళతో మీరు మాట్లాడటం లేదని రాములమ్మ అమాయకంగా అంటుంది. తులసి దాన్ని కోపంగా చింపేసి చేతిలో పెడుతుంది. లాస్య మీద కోపంతో నీ మీద మాట జారాను అంతే కానీ నీమీద కోపం కాదని సోరి చెప్తాడు. వాడి సమస్యని అర్థం చేసుకోవమని అనసూయ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. లాస్య దౌర్జన్యం భరిస్తాను కానీ నీ మౌనం భరించలేనని అంటాడు. ఈ కేసు విషయంలో ఉపయోగపడే పని ఒకటి చేశానని తులసి అంటుంది. దివ్య రాజ్యలక్ష్మికి టీ తీసుకొచ్చి ఇస్తుంది. అత్త ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మరీ టీ తాగుతుంది.
Also Read: వావ్ వాట్ ఏ సీన్.. రుద్రాణిని వాయించేసిన కావ్య, సపోర్ట్ చేసిన అపర్ణ- శృతికి హ్యాండ్ ఇచ్చిన రాహుల్
రాజ్యలక్ష్మి: మీ ఆయన్ని ముగ్గులోకి దింపడానికి ట్రై చేశావ్ వర్కవుట్ కాలేదు కదా. ఇప్పటికైనా తెలిసిందా ఇది రాజ్యలక్ష్మి రాజ్యమని ఈ తల్లి చేతిలో నుంచి మొగుడి చేతిని లాక్కోలేవని
దివ్య: నాకు తెలుసు. నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ దెబ్బ కొట్టాలని అనుకుంటున్నా ఇది జరిగి తీరుతుంది. విక్రమ్ తో మీది పాతికేళ్ళ అనుబంధం కానీ దెబ్బ కొట్టడం ఖాయం
రాజ్యలక్ష్మి: ఈ తల్లి ప్రేమ వైఫైలా కమ్ముకుని ఉంటుంది వాడు నీ నెట్ వర్క్ పరిధిలోకి రాడు ఛాలెంజ్
దివ్య: నీ కొడుకు నా గుప్పిట్లోకి వస్తాడని రాత్రంతా నిద్రలేకుండా ఉన్నారు కదా కాపలా కూడా పెట్టారు కదా నీలో భయం మొదలైందని అర్థం అయిపోతుంది
అప్పుడే విక్రమ్ వస్తాడు. దివ్యతో కలిసి కోర్టుకి వెళ్తానని అంటాడు. నందు, లాస్యకి కామన్ కోలీగ్స్ ని తులసి ఇంటికి పిలిపిస్తుంది. మన తరఫున లాస్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వీళ్ళు వచ్చారని మోహన్ చెప్తాడు. వీళ్ళ ఎవిడెన్స్ తో లాస్యని బోల్తా కొట్టించవచ్చని అంటాడు. అందరూ కోర్టుకి వస్తారు. లాస్య వాళ్ళు కూడా వచ్చి తులసిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. కేసు తానే గెలుస్తానని ధైర్యంగా చెప్తుంది. మిమ్మల్ని భయపెడతానని లాస్య అంటే సరే భయపెట్టు చూద్దామని తులసి గట్టిగానే బదులిస్తుంది. కేఫ్ లో లాస్యని కొట్టి బయటకి గెంటేసిన విద్యో చూపించేసరికి తులసి అండ్ కొ మొత్తం షాక్ అవుతుంది. ఆరోజు జరిగిన దాన్ని భాగ్య మొత్తం వీడియో తీస్తుంది.
Also Read: పెళ్లి చేసుకొచ్చిన అభిమన్యు, మాళవిక షాక్ - హనీమూన్ కి చెక్కేసిన వసంత్ దంపతులు
ఎలా ఉంది దివ్య మీ నాన్న పెర్ఫామెన్స్ అంటుంది. ఈ వీడియో చూడగానే జడ్జి పెద్ద అవార్డు ఇస్తారని వెటకారంగా మాట్లాడుతుంది. లాస్య ముందు తలవంచి తను బతకలేనని ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందని నందు అంటాడు. మోహన్ నందు కోలీగ్స్ ని విచారణకి పిలుస్తారు. నందు లాస్యని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే వాడు కానీ తను మాత్రం మాముందే దెబ్బలాడి పరువు తీసేది. అలాంటిది నందగోపాల్ తనని కొట్టడం అనేది నమ్మేది కాదని సురేష్ చెప్తాడు. లాస్య అహంకారం పొగరు కళ్ళారా చూశానని మరొక ఆమె చెప్తుంది.